Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
ఒంటరితనం : ఒంటరిగా ఆహారం తీసుకోవడం, ఊబకాయానికి క్రమంగా మరణానికి కూడా దారితీస్తుంది.
ఒంటరితనం : ఒంటరిగా ఆహారం తీసుకోవడం, ఊబకాయానికి క్రమంగా మరణానికి కూడా దారితీస్తుంది.
మానవులు అంటేనే ఆలోచనా స్థాయిలు, భావాలు కలిగిన సామాజిక జీవులుగా ఉంటారు. క్రమంగా అనేక అధ్యయనాలు, ప్రకారం, ఒంటరితనం మరియు మానసిక/శారీరిక ఆరోగ్య సమస్యల మధ్య ఒక సంబంధాన్ని చూపించాయి. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఒంటరితనం అనుభవిస్తున్నవారు అధిక ఆందోళనలకు గురవుతూ డిప్రెషన్ బారినపడడం మనం తరచుగా వింటూనే ఉంటాం. ఈ డిప్రెషన్, జీవక్రియలను ప్రభావితం చేస్తూ హార్మోనుల అసమతౌల్యానికి కారణమై అనేక ఆరోగ్య పరిస్థితులకు కూడా కారణం అవుతుందని మనం ఇదివరకు వ్యాసాలలో తెలుసుకున్నాం.
ఇప్పుడు మరొక అధ్యయనంలో, ఒంటరితనంతో బరువుపెరగదానికి కూడా సంబంధం ఉందన్న ఆలోచనను ఇచ్చింది.
దక్షిణ కొరియా, సియోల్లోని డాంగ్గుక్ యూనివర్శిటీ, ఇల్సాన్ ఆసుపత్రిలోని పరిశోధకుల బృందం నిర్వహిస్తున్న అధ్యయనాల ప్రకారం, ఒంటరిగా ఆహారం తీసుకోవడం, పెద్దవారిలో మెటబాలిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందుతున్న ప్రమాదాన్ని సూచిస్తుందని ఈ అధ్యయనం ప్రతిపాదించింది. అనగా జీవక్రియల అసమతుల్యం. ఇది క్రమంగా రక్తపోటు, కొలెస్ట్రాల్, మరియు డయాబెటిస్ అధికస్థాయిలకు కారణంగా పరిణమిస్తుందని తేల్చింది.

ఈ బృందం ఒంటరిగా ఆహారం తీసుకునే 7,725మంది పెద్దవారి మీద అధ్యయనం చేసింది. మరియు ఒంటరిగా ఆహారం తీసుకునే పురుషుల ఆరోగ్య సమస్యల తీవ్రతను పెంచే ప్రమాదం ఉన్న అనేక కారకాలను కూడా అధ్యయనంలో భాగంగా చేయడం జరిగింది (ధూమపానం, మద్యపానం, వయస్సు, వృత్తి, మరియు వ్యాయామం మొదలైనవి)
వాస్తవానికి 45% ఊబకాయం మరియు 64% జీవక్రియల అసమతుల్య ప్రమాదాలు పెరుగుతున్నట్లుగా ఈ అధ్యయనం సూచించింది. అంతేకాకుండా ఒంటరిగా ఆహారం తీసుకునే మహిళల కన్నా పురుషులు అత్యధికంగా రెండురెట్లు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నట్లుగా తేల్చింది(29% అత్యధిక పెరుగుదలను సూచించింది).
ఒబేసిటీ రీసెర్చ్ అండ్ క్లినికల్ ప్రాక్టీస్ అని పిలిచే జర్నల్ లో ప్రచురించబడిన ఈ నివేదిక ప్రకారం, ఈ అధ్యయనం ఇప్పుడు ఒంటరితనం మరియు మానసిక / శారీరిక రుగ్మతలు సంబంధించిన అధ్యయనాలను అనుసంధానించేలా కీలకం కానుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
