Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బాలికలకు గర్భాశయ క్యాన్సర్ రాకుండా టీకాలు, కేంద్ర సర్కారు ఆధ్వర్యంలో స్కూళ్లల్లో పంపిణీ
9 నుండి 14 ఏళ్లలోపు బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల ద్వారా ఈ వ్యాక్సిన్లు అందించనున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది.
9 నుండి 14 ఏళ్లలోపు బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల ద్వారా ఈ వ్యాక్సిన్లు అందించనున్నట్లు కేంద్ర సర్కారు తెలిపింది. ప్రతి జిల్లాలో 5 నుండి 10వ తరగతి వరకు బాలికల సంఖ్యను క్రోడీకరించడం ప్రారంభించాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్రం కోరింది.

పాఠశాలల ద్వారా టీకాల పంపిణీ చేస్తారు. పాఠశాలల్లో వ్యాక్సిన్ తీసుకోని బాలికలకు ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయనున్నారు. బడికి వెళ్లిన బాలికల(9-14 ఏళ్లు) కోసం కమ్యూనిటీ ఔట్‌రీచ్, మొబైల్ టీమ్‌ల ద్వారా టీకాలు అందించున్నారు. టీకాల సంఖ్య నమోదు, రికార్డింగ్, రిపోర్టింగ్ కోసం U-WIN అనే యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రచారం కల్పించండి:
గర్భాశయ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించాలని, దేశవ్యాప్తంగా విద్యార్థినుల్లో HPV వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు లేఖలు రాసింది.

ముందుగా గుర్తించే తగ్గించొచ్చు:
ప్రపంచవ్యాప్తంగా గర్భాశయయ క్యాన్సర్ మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్. భారత్‌లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ను ముందే గుర్తించి, సరైన చికిత్స అందించగలిగితే సర్వైకల్ క్యాన్సర్‌ను సులభంగానే నయం చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
చాలా గర్భాశయ క్యాన్సర్లు హ్యూమన్ పాపిల్లోమా వైరస్్(HPV)తో సంబంధం కలిగి ఉంటాయి. వైరస్‌కు గురయ్యే ముందు టీకా ఇచ్చినట్లయితే గర్భాశయ క్యాన్సర్ రాకుండా చాలా వరకు నిరోధించవచ్చని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications