Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
CoronaVirus Vaccination: కరోనా టీకా తీసుకున్న తర్వాత భుజం నొప్పి వస్తే మంచిదా?
కరోనా టీకా తర్వాత భుజం నొప్పి వచ్చేందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కోవిద్-19 నుండి కోలుకోడానికి కరోనా టీకాను మొదటి దశలో హెల్త్ వర్కర్లు కోవాక్సిన్, కోవిషీల్డ్ తీసుకున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటివరకు దాదాపు 35 కోట్ల మంది భారతీయులు టీకా వేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కొందరికి దుష్ప్రభావాలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది భుజం నొప్పి. వ్యాక్సిన్ వేసుకున్న చాలా మందిలో తీవ్రమైన భుజం నొప్పి వస్తోంది.

మరికొందరికి జలుబు, జ్వరం కూడా వస్తోంది. అయితే ఇవి రెండు రోజుల్లో తగ్గిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత భుజం నొప్పి ఎందుకు తీవ్రంగా వస్తుంది.. ఇందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

COVID ARM
కరోనా నివారణకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం ఇంజెక్షన్ల ద్వారానే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇది వేసుకున్నప్పటి నుండి కొందరికి గొంతులో మంట లేదా జలుబు, జ్వరం వస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే చాలా మందికి టీకా వేసిన చేయిపై తీవ్రంగా ప్రభావం పడుతోందని, భరించలేని నొప్పి వస్తోందని దీన్నే ‘కోవిద్ ఆర్మ్' అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు.

నొప్పి ఎంతకాలం?
కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారికి సాధారణంగా రెండు లేదా మూడు రోజుల పాటు ఈ నొప్పి ఉంటుంది. మీకు అక్కడ ఏదైనా గాయమైనట్టు లేదా మంటగా ఉంటే, మీకు నొప్పి చాలా ఎక్కువగా ఉంటే.. అది తగ్గేందుకు సుమారు ఐదు రోజులు పట్టొచ్చు. అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వారం రోజుల్లో నొప్పి తగ్గితే సరి. లేదంటే మీరు మళ్లీ వైద్యుని దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకోవడం మంచిది.

నొప్పి ఎందుకొస్తుంది.
సాధారణంగా ఏ టీకా తీసుకున్న కూడా ఏవో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అవి అనేక విధాలుగా ఉంటాయి. చాలా మంది వ్యక్తులు చేతికి ఇంజెక్షన్ ద్వారా టీకా తీసుకున్నప్పుడు చేయి నొప్పి లేదా పుండ్లు కావడం, చేతి చుట్టూ కొంత ఇబ్బందికరంగా ఉండటం అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే ఇది తిమ్మిరి మరియు నొప్పి వల్ల కలిగే ఇంజెక్షన్ తాత్కాలికం కావచ్చు.

చేయి ఎర్రగా మారితే..
మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ చేయి కొంత ఎర్రగా మారుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కువ మంట, ఎక్కువ వాపు వచ్చి చాలా బాధగా ఉండొచ్చు. మరికొందరికీ తీవ్రమైన నొప్పి వంటివి వస్తుంటాయి. అలాంటి లక్షణాలు మీ బాడీలో కనిపిస్తే.. టీకా బాగా పని చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇది మీ బాడీలో ప్రతిరోధకాలను క్రియేట్ చేస్తుంది. కరోనా నుండి కోలుకునేందుకు టీకా బాగా పని చేస్తుందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

కండరాల నొప్పి..
మీ చేతికి కరోనా వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేసినప్పుడు.. ఆ ప్రాంతంలో సాధారణంగా కొంత నొప్పి ఉంటుంది. అయితే అక్కడ పుండ్లు వంటివి అయితే మరింత నొప్పి పెరుగుతుంది. కొన్నిసార్లు కరోనా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కండరాల నొప్పులు కలగడం, అనారోగానికి గురవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మీకు చాలా అసౌకర్యంగా ఉంటుంది.

నొప్పి తగ్గేందుకు..
కరోనా టీకా వేసినప్పుడు మీ భుజం నొప్పి తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయి. సాధారణంగా ఇది రెండురోజుల్లో తగ్గిపోతుంది. అయినప్పటికీ మీ భుజం నొప్పి తగ్గకపోతే.. ఇంజక్షన్ వేసిన ప్రాంతంలో ఐస్ ప్యాక్ లేదా వెచ్చని/వేడి నీటితో మసాజ్ చేసుకుంటే నొప్పి తగ్గొచ్చు. ఎప్సమ్ ఉప్పు తీసుకోవడం వల్ల కూడా నొప్పి తగ్గేందుకు సహాయపడుతుంది. వీటితో పాటు మీరు తేలికపాటి వ్యాయామం చేస్తే నొప్పి తగ్గుతుంది.

ఇలా చేస్తే నొప్పి తగ్గదు..
అయితే నొప్పి నివారణ మరియు మంటల నివారణ కోసం టీకా వేసుకునే ముందు మాత్రం చేయకూడదు. వాటిని ముందుగా తీసుకోవడం వల్ల మీరు టీకా వేసుకున్న తర్వాత నొప్పిని తగ్గించకపోవచ్చు. దీని గురించి పూర్తి స్పష్టత కావాలంటే మీరు వైద్యులను సంప్రదించాలి. అలాగే ఎక్కువగా పనులు మరియు వ్యాయామం వంటివి చేయకూడదు. అన్నీ పరిమితంగానే చేయాలి.



Click it and Unblock the Notifications