Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
బ్యాక్ పెయిన్ గా ఉందా? ఈ సింపుల్ ఆయిల్స్ ట్రై చేయండి
బ్యాక్ పెయిన్ గా ఉందా?ఈ సింపుల్ ఆయిల్స్ ట్రై చేయండి
బ్యాక్ పెయిన్ (వెన్నునొప్పి)అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా ఎదుర్కొనే సమస్య. ఇంట, బయట శ్రమపడి చేసే పనులైనా..ఆఫీస్ లో కూర్చొని చేసే పని అయినా ఏదో ఒక సందర్భంలో వెన్నునొప్పి భారిన పడే ఉంటారు. అద్రుష్టమేమిటంటే బ్యాక్ పెయిన్ కు ఎటువంటి సర్జరీలు ఉండవు కానీ, తగిన జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పులు చేసుకోగలిగితే బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం పొందవచ్చు.
అయితే వెన్ను నొప్పి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. యోగ, ఫిజియోథెరపీ, నొప్పినివారణలు మరియు ఆక్యుపంక్చర్ వంటివి ఈ పరిస్థితిని బటయపడటానికి ఉపయోగించే పాపులర్ పద్దతులు. అక్యూట్ (షార్ట్ టర్మ్) బ్యాక్ పెయిన్ ను విశ్రాంతి తీసుకోవడం ద్వారా మరియు మందుల ద్వారా నయం చేసుకోవచ్చు. కానీ నొప్పి ఎక్కువ రోజుల నుండి బాధిస్తుంటే కనుక అదనపు జాగ్రత్తలతో పాటు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి.
కొన్ని ప్రత్యేకమైన నూనెలో బ్యాక్ పెయిన్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. ఈ నూనెలు కొన్నిరకాల మొక్కల నుండి ఆకులు, విత్తనాలు, పువ్వుల, పండ్లు మరియు బెరడు నుండి సేకరించి తయారుచేసినవి. వీటిని సేకరించి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేస్తే గొప్ప ఉపశమనం కలుగుతుంది.

బ్యాక్ పెయిన్ కు ఉపశమనం కలిగించే మంచి నూనెలు:
పెప్పర్మెంట్ ఆయిల్:
పెప్పర్మెంట్ నూనెను పుదీనా ఆకులతో తయారుచేస్తారు. ఈ నూనెలో 44శాతం మెంతోల్ ఉంటుంది. ఇది నొప్పి, కండరాల సలుపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి సున్నిత మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది.

జింజర్ ఆయిల్ :
కులినరీ స్టార్ గా పిలుచుకునే అల్లంలో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. అల్లంలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, క్రోనిక్ లో బ్యాక్ పెయిన్ నివారించడంలో మంచి ఫలితాలను చూపించిందని నిపుణులు చెబుతున్నారు. జింజర్ ఆయిల్ స్టోర్స్ లో దొరుకుతుంది. లేదా ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఈ నూనెను ప్రభావిత ప్రదేశంలో అప్లై చేసి చూడండి 30నిముషాల్లో మీకు తప్పనిసరిగా మార్పు కనిపిస్తుంది.

లెమన్ గ్రాస్ ఆయిల్:
నిమ్మ మొక్క ఆకుల నుండి, ఆకు కాడల నుండి తయారుచేసినది లెమన్ గ్రాస్ ఆయిల్ . ఇందులో యాంటీ ఫంగల్ , యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఇయాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. ఇది నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాపు కూడా తగ్గిస్తుంది.

ల్యావెండర్ ఆయిల్:
ఈ మల్టీ పర్పస్ ఆయిల్ ఆరోమా వాసనలో ప్రసిద్ది చెందినది. అంతే కాదు ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ అంశాలు లోయర్ బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది లోకల్ పెయిన్ తో పాటు వాపు కూడా తగ్గిస్తుంది. అయితే దీన్ని కొద్దిగా వెచ్చచేసి ప్రభావిత ప్రదేశంలో అప్లై చేయాలి.

బాసిల్ ఆయిల్ :
తులసి నూనె చాలా స్మూత్ గా ఉండి నొప్పి నుండి ఉపశమనం కలిగించి కండరాల నొప్పిని, సలుపును తగ్గిస్తుంది. ఈ నూనెను న్యూరిస్ట్ లు సిఫారస్సు చేస్తున్నారు.

చమోమెలి ఆయిల్:
ఇది చాలా ప్రసిద్ది చెదిన స్మూతింగ్ ఆయిల్ , నరాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాస్తవంగా ఇందులో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కండరాల నొప్పి, సలుపు , వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్:
ఇందులో స్ట్రాంగ్ యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంశాలున్నాయి. మజిల్ స్పామ్ మరియు క్రాంప్స్, వాపు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఈ యాంటీ స్పాస్మోడిక్ ఆయిల్ జనరల్ మజిల్ టెన్షన్ మరియు అసౌకర్యాన్ని తొలగిస్తుంది. మజిల్స్ రిలాక్స్ చేస్తుంది.

రోజ్మెర్రీ ఆయిల్:
ఈ పాపులర్ కుక్కింగ్ హెర్బ్ బ్యాక్ పెయిన్ కు వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ ఆయిల్లో ఉండే యాంటీస్పాస్మోడిక్ మరియు అనాల్జసిక్ కాంపౌండ్స్ వల్ల రుమాటిక్ డిజార్డర్ మరియు మజిల్ క్రాంప్స్ ను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications