Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Adenovirus Cases: ఆందోళనకరరీతిలో అడెనోవైరస్ కేసులు, పిల్లలతో నిండిపోతున్న దవాఖానాలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అడెనోవైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా చాలా మంది పిల్లలు అడెనోవైరస్ తో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. పశ్చిమృ బెంగాల్ లోని దవాఖానాలు అడెనోవైరస్ సోకిన బాధపడుతున్న పిల్లలతో నిండిప
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అడెనోవైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా చాలా మంది పిల్లలు అడెనోవైరస్ తో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. పశ్చిమృ బెంగాల్ లోని దవాఖానాలు అడెనోవైరస్ సోకిన బాధపడుతున్న పిల్లలతో నిండిపోయాయి. పరీక్షలు నిర్వహిస్తున్న వారిలో దాదాపు 32 శాతం మందికి పాజిటివ్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అడెనోవైరస్ సోకడం వల్ల ఆదివారం ఇద్దరు చిన్నారులు చనిపోయారు.

అడెనోవైరస్ అంటే ఏంటి?
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) ప్రకారం అడెనోవైరస్లు సాధారణంగా తేలికపాటి జలుబు, ఫ్లూలకు కారణం అవుతాయి. అడెనో వైరస్ లు సంవత్సరంలో ఏ సమయంలోనైనా అన్ని వయస్సుల వారికి సోకుతాయి. అడెనో వైరస్ తేలికపాటి నుండి తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుందని సీడీసీ పేర్కొంది.
బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ లేదా ఇప్పటికే ఉన్న శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఉన్న వ్యక్తులకు అడెనోవైరస్ సోకితే పరిస్థితి దిగజారుతుంది. తీవ్రమైన అనారోగ్యం రావొచ్చు.

అడెనోవైరస్ లక్షణాలు:
- సాధారణ జలుబు లేదా ఫ్లూ లక్షణాలు
- జ్వరం
- గొంతు మంట
- తీవ్రమైన బ్రోన్కైటిస్, చెస్ట్ కాఫ్
- న్యూమోనియా
- పింక్ ఐ
- తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్(అతిసారం, వాంతులు, వికారం, కడుపు నొప్పి, పేగుల వాపు)
- మూత్రాశయ వాపు
- మూత్రాశయ ఇన్‌ఫెక్షన్
- నాడీ సంబంధిత వ్యాధి(మెదడు మరియు వెన్నుపామును ప్రభావితం చేసే పరిస్థితులు)
- కనీసం 20 సెకన్ల పాటు చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
- చేతులను కడుక్కోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకకూడదు.
- అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.
- అడెనోవైరస్ సోకిన వారికి దగ్గరికి వెళ్లకూడదు. వెళ్లాలనుకుంటే మాస్కులు ధరించాలి.
- దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటిని, ముక్కును మూసుకోవాలి.
- ఇతరులతో దుస్తులు, వంట పాత్రలు, ఇతర వస్తువులు పంచుకోవద్దు.
- ఇతరులను ముద్దు పెట్టుకోవద్దు.
- వ్యక్తిగత శుభ్రత పాటించాలి.
- కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించామో ఇప్పుడూ అలాంటి జాగ్రత్తలు పాటించాలి.
అడెనోవైరస్ వల్ల కలిగే తక్కువ సాధారణ లక్షణాలు:

అడెనోవైరస్ ఎలా వ్యాపిస్తుంది:
అడెనోవైరస్ లు సాధారణంగా సోకిన వ్యక్తి నుండి ఇతరులకు సోకుతుంది. వారిని తాకడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటి చర్యల ద్వారా అడెనోవైరస్ వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ములు, లాలాజలం, గాలి ద్వారా కూడా అడెనోవైరస్ సోకుతుంది.
నోటి లాలాజలం తాకి అదే చేతితో వస్తువులను తాకితే, అదే వస్తువును ఇతరులు తాకినప్పుడు అడెనోవైరస్ వ్యాప్తి చెందుతుంది. అడెనోవైరస్ లు వస్తువుల ఉపరితలాలపై ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఆలోపు ఎవరైనా ముట్టుకుని అదే చేతిని ముక్కు, నోరు, కళ్లను తాకితే అడెనోవైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

అడెనోవైరస్ ను నివారించడం ఎలాగంటే:

అడెనోవైరస్ చికిత్స:
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) ప్రకారం అడెనోవైరస్ కు ఇప్పటి వరకు సరైన చికిత్స అందుబాటులో లేదు. ఆమోదించబడిన యాంటీ వైరల్ మందులు లేవు. లక్షణాలను తగ్గించడానికే చికిత్స చేస్తూ వస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఎప్పుడూ సబ్బుతో చేతులు కడుక్కోవాలని, పరిశుభ్రతను పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
ఐదేళ్ల లోపు పిల్లల్లో అడెనోవైరస్ ఎక్కువగా కనిపిస్తుంది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఏ వయస్సు వారికైనా అడెనోవైరస్ ప్రమాదమే.
అడెనోవైరస్ సాధారణే. జలుబు, దబ్బు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
అడెనోవైరస్ ప్రాణాంతకం కూడా కావొచ్చు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లల్లో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications