Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
వెరికోజ్ వీన్స్ సిరల ఉబ్బుతో బాధపడే వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, వెరికోజ్ వీన్స్ అంటే ఏమిటి
రక్తం పైకి వెళ్లేటప్పుడు కవటాలు గట్టిగా మూసుకుపోతాయి. దీంతో బ్లడ్ తిరిగి కిందికి రాదు. అయితే వెరికోజ్ వీన్స్ సమస్యతో బాధపడేవారిలో ఈ కవాటాలు మొత్తం మూసుకుపోవు. అందువల్ల రక్తం ఒక్కోసారి వెనక్కి వస్తూ
వెరికోజ్ వీన్స్ ఈ పదం గురించి మనకు పెద్దగా తెలియకపోయినా ఈ సమస్యను మాత్రం మనలో చాలా మంది అనుభవిస్తుంటారు. మన కాలి సిరలు ఉబ్బిపోవడం వల్ల చాలా రకాలుగా ఇబ్బందులుపడుతుంటాం. కొందరి కాళ్లపై రక్తనాళాలు ఉబ్బి బయటకు కనపడుతుంటాయి. అవి కాస్త వంకర్లు తిరిగిపోయి ఉంటాయి. బ్లూ కలర్ చారలు బయటకు కనిపిస్తుంటాయి. అవి చూడడానికి కూడా అంత బాగోవు.

వెరికోజ్ వీన్స్ వచ్చిన తర్వాత
వెరికోజ్ వీన్స్ సమస్య వల్ల పెద్దగా నొప్పి ఏర్పడకపోవొచ్చు. అంత త్వరగా ఆ ఎఫెక్ట్ బాడీపై ఉండకపోవొచ్చు. కానీ అది చిన్న సమస్య కాదు. ఈ సమస్య తీవ్రమైతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెరికోజ్ వీన్స్ వచ్చిన తర్వాత కాళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మడమలు బాగా వాస్తాయి. కాలి చర్మం రంగు కూడా మారుతుంది.

కవాటాలు పని చేయకపోతే
ముఖ్యంగా కాళ్లలోని సిరలే ఎందుకు ఉబ్బుతాయని చాలా మందికి అనుమానం ఉంటుంది. సడెన్ గా ఇలా ఎందుకు జరుగుతుందని సందేహపడుతుంటారు. సిరల కవాటాలు పని చేయకపోతే ఈ సమస్య బారినపడతారు. మన కాళ్లలో సిరల్లో కొన్ని కవాటాలు ఉంటాయి. కాళ్ల నుంచి రక్తం గుండెకు చేరవేయడంలో కవటాలు బాగా పని చేస్తాయి. రక్తం కాళ్ల నుంచి పైకి ప్రవహించేలా చేయడమే వీటి పని.

వెరికోజ్ వీన్స్ సమస్యతో బాధపడేవారిలో
రక్తం పైకి వెళ్లేటప్పుడు కవటాలు గట్టిగా మూసుకుపోతాయి. దీంతో బ్లడ్ తిరిగి కిందికి రాదు. అయితే వెరికోజ్ వీన్స్ సమస్యతో బాధపడేవారిలో ఈ కవాటాలు మొత్తం మూసుకుపోవు. అందువల్ల రక్తం ఒక్కోసారి వెనక్కి వస్తూ ఉంటుంది. సిరలు ఉబ్బుతాయి. అలాగే రక్తంలో కార్బన్‌డయాక్సైడ్ పెరుగుతుంది. సిరలు బ్లూ కలర్ లోకి మారుతాయి. కొందరు గంటల కొద్దీ నిలబడి పని చేస్తుంటారు. అలాంటి వారు ఎక్కువగా ఈ సమస్య బారినపడుతుంటారు. లేదంటే ఎక్కువగా కూర్చొవడం వల్ల కూడా ఈ సమస్య బారినపడతారు.

బిగ్గరగా ఉండే సాక్స్ ధరించకూడదు
వయసు పెరగడం, ఊబకాయం వంటి వాటి వల్ల కూడా సిరలు ఉబ్బుతాయి. ఈ సమస్య తీవ్రమైతే కాళ్లనొప్పి అధికమం అవుతుంది. కాళ్లలో ఎక్కువగా వాపు వస్తుంది. రోజూ వ్యాయామం చేస్తే మంచిది. అలాగే కాళ్లకు ఎక్కువగా బిగ్గరగా ఉండే సాక్స్ ధరించకూడదు. అప్పుడప్పుడు కూర్చొన్నప్పుడు కూడా కాళ్లు పైకి ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు పాటించాలి. అయితే సమస్య తీవ్రం అయితే మాత్రం సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ సర్జరీతో లేదా లేజర్, రేడియోఫ్రిక్వెన్సీఅబ్లేషన్ వంటి సర్జరీలుంటాయి.



Click it and Unblock the Notifications