For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శృంగారం ముగిశాక ఇలా చేస్తేనే ఆరోగ్యానికి మంచిది, సెక్స్ పూర్తయ్యాక కొందరు మగవారు అలా చేస్తుంటారు

సాధారణంగా పెళ్లైన జంట శృంగారం తర్వాత ఏవేవో చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొందరు మగవారు కొన్ని రకాల పనులు చేస్తుంటారు. శృంగారం ముగిశాక ఇలా చేస్తేనే ఆరోగ్యానికి మంచిది, సెక్స్ పూర్తయ్యాక కొందరు మగవారు

|

సాధారణంగా పెళ్లైన జంట శృంగారం తర్వాత ఏవేవో చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొందరు మగవారు కొన్ని రకాల పనులు చేస్తుంటారు. కొందరైతే రసక్రీడలో బాగా అలసిపోయి హాయిగా నిద్రపోతుంటారు. అయితే సెక్స్ అయిపోయాక అందరు మగవారు చేసే కొన్ని పనులు సాధారణంగా ఒకే రకంగా ఉంటాయి.

శృంగారం అనేది స్త్రీ, పురుషులిద్దరూ కలిసి చేసే ఒక గొప్ప యుద్ధం. ఈ యుద్ధంలో గమ్యస్థానానికి చేరేంతవరకూ ఎవరి సాయశక్తులా వారు పోరాడి తీరాల్సిందే. అయితే, శృంగారం తర్వాత అమ్మాయిల విషయం అలా ఉంచితే, అబ్బాయిలు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తుంటారు. ఇందులో తేడా ఉండదు.

అవగాహన కచ్చితంగా అవసరమే

అవగాహన కచ్చితంగా అవసరమే

ఇక శృంగారం గురించి తెలుసుకోవడం, ఆలోచించడం తప్పు కాదు. ఈ సృష్టి మూలం.. మనం పుట్టడానికి కారణం కూడా శృంగారమే కాబట్టి దానిపై అవగాహన కచ్చితంగా అవసరమే. అయితే చాలా మందికి శృంగారం ఎలా చేయాలో తెలుసు కానీ శృంగారం తర్వాత ఎటువంటి పనులు చేయకూడదో తెలియదు. దీనిపై చాలామందిలో కొన్ని అపోహలు, అనుమానాలు ఉంటాయి. అయితే శృంగారం తర్వాత చేయాల్సిన పనులు, చేయకూడనివి ఏమిటో తెలుసుకోవాలి.

మూత్ర విసర్జన చేస్తే

మూత్ర విసర్జన చేస్తే

చాలామంది శృంగారం తర్వాత అలాగే బెడ్ పై పడుకోవడం చేస్తుంటారు. ఈ విధంగా ఎప్పటికీ చేయకూడదు. ఎందుకంటే ఇద్దరి మధ్య సంభోగం జరిగినప్పుడు ఇద్దరి శరీరాల నుంచి స్కలనం జరగడం వలన ఆ ప్రదేశంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి శృంగారం తర్వాత వెంటనే నీటితో ఆ ప్రదేశాలను శుభ్రపరచుకోవాలి. ఇక కొందరు సెక్స్ పూర్తయ్యాక మూత్ర విసర్జన చేస్తుంటారు. ఆ సమయంలో కాస్త నొప్పిగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

బాత్రూమ్ కి వెళ్లాలి

బాత్రూమ్ కి వెళ్లాలి

శృంగారంలో పాల్గొన్న తర్వాత చాలామంది చేయని పనిలో యూరిన్ వెళ్ళకపోవడం. స్కలనం జరిగిన కొన్ని నిముషాల తర్వాత దంపతులు కచ్చితంగా యూరిన్ చేయడం చేయాలి. ఇలా చేయకపోతే ఏదో తెలియని నొప్పిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ ఆ ప్రదేశంలో వస్తాయి. సెక్స్ తర్వాత వెంటనే వాష్ రూమ్ కు వెళ్లాలి. ఎందుకంటే స్మెర్మ్ ద్వారా గానీ లేదా ఏదైనా కారణాల వల్ల ఆడవారి ఆ అవయంలోకి బ్యాక్టీరియా ఎంటరయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల వారు దాన్ని క్లీన్ చేసుకుంటే ఎలాంటి ఇన్ ఫెక్షన్ రాదు. మీ పార్టనర్ తో సెక్స్ లో పాల్గొన్న వెంటనే మీరు ఈ పనిని తప్పకుండా చేయండి.

సబ్బులను ఉపయోగించకండి

సబ్బులను ఉపయోగించకండి

సెక్స్ పూర్తయిన తర్వాత కొంతమంది వారి జననాంగాలను సబ్బుతో క్లీన్ చేస్తుంటారు. ఇలా చేయటం చాలా తప్పు. సెక్స్ తర్వాత గానీ లేదా ఎప్పుడైనా సరే ఆ ప్రాంతాన్ని సబ్బుతో క్లీన్ చేయడం అనేది చాలా తప్పు. సబ్బులు అక్కడ ఉండే సున్నితమైన చర్మంపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్బులను ఉపయోగించకూడదు.

వెట్ వైప్స్ ఉపయోగించకండి

వెట్ వైప్స్ ఉపయోగించకండి

సెక్స్ సమయంలో కొంతమంది కండోమ్ యూజ్ చేస్తూ ఉంటారు. వీటిలోని రసాయనాలు మీ సున్నితమైన జననేంద్రియాలపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందుచే ఆ ప్రాంతాన్ని డెటాల్ లేదా వెనిగర్ తో క్లీన్ చేసుకోవటం చాలా మంచిది. ముఖ్యంగా సెక్స్ తర్వాత కూడా మీరు ఆ ప్రాంతాన్ని వెంటనే వెనిగర్ తో శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. సెక్స్ తర్వాత ఆడవాళ్లు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఇదేనని గుర్తించుకోవాలి.

మత్తు పదార్థాలను తీసుకోవాలని

మత్తు పదార్థాలను తీసుకోవాలని

సెక్స్ పూర్తయిన తర్వాత వెంటనే మంచి నీరు తాగడం చాలా మంచిది. సెక్స్ వల్ల మీ బాడీ డీ-హైడ్రేట్ అవుతుంది. అందుచే రతి పూర్తయ్యాక చల్లని నీటిని సేవించటం వల్ల మీ బాడీ హైడ్రేట్ అవుతుంది. అంతేకాకుండా బ్యాక్టీరియాను అరికట్టడానికి కూడా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అయితే సెక్స్ పూర్తయ్యాక కొందరు మగవారికి మత్తు పదార్థాలను తీసుకోవాలని ఉంటుంది. అలా చేయకపోవడమే మంచిది.

జంటగా కలిసి స్నానం చేసి

జంటగా కలిసి స్నానం చేసి

రెండు మనసులు, చీకటి గదిలో జరిగిన శృంగార కేళి తర్వాత దంపతుల మధ్య మరింత అనుబంధం ఆనందం కలుగుతుంది. అలా కాదని శృంగారం అయిపోయిన వెంటనే ఎవరికి వారు ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోవడం వలన మంచి రిలేషన్ మెయింటేన్ చేయలేరు. ఇద్దరి మధ్య అనుబంధం పెరగడానికి, మరుసటి రోజు శృంగారంలో ఆసక్తిగా పాల్గొనాలంటే ఒక రెండు నిముషాలు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత పడుకోవాలి. చాలామంది మగవాళ్లు పని అయిపోగానే అటువైపు తిరిగి పడుకుంటూ ఉంటారు. సెక్స్ పూర్తయ్యాక చాలా మంది మగవారు తమ భాగస్వామితో కలిసి స్నానం చేయాలని ఉబలాటపడుతుంటారు. అలా చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు.

