Latest Updates
-
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే!
Parasite Eat Eye: కాంటాక్ట్ లెన్స్‌తో నిద్రపోతే.. కంటినే తిన్న పరాన్నజీవి
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్రపోవడంతో పరాన్నజీవి కంట్లోకి ప్రవేశించి కంటిని తినడం ప్రారంభించింది. దీని వల్ల అతడు పూర్తిగా చూపు కోల్పోయాడు.
కాంటాక్ట్ లెన్స్ లు ధరించి నిద్రపోవద్దు.. ఇది కాంటాక్ట్ లెన్స్ లు వాడే ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. అయినా కొంత మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒక్కసారికి ఏమవ్వదు.. అప్పుడప్పుడు అలా నిద్రపోతే ఏం కాదులే అనే సమాధానం చాలా మంది నుండి వస్తుంది. కానీ ఇలాంటి పొరపాట్ల వల్ల తీవ్రమైన ప్రభావాలు పడతాయి. చిన్న తప్పుకు పెద్ద శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్రపోవడంతో పరాన్నజీవి కంట్లోకి ప్రవేశించి కంటిని తినడం ప్రారంభించింది. దీని వల్ల అతడు పూర్తిగా చూపు కోల్పోయాడు.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 21 ఏళ్ల మైక్ క్రుంహోల్జ్ అనే యువకుడు గత ఏడు సంవత్సరాలుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తుంటాడు మైక్. జాబ్ చేస్తున్నప్పుడు ఏ కొద్దిగా సమయం దొరికినా ఓ కునుకు తీసేవాడు. కొన్ని నిమిషాల నుండి గంటల పాటు నిద్రపోయే వాడు. ఈ సమయంలో కాంటాక్ట్ లెన్స్ తీయడం ఎందుకులే అనుకుని అలాగే నిద్రపోయే వాడు.
గత ఏడు సంవత్సరాలుగా కాంటాక్ట్ లెన్స్ వాడుతున్న మైక్. ఇలా అప్పుడప్పుడు కాంటాక్ట్ లెన్స్ తోనే నిద్రలోకి జారుకునే వాడు. నిద్రపోయేటప్పుడు కాంటాక్ట్ లెన్స్ తీసేయ్యాలని, అలా పడుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు వస్తాయని మైక్ క్రుంహోల్జ్ కు బాగా తెలుసు.

కంటిని తినే పరాన్నజీవి:
ఒక రోజు క్రుంహోల్జ్ కు కన్ను నొప్పిగా, దురదగా అనిపించడం మొదలైంది. కన్ను ఎర్రబడింది. వెంటనే వైద్యుడిని సంప్రదించగా షాకింగ్ విషయం బయటపడింది. అతని కుడి కంటిలో అకాంతమీబా కెరాటిటిస్(Acanthamoeba Keratitis) అనే పరాన్నజీవి(Parasite) సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ పరాన్నజీవి అతని కంటిని తినేస్తున్నట్లు గుర్తించారు.
ఈ పరాన్నజీవి కంటిని తినేస్తుండటం వల్ల మైక్ క్రుంహోల్జ్ పూర్తిగా కంటి చూపు కోల్పోయాడు. కుడి కన్ను ఏమాత్రం కనిపించడం లేదు. ఎవరూ కాంటాక్ట్ లెన్స్ ధరించి నిద్రపోవద్దని, స్నానం చేయొద్దని మైక్ చెప్పినట్లుగా గో ఫండ్‌మీ అనే పేజీ పేర్కొంది.
ఈ రకమైన కంటిని తినే పరాన్నజీవి 10 లక్షల్లో 33 మంది సోకుతున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.

కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చేయడానికి కొన్ని దశల గురించి తెలుసుకుందాం.
1. మీ చేతులు శుభ్రంగా ఉండాలి
ఈ కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చేయడానికి మొట్టమొదటి ముఖ్యమైన దశ అని చెప్పవచ్చు. మీ చేతులను శుభ్రం చేసుకోవటానికి యాంటి బాక్టీరియా సబ్బు లేదా క్లీన్సెర్ ను ఉపయోగించాలి. మీరు ఈ సందర్భంలో శుభ్రం చేసుకోవటానికి ఒక చేతి సానిటిసేర్ ను ఎంచుకోవచ్చు. కానీ ఒక ఎంపిక కాదు. జెర్మ్స్ మరియు బాక్టీరియా మీ కంటిలో చేరకుండా ఉండటం అనేది మీ చేతుల్లోనే ఉన్నది.
2. క్వాలిటీ సొల్యూషన్స్
ఎల్లప్పుడూ కాంటాక్ట్ లెన్స్ శుభ్రం చేయడానికి ఒక నాణ్యత గల క్లీన్సింగ్ సొల్యూషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. నాణ్యత కొరకు ధరలో రాజీ పడకూడదు. మీరు కొనుగోలు చేసే సొల్యూషన్స్ మీ వైద్యుడు లేదా లెన్స్ తయారీదారుడు నుంచి సిఫార్సు ఉందని నిర్ధారించుకోండి. అన్ని సొల్యూషన్స్ అన్ని రకాల కాంటాక్ట్ లెన్స్ కు సరిపడవు.
3. లెన్స్ శుభ్రపరుచుట
మీ కంటి నుండి లెన్స్ తొలగించిన తర్వాత మీ సరఫరాదారు లేదా వైద్యుడు సూచించిన విధంగా సొల్యూషన్ తో శుభ్రం చేయాలి. క్లీనింగ్ కంటి తయారు అవశేషాలను తొలగిస్తుంది. కాంటాక్ట్ లెన్స్ పై పాతుకుపోయిన కాస్మెటిక్స్ లేదా ఇతర వ్యర్ధాలు ఉండుట వలన అస్పష్టతకు దారితీస్తుంది. మీరు సొల్యూషన్ యొక్క కొన్ని చుక్కలను మీ అరచేతిలో వేసుకొని లెన్స్ ను రుద్దడం మంచిది.
4. సోకింగ్ సమయం
వివిధ కాంటాక్ట్ లెన్స్ కోసం వివిధ సొల్యూషన్ లో ఉంచే పద్ధతులు ఉన్నాయి. మీ కాంటాక్ట్ లెన్స్ కోసం ఉత్తమమైన సొల్యూషన్ లో ఎంత సమయం ఉంచాలోమీ సరఫరాదారు నుంచి తెలుసుకోవటం చాలా ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. మీరు శుభ్రమైన లెన్స్ కేసు లేదా లెన్స్ హోల్డర్ లో తాజా సొల్యూషన్ తో నింపి లెన్స్ ఉంచండి. మీరు శుభ్రం చేయటానికి నీరు,లాలాజలం ఎప్పటికి వాడకూడదని గుర్తుంచుకోవాలి.
5. హోల్డర్ కేసు శుభ్రం
మీరు సొల్యూషన్ లో ఉంచే సమయంలో చేతులతో తాకకుండా జాగ్రత్త వహించాలి. మీరు మీ దృష్టిని లెన్స్ మీద ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మీరు లెన్స్ అమర్చిన తరువాత తాజా సొల్యూషన్ విషయంలో శుభ్రం చేయుట మరియు ఇది పూర్తిగా పొడిగా ప్రసారణకు అనుమతిస్తుంది. సొల్యూషన్ అయిపోతే పొడిగా ఉంచకూడదు. అలాగే నీటితో కడగటం చేయకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
అకాంతమీబా కెరాటిటిస్(Acanthamoeba Keratitis)
ఆ పరాన్నజీవి క్రమంగా కంటిని తినేస్తుంది
అకాంతమీబా కెరాటిటిస్(Acanthamoeba Keratitis)
స్నానం చేస్తున్నప్పుడు ఆ నీరు కంట్లోకి వెళ్తే, కాంటాక్ట్ లెన్స్ లో పరాన్నజీవులు ఉంటే ఆ లెన్స్ పెట్టుకోవడం వల్ల, మురికిగా ఉన్న చేతులతో కళ్లను ముట్టుకుంటే పరాన్నజీవులు కంట్లోకి ప్రవేశిస్తాయి.
శస్త్రచికిత్స ద్వారా పరాన్నజీవులను తొలగించవచ్చు



Click it and Unblock the Notifications