మీరు పంచదారని అధికంగా సేవిస్తున్నారని సూచించే 8 చిహ్నాలు

భూమి మీద మానవ చరిత్ర మొదలైన తరువాత ఇప్పటి వరకు అత్యంత అపాయకరమైన పదార్ధాలతో పంచదార ముఖ్యమైనది.

దురదృష్టవశాత్తు పంచదార రుచి దానిని ఒక వ్యసనంగా మార్చేస్తుంది. అందుకే దుకాణాలలో ప్రతి పదార్థానికి పంచదారను కలిపి రుచిని పెంచుతారు.

8 Signs You Are Eating Too Much Sugar

మీరు కనుక ఈ తెల్లని పదార్థం యొక్క రుచికి బానిసగా మారినట్లైతే అది మీ తప్పుకాదు. మీలాగే ప్రతి ఒక్కరూ ఎదో ఒక దశలో పంచదారకు దాసోహం అన్నవారే!వారు కూడా దాని బలమైన ఆకర్షణ నుండి తప్పించుకోవడానికి పాట్లు పడ్డవారే!

మీరు పంచదార పట్ల అధికంగా ఆపేక్ష ను చూపిస్తున్నారని తెలిపే ఎనిమిది సంకేతాలు మీ కోసం!

1. మీరు తరచుగా మానసిక స్థితిలో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు:

1. మీరు తరచుగా మానసిక స్థితిలో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు:

పంచదారను మన శరీరం త్వరగా గ్రహిస్తుంది. కనుకనే పంచదరతో కూడిన ఆహారాన్ని కానీ పానీయాలను కానీ తీసుకున్న వెంటనే మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.

శాస్త్రీయంగా కూడా,దీనిని బ్లడ్ షుగర్ స్పైక్ అంటారు. పంచదార తింటే పది ఏనుగుల బలం అని నానుడి.

పంచదారని శరీరం కూడా అంతే త్వరగా వినియోగించుకోవడం వలన గ్లూకోజ్ స్థాయి అంతే త్వరగా పడిపోతుంది. దీనివలన మీలో విసుగు, చికాకు పెరుగుతాయి. మీ పరిస్థితి ఇంచుమించుగా PMS సమస్యను ఎదుర్కొనే వారి తరహాలోనే ఉంటుంది.

2. ఎల్లప్పుడూ మీరు పంచదార తినాలనే కోరికతో ఉంటారు:

2. ఎల్లప్పుడూ మీరు పంచదార తినాలనే కోరికతో ఉంటారు:

పంచదార తినడం కూడా వ్యసనం లాంటిదే! ఏ వ్యసనపరులకైనా తమ శరీరం ఆ వ్యసన పదార్ధాన్ని పూర్తిగా వినియోగించుకుని శరీరంపై దాని యొక్క ప్రభావాన్ని కోల్పోతే, తిరిగి దానిని తీసుకోవాలనే కోరిక పూర్తిగా కమ్ముకుంటుంది.

మీ నాలుకపై ఉండే రుచి మొగ్గలు కూడా పంచదార రుచికి అలవాటు పడిపోవడం వలన, పదేపదే ఆ రుచి కావాలని కోరుకుంటాయి.

3. మీ చర్మంపై మొటిమలు అధికంగా ఉంటాయి:

3. మీ చర్మంపై మొటిమలు అధికంగా ఉంటాయి:

సాధారణంగా యవ్వనంలో మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య మీకు కూడా ఉండే ఉంటుంది. మీ చర్మంపై ఇప్పుడు కూడా యవ్వనంలో ఉన్నప్పటిలా మొటిమలు వస్తున్నాయా? అయితే మీ అసౌకర్యం వెనుక ఖచ్చితంగా మీరు తినే మిఠాయిలు, పిండివంటలలో ఉండే చక్కెర యొక్క హస్తం ఉంది.

