Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అన్నం తిని కూడా బరువు తగ్గొచ్చు, ఎలాగో చూడండి
అన్నం తినడం తప్పు కాదు. అన్నం తింటే కొవ్వు పేరుకుపోతుందని అనుకోవడం పొరపాటు. కొన్ని సమయాల్లో అన్నం తింటే జీవక్రియ బాగుంటుంది. పగటి సమయములో అన్నం బాగా తినొచ్చు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మీకు ఆకలివే
సాధారణంగా చాలా మంది బరువు తగ్గాలనుకుంటే అన్నం తినడం మానేస్తుంటారు. అన్నం తినకుండా ఉంటే బరువు ఈజీగా తగ్గుతామని చాలా మంది భావన. అయితే అన్నం తిని కూడా బరువు తగ్గొచ్చు. మనకు అన్నం ఏ సమయంలో తినాలో తెలిసి ఉండాలి. అలాగే రైస్ కు సంబంధించిన కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. ఆ విషయాలు తెలిస్తే చాలు మీరు ఈజీగా బరువు తగ్గొచ్చు.

సరైన సమయం
అన్నం తినడం తప్పు కాదు. అన్నం తింటే కొవ్వు పేరుకుపోతుందని అనుకోవడం పొరపాటు. కొన్ని సమయాల్లో అన్నం తింటే జీవక్రియ బాగుంటుంది. పగటి సమయములో అన్నం బాగా తినొచ్చు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మీకు ఆకలివేసినప్పుడు అన్నం తినండి. దీనివల్ల బరువు ఎక్కువగా పెరగరు.

కారణం
పగటిపూటనే అన్నం తినమని చెప్పడానికి కొన్ని కారణాలున్నాయి. మీరు ఉదయం పూట అన్నం తినడం వల్ల అది పూర్తిగా జీర్ణమై శరీరానికి శక్తిని అందించగలదు. కొవ్వు ఎక్కువగా పేరుకుపోకుండా ఉంటుంది.

బ్రౌన్ రైస్ వర్సెస్ వైట్ రైస్
చాలా మంది ఎక్కువగా తెల్ల బియ్యంతో తయారుచేసిన అన్నాన్నే తింటూ ఉంటారు. బ్రౌన్ రైస్ తో చేసిన అన్నాన్ని ఎక్కువగా తినరు. చాలా మంది తెల్ల రైస్ తో తయారు చేసిన అన్నాన్నే తినడానికి ఇష్టపడతారు. అయితే తెల్ల అన్నం కంటే బ్రైన్ రైస్ చాలా మంచింది. దీన్ని తింటే ఆరోగ్యంగా ఉంటారు. బరువు పెరగరు. కొవ్వు కరుగుతుంది.

బియ్యంతో తయారు చేసిన పదార్థాలు
బియ్యంతో తయారు చేసిన పదార్థాలను కూడా మనం రెగ్యులర్ గా తింటూ ఉంటాం. దీనివల్ల కూడా బరువు అదుపులో ఉంటుంది. ఇడ్లీలు, పూరీలు, రొట్టెలు, కిచిడి వంటివి రెగ్యులర్ గా తినడం మంచిది. ఇవి కూడా మీ బరువును అదుపులో ఉంచగలవు.



Click it and Unblock the Notifications