Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
H3N2 Influenza: H3N2 వైరస్‌తో కిడ్నీలపై తీవ్ర ప్రభావం!
H3N2 వైరస్ వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. H3N2 వైరస్ సోకితే స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నప్పటికీ.. కిడ్నీలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా పీడ ఇంకా పూర్తిగా వదలకముందే ఈ కొత్త వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. H3N2 ఇన్‌ఫ్లూయెంజా గా పిలిచే ఈ వైరస్ సోకడం వల్ల ఇప్పటి వరకు పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రులో చేరుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. కొవిడ్-19 తర్వాత దేశంలో H3N2 కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ ఫ్లూ లక్షణాలు తేలికగానే ఉంటున్నా.. ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రం ఇది ప్రాణాపాయంగా మారుతోంది.

శిశువులు, వృద్ధుల్లో H3N2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. వారిపైనే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కొత్త ఇన్‌ఫ్లూయెంజాను అరికట్టడానికి కరోనా సమయంలో పాటించిన జాగ్రత్తలు అన్నీ పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
H3N2 కేసులు పెరుగుతుండటం వల్ల కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మార్చి 16 నుండి మార్చి 26 వరకు విద్యా సంస్థలన్నింటికీ అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ముఖ్యంగా 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు 10 రోజుల పాటు పాఠశాలలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

కిడ్నీలపై ప్రభావం చూపిస్తున్న H3N2:
H3N2 వైరస్ వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. H3N2 వైరస్ సోకితే స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నప్పటికీ.. కిడ్నీలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు.
వృద్ధులతో పాటు డయాబెటిస్, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిపై H3N2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్లు కనుగొన్నారు.
ఈ కొత్త ఫ్లూ బారిన పడ్డ వారిలో కిడ్నీల పనితీరు దెబ్బతినడం సహా కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
కిడ్నీ మార్పిడి, డయాలసిస్ రోగులపై ఈ ఇన్‌ఫ్లూయెంజా మరింత ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వయస్సు పైబహిన వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

ఇన్‌ఫ్లూయెంజా టీకా:
సీకేడీ లేదా డయాలసిస్, పోస్టు కిడ్నీ మార్పిడి రోగులు తీవ్రమైన సమస్యలను నివారించాడనికి వార్షిక ఇన్‌ఫ్లూయెంజా టీకా, కిడ్నీ స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిఫార్సు చేసింది. వ్యక్తులకు ఇన్‌ఫ్లూయెంజా టీకా కార్యక్రమాన్ని విస్తరించాలని అధికారులకు వైద్యులు సూచిస్తున్నారు.

H3N2 ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు:
* అధిక జ్వరం
* దగ్గు
* గొంతు నొప్పి
* తలనొప్పి
*అలసట
* శరీర నొప్పి
* చలి
* శ్వాస ఆడకపోవడం
* తీవ్రమైన వాంతులు
* డీహైడ్రేషన్
* లో బ్లడ్ ప్రెషర్
* బ్లూయిష్ లిప్స్
* మూర్ఛ
* కన్ఫ్యూజన్
* ఛాతీలో నొప్పి



Click it and Unblock the Notifications