 4. మీకు తరచుగా తలనొప్పి, మైగ్రేన్ లతో బాధ పడుతున్నారా?:

4. మీకు తరచుగా తలనొప్పి, మైగ్రేన్ లతో బాధ పడుతున్నారా?:

మీరు పంచదారని చాలా అధికంగా తీసుకునేటట్లైతే, మీ శరీరం దాని దైనందిన అవసరాలకు పంచదార ద్వారా విడుదలైన శక్తి మీద ఆధారపడటానికి అలవాటు పడుతుంది. దీనివలన మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయి అకస్మాత్తుగా పడిపోయి, మీకు తరచుగా తలనొప్పి మరియు మైగ్రేన్ కలుగుతాయి. మీ శరీరం శక్తి కొరకు కొవ్వులను వినియోగించడంలో విఫలమయ్యి హైపోగ్లైసీమియా పరిస్థితి ఎదురవుతుంది.

5. మీరు బరువు కోల్పోవడం కష్టతరమవుతుంది:

5. మీరు బరువు కోల్పోవడం కష్టతరమవుతుంది:

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నప్పటికీ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికి మీరు బరువు కోల్పోనట్లైతే, మీరు అధికంగా పంచదార తింటునట్లే! అంతేకాక సహజ చెక్కెరలు అధికంగా ఉన్న పండ్లను మీరు తిన్నా ఈ సమస్య ఎదురవుతుంది.

మన శరీరం శక్తి కొరకు చెక్కరలను అతి సులభంగా వినియోగించుకుంటుంది. కనుక మీరు అధికంగా పంచదార తినేవారైతే మీ శరీరం దైనందిన కార్యక్రమాలకై శక్తి విడుదలకు కొవ్వును కరిగించకుండా చెక్కరపై ఆధారపడటానికి అలవాటు పడుతుంది. దీనివలన మీరు బరువు కోల్పోరు.

6. మీకు హార్మోన్ల అసమతుల్యత సమస్య ఎదురవుతుంది:

6. మీకు హార్మోన్ల అసమతుల్యత సమస్య ఎదురవుతుంది:

హార్మోన్ సమస్యలైన PCOS వంటివి అధిక చెక్కరల వినియోగం మరియు ఒత్తిడికి ముడిపడి ఉంటాయి. మీ నెలసరి ఋతుస్రావం సరైన సమయానికి రానట్టైనా, లేదా మీకు PCOS ఉన్నట్లు నిర్దారణ జరిగినా మీరు అధికంగా పంచదార తింటున్నట్లే!

7. మీ నోట్లో పిప్పి పళ్ళు ఏర్పడతాయి:

7. మీ నోట్లో పిప్పి పళ్ళు ఏర్పడతాయి:

ఈ సమస్య కేవలం పసి పిల్లలలో మాత్రమే కాదు పెద్దలలో కూడా ఉంటుంది. అధికంగా మిఠాయిలు, చాకలేట్లు తినడం వలన పెద్దలలో కూడా పిప్పి పళ్ళు ఏర్పడతాయి.

మీ పళ్ళు నలుపుగా మారి మీరు ఏదైనా ఆహారాన్ని కొరికినపుడు నొప్పిగా ఉన్నట్లయితే, మీరు అధిక చెక్కెర సేవిస్తున్నారని తెలుస్తుంది. మీకే కాకుండా మీ నోట్లో తిష్ట వేసిన బాక్టీరియాకు కూడా మిఠాయిలు అంటే ప్రాణం మరి!

8. మీరు పంచదార అధికంగా సేవిస్తున్నారూ:

8. మీరు పంచదార అధికంగా సేవిస్తున్నారూ:

నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోండి. తమ తప్పును ఒప్పుకోవడానికి మదనపడే వారు మాత్రమే పై అంశాలను పరిశీలించుకోవాలి.

మీరు ప్రతిరోజూ ఒక పేస్ట్రీ తింటున్నారా? చాకలేట్లు, మిఠాయిలు, పిండివంటలు మీ దైనందిన జీవితంలో విడదీయరాని భాగమయ్యాయా? అయితే ఖచ్చితంగా మీ చక్కెరను అధికంగా తింటున్నట్లే!

Desktop Bottom Promotion