Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
No Smoking Day:సిగరెట్ మానేయాలంటే.. ఈ హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వండి..
నో స్మోకింగ్ డే 2022 సందర్భంగా ఆయుర్వేదిక్ చిట్కాలు మరియు హోమ్ రెమెడీస్ తో పొగ తాగడాన్ని సులభంగా మానేయొచ్చు.
ప్రతి సంవత్సరం మార్చి నెలలో రెండో బుధవారం రోజున నేషనల్ నో స్మోకింగ్ డే జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 9వ తేదీన వచ్చింది. ఈరోజున పొగతాగడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. ఆరోగ్యంపై అవగాహన కల్పించే దినోత్సవంగా జరుపుకుంటారు. ఎవరైతే పొగతాగడం మానేయాలని అనుకుంటారో.. వారికి సాయం చేయడమే నో స్మోకింగ్ డే ఉద్దేశ్యం.

మొట్టమొదట నో స్మోకింగ్ డేను 1984లో జరిపారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ ను రూపొందిస్తూ.. పొగతాగడం వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ ప్రచారం చేస్తారు.

సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు నాశనం అవుతాయని చాలా మందికి తెలుసు. ఆస్తమా, క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. ఒక్కసారి సిగరెట్ కు బానిసలుగా మారారంటే దాని నుండి బయటపడటం చాలా కష్టం. అయితే కొన్ని హోమ్ రెమెడీస్ మరియు ఆయుర్వేదిక్ చిట్కాలు ఫాలో అవ్వడం ద్వారా ధూమపానం అలవాటు నుండి సులభంగా బయటపడొచ్చు. ఈ సందర్భంగా ధూమపానం మానేయడానికి ఎలాంటి నివారణలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

ఎండిన అల్లం..
మీకు ధూమపానం అలవాటు ఎక్కువగా ఉండి.. వీరు మీ వ్యసనం నుండి బయటపడాలంటే.. మీరు మీతో పాటు ఊరగాయ పొడి అల్లం ఉంచుకోవాలి. మీకు పొగాకు లేదా దాని ఉత్పత్తులను వాడాలని అనిపించినప్పుడల్లా ఈ అల్లం నమలండి. నెమ్మదిగా మీకు పొగతాగడం అనే వ్యసనం నుండి బయటపడతారు.

ఎక్కువగా నీరు..
మీ శరీరంలో నుండి విషాన్ని తొలగించడంలో నీరు చాలా ఉపయోగకరంగా పని చేస్తుంది. మీరు ధూమపానం మానేయాలంటే.. ప్రతిరోజూ భోజనం చేయడానికి ముందు కనీసం 15 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగితే జీవక్రియ రేటు అదుపులో ఉంటుంది. ఈ కారణంగా మీరు పొగతాగడం వంటి అలవాటును క్రమంగా మానేయడం ప్రారంభమవుతుంది.

లిక్వోరైస్ నమలండి..
మీకు సిగరెట్ తాగాలని మైండ్లో ఆలోచన వచ్చినప్పుడల్లా, లిక్వోరైస్ ను నమలండి ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మీకు పొగాకు ఉత్పత్తులను తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది.

సోంప్ గింజలు..
మీకు పొగాకు ఉత్పత్తులను తీసుకోవాలని కోరిక కలిగినప్పుడల్లా మీరు కొన్ని సోంప్ గింజలను నమలండి. అలాగే ఆకుకూరలను ఎక్కువగా తినండి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీరు పొగాకు తాగడం అనే వ్యసనం నుండి బయటపడొచ్చు.

త్రిఫలను తినండి..
త్రిఫల తీసుకోవడం వల్ల మీ బాడీలో నుండి టాక్సిన్స్ క్లియర్ చేయబడతాయి. అంతేకాదు విషపూరిత పోగాకు ఉత్పత్తులను తీసుకోవాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ప్రతి రాత్రి ఒక టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీటిని తీసుకోవచ్చు. ఇది మంచి జీర్ణక్రియగా కూడా సహాయపడుతుంది.

మూలికా టీ..
జటాస్మి, చామాంతి మరియు బ్రాహ్మిలను సమాన పరిమాణంలో కలపండి. వీటిని ఒక జాడీలో ఉంచండి. ఒక టేబుల్ స్పూన్ తో ఈ మిశ్రమాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ముంచి నెమ్మదిగా తాగాలి. ఇలా చేయడం వల్ల ధూమపానం చేయాలనే కోరికను అధిగమించేందుకు సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications