Latest Updates
-
భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే తప్పులు ఇవే.. మనస్పర్థలు తొలగాలంటే ఇలా చేయండి.! -
కూల్ డ్రింక్ సీసాలను ఇలా ఓపెన్ చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.. ఈ పొరపాట్లు ఇకపై వద్దు.! -
గుత్తి వంకాయతో మసాలా చేసి బోర్ కొడితే ఇలా కొత్తగా ట్రై చేయండి.. వదలకుండా తినేస్తారు.! -
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై వయసు ప్రభావం.. ఎంతవరకు వాస్తవం.? -
పిల్లల ఫేవరెట్ ‘ఆలూ’.. రెస్టారెంట్ టేస్ట్‌తో అదరగొట్టే దమ్ బిర్యానీ.! -
వర్షాకాలంలో వీటిని తినే ముందు జాగ్రత్త.. లేదంటే వాంతులు, విరేచనాలు తప్పవు.! -
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఇలా చేస్తే నో టెన్షన్ -
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.! -
పైన కరకర.. లోపల కరిగే చీజ్.. ఆహా అనిపించే పొటాటో చీజ్ బాల్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
మీతో ఇతరులు హ్యాపీగా ఉండాలంటే.. ఈ 5 విలువైన సలహాలు పాటించాల్సిందే.!
వయాగ్రా ఆడవాళ్లు వాడొచ్చా? వేసుకుంటే లాభాలేంటి, నష్టాలేంటి?
మహిళల్లో వయాగ్రా ప్రభావంపై అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను కలిగి ఉన్నాయి. అయితే తక్కువ లిబిడో ఉన్న మహిళలకు ఇది ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు.
వయాగ్రా అనేది సిల్డెనాఫిల్ అనే ఔషధానికి బ్రాండ్ పేరు. అది అంగస్తంభన సమస్య ఎదుర్కొనే పురుషుల కోసం ఆమోదించబడిన ఔషధం. వయాగ్రా వేసుకుంటే పురుషాంగానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. అంగం సరిగ్గా స్తంభిస్తుంది. అంగాన్ని ఎక్కువసేపు అలాగే ఉంచుతుంది. లైంగిక పనితీరు మెరుగుపడుతుంది. కానీ వయాగ్రా వేసుకోవడం వల్ల లైంగిక కోరికలు రావు. లైంగిక అసమర్థత ఉన్న మహిళలకు కూడా వయాగ్రా కొంత వరకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిమిత ఆధారాలు చెబుతున్నాయి.

సిల్డెనాఫిల్ రెవాటియో గా కూడా అందుబాటులో ఉంది. ఇది 20 మిల్లీ గ్రాముల మోతాదులో లభిస్తుంది. ఇది స్త్రీ పురుషుల్లో పల్మనరీ హైపర్‌టెన్షన్‌కు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అసలు ఆడవాళ్లు వయాగ్రా వాడొచ్చా, వాడిత ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలు వయాగ్రా తీసుకోవచ్చా?:
వయాగ్రా కేవలం పురుషుల కోసమే తయారు చేయబడింది. వారు వాడటానికి మాత్రమే ఆమోదించబడింది. అయితే కొంత మంది డాక్టర్లు మహిళలు కూడా వయాగ్రా వాడొచ్చని ఆఫ్-లేబుల్ సూచిస్తుంటారు. అన్ని ఔషధాల్లాగే వయాగ్రా వాడటం వల్ల కూడా దుష్ప్రభావాలు ఉంటాయి. ఇతర మందులతో కూడా సంకర్షణ చెందుతుంది. అందుకే వయాగ్రా వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తారు.
వయాగ్రా అనేది ఫాస్ఫోడీస్టేరేస్ 5 (PDE5) నిరోధకం. ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసే ఎంజైమ్.

వయాగ్రా ప్రయోజనాలు:
మగవారిలో వయాగ్రా రక్తనాళాలను విడదీసి పురుషాంగానికి రక్త ప్రసరణను పెంచుతుంది. వయాగ్రా తీసుకునే స్త్రీల జననాంగాలకు రక్త ప్రసరణ కూడా పెంచవచ్చు. అది సున్నితత్వం, ఉద్రేకం, ఉద్వేగం పనితీరు పెంచడంలో సహాయపడవచ్చు. మహిళల్లో వయాగ్రా ప్రభావంపై అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను కలిగి ఉన్నాయి. అయితే తక్కువ లిబిడో ఉన్న మహిళలకు ఇది ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు.

మహిళల్లో వయాగ్రా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్:
వయాగ్రా పురుషుల్లో రక్త నాళాలను విస్తరించడానికి, పురుషాంగానికి రక్త ప్రసరణను పెంచడానికి ఉపయోగిస్తారు. అదే విధంగా స్త్రీ విషయంలోనూ వయాగ్రా జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇది లైంగిక పనితీరు, సున్నితత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
వయాగ్రా వాడటం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
- తలనొప్పి
- రక్తపోటు తగ్గడం
- తల తిరగడం
- కళ్ల ముందు ఫ్లాషెస్
- ముక్కు దిబ్బడ
- అజీర్ణం
- గుండెలో దడ దడ

మహిళలు ఎంత మోతాదులో వయాగ్రా తీసుకోవచ్చు:
వయాగ్రా 25మి.గ్రా., 50మి.గ్రా., 100మి.గ్రా. మోతాదులో లభిస్తుంది. సాధారణంగా పురుషులను అత్యల్ప మోతాదులో ప్రారంభించమని సలహా ఇస్తారు. అది పని చేయకపోతే మాత్రమే డోసు పెంచాలని వైద్యులు సూచిస్తుంటారు. లైంగిక చర్యకు 30 నిమిషాల నుండి 4 గంటల ముందు వయాగ్రా తీసుకోవాలి. అలాగే పురుషులు రోజుకు 100 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు.
వయాగ్రా పురుషుల కోసమే తయారు చేయబడింది. కాబట్టి ప్రొడక్ట్ లేబుల్ పై స్త్రీలు ఎంత మోతాదులో తీసుకోవచ్చన్న సమాచారం ఉండదు. కాబట్టి మహిళలు కూడా అత్యల్ప మోతాదు నుండి ప్రారంభించడం ఉత్తమం.
పురుషులైనా, మహిళలైనా డాక్టర్ సూచించిన మోతాదులోనే వయాగ్రా తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
Reference:https://www.healthline.com/health/i-am-a-woman-and-i-took-viagra



Click it and Unblock the Notifications