Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
H3N2 Influenza: H3N2 వైరస్ ప్రాణాంతకా? మరో కొవిడ్ లా మారుతుందా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు?
ఇంతగా ఆందోళన కలిగిస్తున్న H3N2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ మరో కరోనా కాగలదా అనే ప్రశ్నకు వైద్య నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో H3N2 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ ఇన్‌ఫ్లూయెంజా మరో కరోనా అవుతుందా అనే భయాందోళన కూడా మొదలైంది. ఒకవైపు విపరీతంగా కేసులు పెరుగుతుండటం, మరోవైపు మరణాలు సంభవిస్తుండటం వైద్యులను సైతం కలవరపెడుతోంది.

ఇంతగా ఆందోళన కలిగిస్తున్న H3N2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ మరో కరోనా కాగలదా అనే ప్రశ్నకు వైద్య నిపుణులు ఏం సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆందోళన అవసరంలేదు, ప్రాణాంతకం కాదు:
పెరుగుతున్న H3N2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులు, దాని వల్ల మరణాలు సంభవించడంపై ఆందోళనలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కేసుల ఆకస్మిక పెరుగుదలపై వైద్య నిపుణులు మాట్లాడుతూ కోవిడ్ వల్ల గత రెండేళ్లలో లాక్ డౌన్ లు విధించామని దీని వల్ల పిల్లలు ఇన్‌ఫ్లూయెంజా గురికాలేదని, కానీ ఇప్పుడు ఫ్లూ బారిన పడుతున్నారని చెబుతున్నారు. ఈ ఫ్లూ ప్రాణాంతకం కాదన్నారు.
ఈ ఫ్లూతో బాధపడేవారు వారు మాత్రమే:
ఇన్‌ఫ్లూయెంజా వేరియంట్ యొక్క సాధారణ రూపమైన H3N2 వైరస్ యొక్క ఆకస్మిక వ్యాప్తి పిల్లల్లో కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు ఈ H3N2 ఇన్‌ఫ్లూయెంజాతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వారికి ప్రాణాపాయం:
H3N2 యాంటిజెనిక్ డ్రిఫ్ట్ మరియు తేలికపాటి మ్యూటేషన్ ఉన్నట్లయితే ప్రాణాపాయం ఏమీ లేదని, ఇప్పటికే పలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. H3N2కి వ్యతిరేకంగా వ్యాక్సిన్లు ఉన్నా వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని చెబుతున్నారు.
ఆందోళన అవసరం లేదు:
దేశవ్యాప్తంగా H3N2 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఇది మరో కరోనా రూపంలో బాధించే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ ఫ్లూ సోకి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నామమాత్రంగానే ఉందని, కేవలం 5శాతం మంది మాత్రమే దవాఖానాల్లో చేరాల్సిన పరిస్థితి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.
భారత్ లో ఇన్‌ఫ్లూయెంజా A(H1N1pdm09), ఇన్‌ఫ్లూయెంజా A(H3N2), ఇన్‌ఫ్లూయెంజా B (విక్టోరియా) కనుగొనబడినప్పటికీ, H3N2 అనేది ప్రధానమైన ఉపరకం, మరిన్ని ఆసుపత్రిలో చేరడానికి కారణమైంది. అయినప్పటికీ, దాని నమూనాలపై, ఎక్కువ సంఖ్యలో రోగుల్లో జ్వరం, దగ్గు లక్షణాలను మాత్రమే కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications