Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Blood Type Diet: ఏ బ్లడ్ గ్రూపు వారు ఎలాంటి ఆహారం తినాలో తెలుసా?
బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహార పదార్థాలు తీసుకోవాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బ్లడ్ గ్రూప్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆహారం తినడం వల్ల సులభంగా బరువు తగ్గడం లేదా బరువు పెరగడం, ఎక్కువ శక్తిని కలిగి ఉండటం, ఇమ్యూనిటీ ఎక్కువగా
Blood Type Diet: ఆహారంలో సమృద్ధిగా ఉండే విభిన్నమైన ప్రోటీన్లు, లెక్టిన్‌లు రక్తాన్ని, జీర్ణాశయ లైనింగ్‌ను ప్రభావితం చేస్తాయి. అందుకే కొన్ని రకాల ఆహారాలు కొందరిపై ఒకలా, మరికొందరిపై మరోలా ప్రభావం చూపిస్తాయి. ఒక వ్యక్తి ఒకరకమైన డైట్ పాటిస్తే బరువు తగ్గుతారు, ఇంకొకరు అలాంటి డైట్ పాటించడం వల్ల బరువులో ఎలాంటి తేడా ఉండదు. అలాగే కొన్ని రకాల వ్యాయామాలు కొంతమందిపై చూపిన ప్రభావం మరికొందరిలో చూపవు. ఇక్కడ బ్లడ్ గ్రూపులదే కీలక పాత్ర.

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, గుండె జబ్బులు, కడుపు పూతల వంటి శారీరక రుగ్మతలు, ఒత్తిడి, ఆందోళనలాంటివి శరీరంపై ఎలా ప్రభావం చూపుతుంది అనేది బ్లడ్ గ్రూపులపై ఆధారపడి ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
A బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తులకు సూక్ష్మ జీవుల ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే A బ్లడ్ గ్రూపు ఉన్న మహిళల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంటుంది.
అందుకే బ్లడ్ గ్రూప్ ఆధారంగా ఆహార పదార్థాలు తీసుకోవాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బ్లడ్ గ్రూప్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆహారం తినడం వల్ల సులభంగా బరువు తగ్గడం లేదా బరువు పెరగడం, ఎక్కువ శక్తిని కలిగి ఉండటం, ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటం గమనించవచ్చు.

ఏ రకం బ్లడ్ గ్రూపుకు ఎలాంటి ఆహారం తినాలో చూద్దాం.
బ్లడ్ గ్రూప్ 'O':
'O' బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తులు అధిక ప్రోటీన్ తీసుకోవాలి. లీన్ మాంసం, పౌల్ట్రీ, చేపలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ధాన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తులను చాలా తక్కువగా లేదంటే మొత్తానికే తినకపోవడం మంచిది.
'O' బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తులకు ఏరోబిక్స్, కాంటాక్ట్ స్పోర్ట్స్, రన్నింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి తీవ్రమైన వ్యాయామాలు మంచివి.
ఏం తినాలి:
సీఫుడ్, ఉప్పు, రెడ్ మీట్, కాలె, కెల్ప్, బచ్చలికూర, బ్రొకలీ, చేపలు, కూరగాయలు, పండ్లు
ఏం తినకూడదు:
గోధుమలు, మొక్కజొన్న, కిడ్నీ బీన్స్, నేవీ బీన్స్, కాయధాన్యాలు, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, కాలీఫ్లవర్

బ్లడ్ గ్రూప్ 'A':
టైప్ A బ్లడ్ గ్రూపు ఉన్న వారు గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తినాలి. కఠినమైన వ్యాయామాలు కాకుండా సున్నితమైన వాటిని ఎంచుకోవాలి.
ఏం తినాలి:
కూరగాయలు, టోఫు, సీఫుడ్, ధాన్యాలు, బీన్స్, చిక్కుళ్లు, సోయా, పైనాపిల్.
ఏం తినకూడదు:
మాంసం, పాల ఉత్పత్తులు, కిడ్నీ బీన్స్, లిమా బీన్స్, గోధుమలు.

బ్లడ్ గ్రూప్ 'B':
ఈ రకం బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. సహనశీలమైన జీర్ణవ్యవస్థ ఉంటుంది. ఇతర బ్లడ్ గ్రూపుల కంటే వీరు మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారి.
ఏం తినాలి:
మాంసం(కోడి తప్ప), పాల ఉత్పత్తులు, ధాన్యాలు, బీన్స్, చిక్కుళ్లు, పండ్లు, ఆకుకూరలు, గుడ్లు, టీ.
ఏం తినకూడదు:
మొక్కజొన్న, కాయధాన్యాలు, వేరుశెనగలు, నువ్వులు, గోధుమలు, గింజలు.

బ్లడ్ గ్రూప్ 'AB':
AB బ్లడ్ గ్రూప్ ఇటీవలి కాలంలో గుర్తించబడ్డ బ్లడ్ గ్రూపు. అందువల్ల జీవశాస్త్రపరంగా అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూపు ఉన్న వాళ్లు ఎలాంటి వ్యాయామాలనైనా చేయవచ్చు. ధ్యానం, యోగా సాధన చేస్తే మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని అధ్యయనాల్లో తేలింది.
ఏం తినాలి:
మాంసం, డెయిరీ ఉత్పత్తులు, బీన్స్, చిక్కుళ్లు, ధాన్యాలు, కూరగాయలు, టోఫు, సీఫుడ్, పైనాపిల్.
ఏం తినకూడదు:
రెడ్ మీట్, కిడ్నీ బీన్స్, లిమా బీన్స్, విత్తనాలు, మొక్కజొన్న, బుక్వీట్.



Click it and Unblock the Notifications