లో దుస్తులు

లో దుస్తులు

శృంగారంలో పాల్గొనకున్నా లేదా రాత్రి నిద్రించే సమయంలోనైనా సరే లో దుస్తులు ధరించి అస్సలు నిద్రించకూడదు. ఈ విధంగా చేయడం వలన జననాంగాల వద్ద వేడి పుట్టి శృంగారంలో ఆసక్తిని తగ్గిస్తుంది. రోజు మొత్తంలో వేసుకున్న లో దుస్తులను కనీసం రాత్రి నిద్రించే సమయంలో ధరించకపోవడం మంచిది. స్కిన్ రాషెష్, ఇన్ఫెక్షన్స్ కలగకుండా ఉండాలంటే, జననాంగాలకు చల్లని గాలి తగలాలన్నా లో దుస్తులు వేసుకోకూడదు.

అనవసర విషయాలపై చర్చ వద్దు

అనవసర విషయాలపై చర్చ వద్దు

పని పూర్తయ్యాక ఏవైనా సమస్యలపై మాట్లాడకూడదు. శృంగారం పూర్తయ్యాక దాన్ని ఎంజాయ్ చేయాలంటే సమస్యలపై అస్సలు మాట్లాడుకోకూడదు. సమస్యలను చర్చించేందుకు సెక్స్ సమయాన్ని వాడుకోకూడదు. ఎందుకంటే ఆనందకరమైన, సంతృప్తికరమైన సెక్స్ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.

బాత్ టబ్ స్నానం వద్దు

బాత్ టబ్ స్నానం వద్దు

శృంగారం తరువాత స్నానం చేయడం మంచిదే. కానీ, బాత్ టబ్ లోకి నేరుగా వెళ్లకూడదట. యోని ప్రాంతంలో ప్రేరణకు గురై మరింత విచ్చుకుంటుంది. శృంగారం తరువాత బాత్ టబ్ స్నానం వలన మరిన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు.

హైడ్రేట్ అవసరం

హైడ్రేట్ అవసరం

వ్యాయాయం లాగానే శృంగారం జరిగాక మిమల్ని మీరు హైడ్రేట్ చేసుకోవడం అవసరం. డిహైడ్రేషన్ మీ శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. జననాంగాలను నీటితో ఎండనియ్యకుండా చేసి బాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి తప్పించుకోండి. ప్రోబయోటిక్ పదార్ధాలను తినాలి శృంగారం తరువాత ఏం తిన్నారు అన్నది ముఖ్యం. డబ్బాలలో ఉండే చాకోలెట్స్, చిప్స్ వంటి పదార్ధాలు నోరూరిస్తాయి. కానీ, ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ పదార్ధాలను ఎక్కువగా తినాలి. శృంగారం తరువాత ఇలాంటివి తింటే మంచి బాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.

యోని తడిగా ఉంటుంది

యోని తడిగా ఉంటుంది

శృంగారం తరువాత యోని ప్రాంతం తడిగా, వెచ్చగా ఉంటుంది. అక్కడే బాక్టీరియా తకగలదు. పైగా గాలి తాగాలని బట్టలు ధరిస్తే బాక్టీరియా మరింత పెరుగుతుంది. కాటన్ దుస్తుల్లాంటివి ధరించి అక్కడ గాలి తగిలేలా చూసుకోవాలి. ఇలా చేయకండి తడి వైప్స్ తో మిమల్ని మీరు శుభ్రపరుచుకోవాలి అనుకోవడం సరైన పద్ధతి అనిపించిన.. వాటిలోని రసాయనాలు, సుగంధాలు మీ సున్నితమైన జననాంగ ప్రాంతాలను మంటపుట్టేలా చేస్తాయి. అందువల్ల తడి వైప్స్ ఉపయోగించకండి.

హాట్ వాటర్ షవర్ కింద స్నానం

హాట్ వాటర్ షవర్ కింద స్నానం

మీరు అందులో పాల్గొన్న తర్వాత వెంటనే హాట్ వాటర్ తో స్నానం చేయకండి. ఎందుకంటే ఆ సమయంలో యోని కొంచెం ఎక్కువగా ఓపెన్ అయి ఉంటుంది. అందువల్ల సెక్స్ లో పాల్గొన్న వెంటనే ఆడవాళ్లు షవర్ కింద వేడి నీళ్లతో స్నానం చేయకూడదు. హాట్ వాటర్ యోనిలోకి వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ ఫెక్షన్ కు గురవుతారు. సెక్స్ తర్వాత చేయకూడని పనుల్లో ఇది చాలా ముఖ్యమైనది.

వీర్యం పడుతుంది

వీర్యం పడుతుంది

సెక్స్ పూర్తయ్యాక పురుషుల వీర్యం ఒక్కోసారి మహిళలపై పడుతుంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి.చిన్నగా మొదలై అవే పెద్ద సమస్యను తెస్తాయి. అలాగే సెక్స్ చేసేటప్పుడు ఆ పార్ట్స్ దగ్గర చేత్తో తడుముతూ ఉంటారు. దీంతో చేతులపైకి వైరస్ చేరుకుంటుంది. అందువల్ల తర్వాత చేతులను కడుక్కోవాలి. లేదంటే ఆ వైరస్ నోటిలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

సెక్స్ పూర్తయిన వెంటనే

సెక్స్ పూర్తయిన వెంటనే

ఇక శృంగారం ముగిశాఖ‌ నిద్రరాకూడదా, వెంట‌నే ప‌డుకోకూడ‌దా.. అనే అంశాల‌పై సెక్సాల‌జిస్టుల ప‌రిశోధ‌న‌ల్లో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగు చూశాయి. మరికొందరు ఆలోచ‌న ప్ర‌కారం సెక్స్‌కు ముందు నిద్రపోయి.. ఆ తర్వాత అంటే వేకువజామున రత్రిక్రీడకు ఉపక్రమిస్తుంటారు. అయితే, సెక్స్ పూర్తయిన వెంటనే దంపతులు గాఢనిద్రలోకి జారుకుంటారు. ఇలా నిద్ర ముంచుకుని రావడం ఒక వ్యాధి అని కొందరంటుంటారు. అయితే ఈ విషయంపై లండన్‌కు చెందిన కొంతమంది సెక్సాలజిస్టులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

స్త్రీ కూడా రతిక్రీడలో తేలిపోయి

స్త్రీ కూడా రతిక్రీడలో తేలిపోయి

సాధారణంగా సెక్స్ సమయంలో స్త్రీ-పురుష శరీరాలు రెండూ రతిక్రీడలో మునిగిపోతుంటాయి. సెక్స్ అనంత‌రం శరీరంలో ఉండే ఎండార్ఫిన్ అనే ద్రవపదార్థం విడుదల అవడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. అంతేకాకుండా, సెక్స్ చేసేటపుడు ఏర్పడే అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల నిద్ర రావడం సహజమేనని నిపుణులు సూచిస్తున్నారు. సెక్స్ అనంతరం కేవలం పురుషుడు మాత్రమే కాకుండా.. స్త్రీ కూడా రతిక్రీడలో తేలిపోయి అనంతరం హాయిగా నిద్రపోతుందని ఈ సర్వేలో తేలింది.

అంగాన్ని తీసివేయడాన్ని ఇష్టపడరు

అంగాన్ని తీసివేయడాన్ని ఇష్టపడరు

చాలామంది స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే అంగాన్ని తీసివేయడానికి మొగ్గుచూపరట. అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారని ఈ సర్వేలో వెల్లడయింది. అందువల్ల రతిక్రీడ తర్వాత నిద్ర ముంచుకురావడం అనేది జబ్బేమీ కాదని సర్వేలో తేటతెల్లమైంది.

సెక్స్ తర్వాత చేసే అన్ని విషయాలపై మీకు అవగాహన చాలా అవసరం. లేదంటే కొత్త సమస్యలు వస్తాయి. ఇదేమి తప్పు కాదు. మన ఆరోగ్యం విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఇవీ కొన్ని. అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకొని పాటించాలి.

English summary

things that men should always do after sex

things that men should always do after sex
Story first published:Tuesday, June 19, 2018, 12:10 [IST]
Desktop Bottom Promotion