Latest Updates
-
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.?
'ఉద్యోగులతో ఆన్‌లైన్ మీటింగ్స్ ఉండవిక' కెనడా సంస్థ నిర్ణయం వెనక కారణాలేంటంటే..
ఉద్యోగులతో ఆన్‌లైన్ మీటింగ్స్ ఉండవని ఓ కెనడా సంస్థ నిర్ణయం తీసుకుంది. ఆఫీస్ మీటింగ్స్ వల్ల ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి పడుతుంది, కుటుంబసభ్యులతో గడిపే సమయం ఎలా తగ్గుతుంది, కెనడా సంస్థ తీసుకున్న నిర్ణయం వెనక కారణాలేంటో ఇప్ప
కరోనా నుండి రిమోట్ వర్కింగ్ బాగా పెరిగిపోయింది. ఇంటి నుండి ఎక్కడ వీలైతే అక్కడి నుండి పని చేసే కల్చర్ పెరిగింది. ఇంటి నుండి పని చేసే వారిపై టీం లీడర్లు, మేనేజర్లు, పెట్టే ఒత్తిడి అంతా ఇంతా కాదు. తరచూ మీటింగ్‌లు నిర్వహిస్తూ మొత్తం టైం తినేస్తున్నారు. ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చేసే పని పెంచేస్తున్నారు. చాలా సందర్భాల్లో పని గంటలకు మించి మీటింగ్స్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి. దీని వల్ల వ్యక్తిగత సమయంలో లేకుండా పోతోంది. కుటుంబసభ్యులతో గడిపే సమయం కూడా ఉండటం లేదు. ఉద్యోగులపై పడుతున్న ఒత్తిడిని గమనించి కెనడాకు చెందిన షాపిఫై సంస్థ ఉద్యోగులతో మీటింగ్స్‌ను అన్నింటిని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

తరచూ నిర్వహించే ఆఫీస్ మీటింగ్స్‌తో దుష్ప్రభావాలు:
కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోం సంస్కృతి పెరిగిపోయింది. ఉద్యోగుల పనితీరుపై తరచూ మీటింగ్స్ నిర్వహించడం కూడా పెరిగింది. తరచూ నిర్వహించే ఆఫీస్ మీటింగ్స్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.
తరచూ నిర్వహించే మీటింగ్స్ ఉద్యోగుల పనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. ఉద్యోగులు లక్ష్యాలను చేరుకోవడంలో మీటింగ్స్ ఏమాత్రం సహాయపడట్లేదని అధ్యయనకర్తలు చెబుతున్నారు. మేనేజర్లకు ఉద్యోగులకు మధ్య సంబంధానికి ఈ మీటింగ్స్ వల్ల నష్టమే జరుగుతున్నట్లు తేలింది. మేనేజర్లకు, ఉద్యోగులకు మధ్య సంబంధం పెరగడానికి తరచూ మీటింగ్స్ నిర్వహించడం మంచిది కాదని చెబుతున్నారు.

తక్కువ మీటింగ్స్ వల్ల ప్రయోజనాలు:
ఆఫీస్ మీటింగ్స్ 40 శాతం తగ్గినప్పుడు ఉద్యోగుల ఉత్పాదకత 71శాతం ఎక్కువగా ఉందని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పరిశోధనలో తేలింది. మీటింగ్స్ నిర్వహించకపోవడం వల్ల ఉద్యోగులు తమకు తామే జవాబుదారీగా ఉంటున్నట్లు వెల్లడైంది. దాని వల్ల ఉద్యోగుల సంతృప్తి 52 శాతం పెరిగినట్లు గుర్తించారు.
60 శాతం సమావేశాలను రద్దు చేయడం వల్ల ఉద్యోగుల సహారం 55 శాతం పెరిగింది. పనికి సంబంధించి ఇతర సహోద్యోగులతో, బాస్‌తో కనెక్ట్ కావడానికి వారు ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటారు. దీని వల్ల పనిలో వేగం పెరగడమే కాదు ఒత్తిడి 57 శాతం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది. ఒత్తిడి తగ్గడం వల్ల ఉద్యోగుల మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.
కంపెనీ కోసం కష్టపడి పని చేస్తారని పరిశోధనలో తేలింది. ఉద్యోగులు నిర్వహించే కమ్యూనికేషన్ 65 శాతం స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా ఉంటుందని వెల్లడైంది.

పనిలో ఒత్తిడి ఎదుర్కొంటే ఈ చిట్కాలు పాటించండి:
దీర్ఘ శ్వాస:
పని ఒత్తిడిని తగ్గించుకుని, ప్రశాంతంగా ఉండటానికి మంచి మార్గాలలో దీర్ఘ శ్వాస ఒకటి. ఇది తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, భావోద్వేగాలను కూడా నియంత్రించడానికి పని చేస్తుంది.
ప్రశాంతంగా ఉండటం:
చాలా మంది ప్రశాంతతను కోల్పోతారు. చివరకు పని చేసే చోట అనవసరం నిర్ణయాలు తీసుకుంటారు. పని ఒత్తిడి పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబసభ్యులతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడటానికి ప్రయత్నించండి.
తమాషాగా ఉండే కొన్నిటిని గమనించండి:
మీరు ఒత్తిడిగా ఉన్నపుడు, మీరు నవ్వడం అవసరం. నవ్వు అనేది శరీరం, మనసు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఔషధం. ఏదైనా తమాషాగా ఉండే వాటిని చూసి వృత్తిపరమైన ఒత్తిడిని తొలగించుకోండి.
మంచి ఆహరం తినండి:
కొన్ని ఆహార పదార్ధాలు మీ మానసిక స్థితిని మెరుగుపరిచి, మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. మీకు ఒత్తిడిగా ఉంది అనిపిస్తే, అల్మండ్స్, బ్లూ బెర్రీలు, ఆరంజ్ వంటి ఒత్తిడిని తగ్గించే ఆహార పదార్ధాలను తీసుకోండి.
విటమిన్ C తీసుకోండి:
విటమిన్ C ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది ఒత్తిడిపై పోరాడి సహజంగా తగ్గించడానికి సహాయపడుతుంది. పని ఒత్తిడిని పరిష్కరించేందుకు మీ ఆహారంలో కారెట్లు, ఆరంజ్, సిట్రస్ పండ్లు ఉండేట్లు చూసుకోండి.
ఎక్కువ నీరు తాగడం:
ఇది ఒత్తిడిని తగ్గించడానికి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడానికి మరో మార్గం. ఇది అలసటతో ఉన్న మీ కండరాలను శాంతపరిచి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేట్టు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications