Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
Lassa fever:లస్సా ఫీవర్ లక్షణాలేంటి? ఈ వైరస్ ప్రమాదకరమా? ఇది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
లస్సా ఫీవర్ తో తొలి మరణం సంభవించిందట. దాని లక్షణాలేంటి.. అది ప్రమాదకరమా? దాని నివారణకు తీసుకోవాల్సిన జాగత్ర్తలేంటో తెలుసుకుందాం.
అసలే ప్రపంచమంతా కరోనా మహమ్మారితో కొట్టుమిట్టాడుతుంటే.. దానికి ఎలాగోలా విరుగుడు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అయితే అది ఓమిక్రాన్ వంటి కొత్త వేరియంట్ల రూపంలో వచ్చినా.. దాని ప్రభావం అంతగా లేకపోవడంతో అందరూ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు.

అయితే మరో వైరస్ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. తాజాగా బ్రిటన్లో లస్సా ఫీవర్ తో ఒకరు మరణించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ఇలా అకస్మాత్తుగా లస్సా వైరస్ తో మరణించడం వెనుక ఉన్న కారణాలను, ఇందులో ఏమైనా కొత్త కోణాలు ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నామని వైద్యాధికారులు ప్రకటించారు.

2009 నుండి దేశంలో వ్యాధి యొక్క తొలి మూడు కేసులను ప్రకటించింది బ్రటిన్. తాజాగా లండన్ కు ఉత్తరాన ఉన్న బెడ్ ఫోర్డ్ షైర్ లోని ఓ ఆసుపత్రిలో ఓ రోగి మరణించాడు. ఈ ఫీవర్ సోకిన ముగ్గురు వ్యక్తులు తూర్పు ఇంగ్లాండ్ లోని ఒకే కుటుంబానికి చెందిన వారు. వారు ఇటీవలే పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లారు. ఈ సందర్భంగా లస్సా ఫీవర్ లక్షణాలేంటి.. ఇది ప్రమాదకరమా? దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం.

లస్సా ఫీవర్ అనేది తీవ్రమైన వైరల్ హెమరేజిక్ అనారోగ్యం. ఇది ఎబోలా మరియు మార్బర్గ్ వైరస్ ల మాదిరిగానే అదే కుటుంబానికి చెందింది. కానీ దీని వల్ల ప్రాణాపాయం అనేది చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఇది ఉత్తర నైజీరియాలోని లస్సా పట్టణంలో 1969 సంవత్సరంలో గుర్తించబడింది. యుకె(UK)హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(UKHSA), అనే ప్రజా ఆరోగ్య సంస్థ, రోగుల యొక్క సన్నిహిత పరిచయాలను తగిన అంచనాలను గుర్తించడం జరిగింది. వీటిని పరిశీలించిన వైద్యాధికారులు ఈ వైరస్ వల్ల ప్రజలకు ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మరో ఇద్దరు వ్యక్తులు లస్సా ఫీవర్ తో బాధపడుతున్నారని హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(UKHSA) స్పష్టం చేసింది. ఈ వైరస్ నుండి కోలుకున్నారని.. మరొకరికి బ్రిటీష్ రాజధానికి ఉత్తరాన ఉన్న రాయల్ ఫ్రీ లండన్ NHS ఫౌండేషన్ ట్రస్టులో నిపుణుల పర్యవేక్షణలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఆసుపత్రిలో హెమరేజిక్ జ్వరాల చికిత్సలో ప్రత్యేకత కలిగిన సురక్షితమైన యూనిట్ కలిగి ఉంది.

లస్సా జ్వరం అంటే ఏమిటి?
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ పొల్యూషన్(CDC) ప్రకారం, లస్సా ఫీవర్ కారక వైరస్ పశ్చిమ ఆఫ్రికాలో 1969 సంవత్సరంలో నైజీరియాలోని లస్సాలో తొలిసారిగా కనుగొనబడింది. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా, లైబీరియా, లియోన్, గినియా మరియు నైజీరియా వంటి దేశాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎలుక మూత్రం లేదా మలంతో కలుషితమైన ఆహార పదార్థాలతో సంబంధం కలిగి ఉన్న ఈ వ్యాధి బారిన పడొచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి యొక్క శరీర ద్రవాలతో లేదా కళ్లు, ముక్కు లేదా నోటి ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో సంపర్కం వేళ కూడా ఈ వ్యాధి సోకుతుంది. సోమవారం రోజున నైజీరియా మీడియా ఆ దేశంలో తాజాగా 48 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు నివేదించింది. వీరిలో 20 ఏళ్లలోపు ప్రధానంగా ప్రభావితమైన వయస్సు గలవారు ఎక్కువగా ఉన్నారట.

లస్సా ఫీవర్ లక్షణాలు..
లస్సా ఫీవర్ సోకిన వారిలో తేలికపాటి లక్షణాలలో జ్వరం, అలసట, బలహీనత మరియు తలనొప్పి వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే మాత్రం రక్తస్రావం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, ముఖం వాపు, ఛాతీ, వీపు మరియు కడుపులోకి నొప్పి ఉంటాయి. ఈ లక్షణాలన్నీ 1-3 వారాల తర్వాత సాధారణంగా మారిపోతాయి. ఇక సిడిసి(CDC) ప్రకారం, జ్వరంతో సంబంధం ఉన్న వారికి వినికిడి సమస్యలు కూడా రావొచ్చు.

ఇది ప్రమాదకరమైనదా?
ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది కోలుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. అయితే కొన్నిసార్లు ఇది తీవ్రమైన అనారోగ్యంగా సంభవించొచ్చు. WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఈ వ్యాధి సోకిన వారి మరణాల రేటును 1% శాతంగా పేర్కొంది. అయితే తీవ్రమైన కేసులతో ఆసుప్రతిలో చేరిన రోగులలో గమనించిన రేటు మాత్రం 15%గా ఉంది.
హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(UKHSA) ప్రకారం, ఈ వ్యాధి వల్ల ప్రమాదం చాలా తక్కువే. ‘ఈ వ్యాధి సంక్రమణ నిర్ధారణకు ముందు కేసులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులను పరిశీలిస్తున్నామని, వారికి మద్దతు మరియు సలహాలు అందిస్తున్నట్లు' ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఎలా నిరోధించాలి?
* ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఉత్తమ మార్గం ఎలుకలతో సంబంధాన్ని నివారించండం.
* ముఖ్యంగా ఈ వ్యాధి చెందుతున్న దేశాల్లో, ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సంబంధాన్ని నివారించడం.
* ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
* ఎలుకల కోసం ప్రత్యేక బోన్లలో ఆహారం ఉంచడం..
* ఎలుకలను బోనులో ఇరుక్కునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వంటివి చేయాలని CDC సలహా ఇస్తోంది.
* ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఉత్తమ మార్గం ఎలుకలతో సంబంధాన్ని నివారించండం.
* ముఖ్యంగా ఈ వ్యాధి చెందుతున్న దేశాల్లో, ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సంబంధాన్ని నివారించడం.
* ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
* ఎలుకల కోసం ప్రత్యేక బోన్లలో ఆహారం ఉంచడం..
* ఎలుకలను బోనులో ఇరుక్కునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వంటివి చేయాలని CDC సలహా ఇస్తోంది.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ పొల్యూషన్(CDC) ప్రకారం, లస్సా ఫీవర్ కారక వైరస్ పశ్చిమ ఆఫ్రికాలో 1969 సంవత్సరంలో నైజీరియాలోని లస్సాలో తొలిసారిగా కనుగొనబడింది. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా, లైబీరియా, లియోన్, గినియా మరియు నైజీరియా వంటి దేశాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎలుక మూత్రం లేదా మలంతో కలుషితమైన ఆహార పదార్థాలతో సంబంధం కలిగి ఉన్న ఈ వ్యాధి బారిన పడొచ్చు.



Click it and Unblock the Notifications











