Latest Updates
-
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.!
ఒంటరితనంతో బాధపడుతున్నారా.. ఇలా దాని నుండి బయటపడండి
ఒంటరితాన్ని ఎదుర్కోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. వ్యక్తులను బట్టి వారి మనస్తత్వాలు, అభిప్రాయాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉన్నట్లే ఒంటరితనం నుండి బయటపడేలా చేసే చిట్కాలు వ్యక్తులను బట్టి పని చేస్తుంటాయి. ఒంటరితనం నుండి బయటపడేంద
Wellness
oi-Pavan Ch
By Pavan Ch
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఒంటరితనాన్ని అనుభవిస్తారు. లవర్‌తో విడిపోయిన తర్వాత, విడాకులు తీసుకున్న తర్వాత, కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు, ఫ్రెండ్స్ దూరమైనప్పుడు, వయస్సు, అనారోగ్యం, కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఒంటరితనం అనుభవించవచ్చు. కొంత మంది తమతో ఇతర వ్యక్తులు ఉన్నా, ఇతర సంబంధంలో ఉన్నా ఒంటరితనం అనుభవిస్తారు. మానసిక పరిస్థితులు, వేరే వ్యక్తులతో కలవలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.

ఒంటరితాన్ని ఎదుర్కోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. వ్యక్తులను బట్టి వారి మనస్తత్వాలు, అభిప్రాయాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉన్నట్లే ఒంటరితనం నుండి బయటపడేలా చేసే చిట్కాలు వ్యక్తులను బట్టి పని చేస్తుంటాయి. ఒంటరితనం నుండి బయటపడేందుకు ఉపయోగపడే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త వ్యక్తులను కలవడానికి ప్రయత్నించాలి:
- ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరితనం అనుభవించినప్పుడు సాధ్యమైనంతగా ఇతరులతో ఉండటానికి ప్రయత్నించాలి.
- కొత్త వ్యక్తులను కలుసుకునేందుకు కమ్యూనిటీలు, సైక్లింగ్ కమ్యూనిటీలు, స్పోర్ట్స్ లీగులు, వ్యాయామ తరగతులు, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇలాంటి వాటిల్లో పాల్గొనడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడటంతో పాటు సరదాగా ఉంటుంది.
- బంధువులు, పాత స్నేహితులను కలవడానికి ప్రయత్నించాలి. బాల్య మిత్రుడిని కలిసి కాసేపు సమయం గడపండి.
- ఆన్‌లైన్ కమ్యూనిటీల్లో చేరండి. ఒకేరకమైన మనస్తత్వం గల వ్యక్తులను కనుక్కోవడం సోషల్ మీడియాలో తేలికైన పని. మీ అభిరుచులను బట్టి వ్యక్తులను వెతకండి. వారితో పరిచయం పెంచుకోండి.
- ఫోరమ్‌లు, చాట్‌రూములు, నాలెడ్జ్ హబ్‌లలో చేరితే కొత్త వ్యక్తులు చాలా సులభంగా పరిచయం అవుతారు.
- ఒంటరితనం అనుభవించే వారికి స్వీయ రక్షణ చాలా ముఖ్యం.
- పోషకాహారాలు తినాలి, రోజూ వ్యాయామం చేయాలి. కంటి నిండా నిద్ర పోవాలి.
- రోజూ హైకింగ్, సైక్లింగ్, రైడింగ్, స్విమ్మింగ్, జిమ్, డ్యాన్స్ లాంటివి చేయండి.
- దినచర్యలో యోగా, ధ్యానం భాగం చేస్తే శారీరక వ్యాయామమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
- ఇష్టపడే పనులు చేయడానికి రోజూ కొంత సమయాన్ని కేటాయించండి.
- సంగీతం వినడం, సినిమా చూడటం, బయటకు షికారుకు వెళ్లడం, పాటలు వింటూ పార్కులో నడవడం లాంటివి ఏవైనా ఇష్టమైన పనులు చేయాలి.
- మీకిష్టమైతే కవితలు రాయొచ్చు. పెయింటింగ్ వేయవచ్చు.
- పెంపుడు జంతువులకు మించిన సహచరులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
- ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే చాలా టైంపాస్ అవుతుంది.
- నిరాశ, ఆందోళన, ఒంటరితనం తగ్గించడంలో పెంపుడు జంతువులు సహాయపడతాయి.
- వాటికి సమయానికి ఆహారం పెట్టడం, బయటకు తీసుకెళ్లడం లాంటి వాటి వల్ల ఒక మంచి జీవనశైలి అలవాటు అవుతుంది.
- ఒంటరితనం మిమ్మల్ని కుదిపేయకుండా ఉండటానికి ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోవడం ముఖ్యం.
- ఎప్పటినుండో చేయాలనుకున్న అభిరుచి లేదా చేయాల్సిన పనులను ఇప్పుడు చేయండి.
- ఏదైనా అలవాటు ఉంటే దానిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి.
- కొత్త కోర్సు నేర్చుకోవడానికి ప్రయత్నించండి.

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి:

ఫన్ యాక్టివిటీస్ చేయండి:

పెంపుడు జంతువు పెంచుకోండి:

బిజీగా ఉండండి:
Comments
English summary



Click it and Unblock the Notifications