Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మూర్ఛవ్యాధి, ఫిట్స్, వాయితో బాధపడేవారికి ఈ చికిత్స బాగా ఉపయోగపడుతుంది
జన్యుపరమైన కారణాల వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. డ్రెవ్ట్ సిండ్రోమ్ వల్ల చాలా మంది దీని బారినపడుతుంటారు. కన్నాబిడియోల్, లేదా సీబీడీ అనే మొక్కలో మూర్ఛ వ్యాధిని తగ్గించే గుణాలుంటాయి. మూర్ఛవ్యాధి నుంచ
కొందరు సడెన్ గా కింద పడిపోతారు. వారి కాళ్లూ చేతులు కొట్టుకుంటాయి. వారి నోటి నుంచి నురగ వస్తుంది. ఈ వ్యాధిని గ్రామాల్లో వాయి అంటారు. డాక్టర్స్ ఫిట్స్, సెయిజర్స్ అని అంటారు. అయితే ఫిట్స్ ఆగకుండా వస్తే దాన్ని ఎపిలెప్సీ లేదంటే మూర్ఛ వ్యాధి అంటారు. కొందరికి ఈ సెయిజర్స్ త్వరగా తగ్గిపోతాయి. లేదంటే ఎపిలెప్సీ కోర్స్ వాడాల్సి వస్తుంది.

నోటిలోకి బలవంతంగా
మూర్ఛరోగం బారిన పడినప్పుడు ఏం చెయ్యాలో చాలా మందికి తెలీదు. మూర్ఛ వచ్చినప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. మూర్ఛకు గురైన వ్యక్తి నోటిలోకి బలవంతంగా ఏమీ కుక్కకూడదని గుర్తించుకోవాలి. అతనికి బాగా గాలి ఆడేలా చూడండి. నోట్లో నుంచి వచ్చే నురగను మింగకూండా చూడాలి. ఒక పక్కకుతిప్పి పడుకోబెట్టాలి.

ఫిట్స్ వచ్చే అవకాశం
జన్యుపరమైన కారణాల వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. డ్రెవ్ట్ సిండ్రోమ్
వల్ల చాలా మంది దీని బారినపడుతుంటారు. కన్నాబిడియోల్, లేదా సీబీడీ అనే మొక్కలో మూర్ఛ వ్యాధిని తగ్గించే గుణాలుంటాయి.

మూర్ఛవ్యాధి నుంచి కోలుకున్నట్లు
కన్నాబిడియోల్ ఉపయోగించిన వారు చాలా మంది మూర్ఛవ్యాధి నుంచి కోలుకున్నట్లు కొన్ని పరిశోధనల్లో తేలింది. న్యూ యార్క్ యూనివర్సిటీకి చెందిన ఓరియన్ డేవిన్ స్కై దీనిపై పరిశోధనలు చేపట్టారు. కన్నాబిడియోల్ ఉపయోగించిన వారిలో దాదాపు 39 శాతం వ్యాధి తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది.

కన్నాబిడియోల్
మూర్ఛవ్యాధితో బాధపడుతున్న 120 మంది 2 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న పిల్లలకు కన్నాబిడియోల్ 20 mg / kg ప్రకారం 14 వారాల పాటు ఇచ్చారు. అయితే ఈ మందు ఉపయోగించిన వారిలో 93.4 శాతం మంది కోలుకున్నట్లు తెలిసింది. అయితే ఈ మందు ఉపయోగించిన వారిలో చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడినట్లు కూడా తేలింది.



Click it and Unblock the Notifications