Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వయస్సు అయిపోయిన ఆడవారంతా ఆస్టియో పోరోసిస్ బారినపడేందుకు కారణాలివే, ఆ జబ్బు వస్తే చాలా ప్రమాదం
చాలా మంది మహిళలు మెనోపాజ్ దశలో ఈ సమస్య ఎదుర్కొంటారు. ఎముకల్లోని ద్రవ్యరాశి తగ్గిపోవడం కూడా ఒక కారణం. ఆడవారిలో వయస్సు పెరిగేకొద్ది ఈ సమస్య బారినపడుతుంటారు. ఈస్ట్రోజెన్ తగ్గినా కూడా దీని బారినపడుతుంట
కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఆడవారికే వస్తుంటాయి. అందులో ఆస్టియో పోరోసిస్ ఒకటి. రుతుక్రమం వల్ల ఆడవారిలో క్యాల్షియం బాగా తగ్గిపోతుంది. దీంతో ఆడవారు ఎక్కువగా ఆస్టియో పోరోసిస్ కు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఆడవారే కాదు ధూమపానం, మద్యపానం ఎక్కువగా చేసే మగవారు కూడా ఈ జబ్బు బారినపడతారు.
ఆస్టియో పోరోసిస్ బారినపడ్డ వారు ఎక్కువగా క్యాల్షియం ఉండే ఆహారం తీసుకోవాలి. అలాగే విటమిన్ డి ఉండే ఆహారం తినాలి. ఆస్టియో పోరోసిస్ తో బాధపడేవారు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సాంద్రత తగ్గుతుంది
ఆస్టియో పోరోసిస్ వల్ల ఎముకలకు సంబంధించిన కణాల్లో సాంద్రత తగ్గుతుంది. దీంతో ఎముకల్లో పటుత్వం పూర్తిగా తగ్గిపోతుంది. వాటిని ముట్టుకున్నా కూడా నొప్పి పుడతాయి. చాలా మంది ఆస్టియో పోరోసిస్ బారినపడుతుంటారు. దీని బారినపడిన వారి ఎముకలు ఈజీగా విరిగిపోతాయి. గాలి కాలుష్యం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఆస్టియోపోరోసిస్ బారినపడుతుంటారు.

పారా థైరాయిడ్ హార్మోన్
కలుషితమైన గాలిని పీల్చినప్పుడు బాడీలో పారా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గుతుంది. దీంతో ఆస్టియో పోరోసిస్ కు గురయ్యే అవకాశం ఉంది.
మన శరీరంలో ఎముకల బలంగా ఉండాలంటే పారాథైరాయిడ్ హార్మోన్ ఎంతో అవసరం. అది బలహీనంగా మారినా, అది తక్కువ అయినా సరే మన శరీరంలోని ఎముకలు మొత్తం కూడా బలహీనంగా మారుతాయి.

ఎముకల్లోని ద్రవ్యరాశి తగ్గిపోవడం
చాలా మంది మహిళలు మెనోపాజ్ దశలో ఈ సమస్య ఎదుర్కొంటారు. ఎముకల్లోని ద్రవ్యరాశి తగ్గిపోవడం కూడా ఒక కారణం. ఆడవారిలో వయస్సు పెరిగేకొద్ది ఈ సమస్య బారినపడుతుంటారు. ఈస్ట్రోజెన్ తగ్గినా కూడా దీని బారినపడుతుంటారు. మగవారికి కాస్త ఏజ్ ఎక్కువ అయినా సరే వారి ఎముకలు గట్టిగా ఉంటాయి. అందువల్ల వారు ఆస్టియొపోరోసిస్ బారినపడరు.

పాలిచ్చే తల్లులు కూడా
గర్భిణీలతో పాటు పాలిచ్చే తల్లులు కూడా ఈ సమస్య బారినపడే అవకాశం ఉంది. చిన్న వయస్సులోనే తల్లికావడం అలాగే పోషక విలువలు లేనటువంటి ఆహారం తినడం వల్ల కూడా ఈ సమస్య బారినపడే అవకాశం ఉంది. అలాగే రోజూ ఒకే చోట కూర్చుని పని చేయడం ఎలాంటి వ్యాయామాలు చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య బారినపడే అవకాశం ఉంటుంది.

ఎముకలు విరిగిపోవడం
చాలా మందికి వారు ఆస్టియొపోరోసిస్ బారినపడినట్లు వారికే తెలియదు. నడుము కాస్త వండిపోవడం అలాగే ఎముకలు విరిగిపోవడం వంటివి ఈ జబ్బుకు సంబంధించిన లక్షణాలు. ఇది రాకుండా ఉండాలంటే ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.

కాల్షియం ఎక్కువగా
మంచి ఆహారం తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. వ్యాయామాలు చేయాలి. కిందపడకుండా జాగ్రత్తగా నడవాలి. కిందపడితే ఎముకలు విరిగిపోతాయి. పాలు, పాల సంబంధిత ఆహారపదార్థాలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications