Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
H3N2 Influenza: దేశాన్ని వణికిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా.. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు, హెచ్చరించిన కేంద్రం
దేశాన్ని మరో వైరస్ భయపెడుతోంది. ఈ మధ్య కాలంలో H3N2 ఇన్‌ఫ్లూయెంజా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
దేశాన్ని మరో వైరస్ భయపెడుతోంది. ఈ మధ్య కాలంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తున్న చాలా మందికి ఈ కొత్త ఫ్లూ సోకుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ H3N2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

సాధారణ ఫ్లూ లక్షణాలే ఇందులోనూ కనిపిస్తున్నాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించకుండానే ఎవరికి వారు మందులు వేసుకుని తగ్గిపోయిందని అనుకుంటారు. అలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వేల సంఖ్యలో కేసులు నమోదు:
H3N2 ఇన్‌ఫ్లూయెంజా సోకిన వ్యక్తుల్లో కరోనా తరహాల లక్షణాలే కనిపిస్తాయి. ఇన్‌ఫ్లూయెంజా వచ్చిన వ్యక్తుల్లో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్స్(ICMR) తెలిపాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో కొన్ని నెలలుగా వేలాది సంఖ్యలో ఈ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఫ్లూ సోకిన వారిలో 3-5 రోజుల పాటు జ్వరం, మూడు వారాల పాటు తీవ్రమైన దగ్గు ఉంటుంది.
H3N2 ఇన్‌ఫ్లూయెంజా ఉన్న రోగుల్లో 92 శాతం మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. 86 శాతం మందికి దగ్గు, 27 శాతం మందికి శ్వాస ఆడకపోవడం, 16 శాతం మందికి శ్వాసలోపం ఉంది. 16 శాతం మందికి న్యూమోనియా, 6 శాతం మందిలో మూర్చ కనిపిస్తున్నట్లు ICMR వెల్లడించింది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారిలో 10 శాతం మందికి ఆక్సిజన్ అవసరం అవుతున్నట్లు, 7 శాతం మంది ఐసీయీలో ఉంచాల్సిన పరిస్థితి తలెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు.

యాంటీబయాటిక్స్ వద్దు:
H3N2 ఇన్‌ఫ్లూయెంజా ఉందో లేదో తెలియడానికి ముందు దగ్గు, జ్వరం, గొంతునొప్పి లక్షణాలు ఉన్న వారికి యాంటీబయాటిక్స్ సిఫార్సు చేయవద్దని వైద్యులకు ICMR సూచించింది. యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఆ వైరస్ ప్రతిఘటనను పెంచుకుంటుందని వైద్య నిపుణులు సూచించారు.

H3N2 ఇన్‌ఫ్లూయెంజా వర్గీకరణ:
ఇన్‌ఫ్లూయెంజా A వైరస్ సబ్-టైప్ H3N2 (A/H3N2) అనేది ఇన్‌ఫ్లూయెంజా(ఫ్లూ) కలిగించే వైరస్ ల యొక్క ఉపరకం. H3N2 వైరస్ లు పక్షులు, క్షీరదాలకు సోకుతాయి.

H3N2 లక్షణాలు:
* జ్వరం
* చలి
* దగ్గు
* వికారం
* వాంతులు
* గొంతునొప్పి
* కండరాలు, శరీర నొప్పులు
* అతిసారం
* ముక్కు కారడం, తుమ్ములు

H3N2 ముందు జాగ్రత్తలు:
* క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి.
* మాస్క్ లు ధరించాలి.
* రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దు
* చేతులు కడుక్కోకుండా ముక్కు, నోరు, కళ్లకు తాకొద్దు
* నీరు ఎక్కువగా తాగాలి.
* ఘన పదార్థాలకు బదులు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
* వైద్యుని సిఫార్సు లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు.
* ఇతరులతో కరచాలనం చేయొద్దు.
* బహిరంగంగా ఉమ్మివేయొద్దు.
* దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు నోటికి అడ్డుగా పెట్టుకోవాలి.
* కరోనాకు పాటించిన జాగ్రత్తలు ఇప్పుడూ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications