Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Sky fruit benefits: రుచిలో కాస్త చేదుగా ఉన్నప్పటికీ, ఈ చక్కెర బాదం మధుమేహం-కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది
Sky fruit benefits: రుచిలో కాస్త చేదుగా ఉన్నప్పటికీ, ఈ చక్కెర బాదం మధుమేహం-కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది
మీరు ఎప్పుడైనా చక్కెర బాదం తిన్నారా? దీనిని స్కై ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దీని పేరు షుగర్ ఆల్మండ్ అయినప్పటికీ, ఇది తినడానికి కొంచెం చేదుగా ఉంటుంది. కానీ దాని ప్రయోజనాలు మాత్రం మీరు ఊహించని విధంగా అద్భుతమైనవి. డ్రై ఫ్రూట్స్ లో మీకు బాదం పప్పులు గురించి తెలుసు. అయితే ఈ షుగర్ బాదం అంటే ఏంటని ఆలోచిస్తున్నారు. అవును బాదంలాగే ఉండే స్కై ఫ్రూట్ ను షుగర్ బాదం అని పిలుస్తారు. మనం మన ఆహారాల్లో స్నాక్స్ టైంలో రెగ్యులర్ బాదం పప్పులను ఎక్కువగా తింటుంటాం, అవి తినడానికి రుచికరంగా ఉంటాయి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగినవి. అయితే మీరు ఎప్పుడైనా చక్కెరతో కూడిన బాదంపప్పులను తిన్నారా? దీనిని స్కై ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.

షుగర్ బాదం అని పేరు ఉన్నప్పటికీ, ఇది తినడానికి మాత్రం చాలా చేదుగా అనిపిస్తుంది. అనేక ఆగ్నేయాసియా దేశాల్లో స్కై ఫ్రూట్ లేదా షుగర్ బాదంపప్పులను ఒక ఔషధంగా కూడా పరిగణిస్తారు. ఇది ఆరోగ్య పరంగా హై బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ పండ్లు చెట్టు నుండి క్రిందికి వ్రేలాడదీయబడతాయి, అయితే చక్కెర బాదంను స్కై ఫ్రూట్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆకాశంలో పండు. దీని ప్రయోజానాలు మరిన్ని విషయాల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

చక్కెర బాదం అంటే ఏమిటి?
చక్కెర బాదంపప్పులను స్కై ఫ్రూట్ అని కూడా పిలుస్తారు, ఇది మహోగని చెట్టుపై పెరిగే పండు. దానిని పగులగొట్టిన తరువాత, దాని నుండి వచ్చిన విత్తనాలను తింటారు. చక్కెర బాదంలో సపోనిన్ అనే కంటెంట్ ఉంటుంది, ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగ పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల ప్రకారం, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దాంతో షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
చక్కెర బాదంలో పోషకాలు:
రెగ్యులర్ బాదంలో లాగే ఈ షుగర్ ఫ్రూట్ లో కూడా విటమిన్లు, మినరల్స్, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ ,కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, , ఫ్యాటీ యాసిడ్స్, నేచురల్, ప్రొటీన్లు, ఎంజైమ్‌లు మరియు అనేక పోషకాలు ఉన్నాయి, చక్కెర బాదంపప్పులు కొద్దిగా చేదుగా రుచి చూస్తాయి.
చక్కెర బాదంలో ఎటువంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం?

చక్కెర బాదం తింటే పొందే ప్రయోజనాలు
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో చక్కెర బాదం తీసుకోవడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది.

కరోనరీ హార్ట్ డిసీజ్ నుండి రక్షణ కల్పిస్తుంది.
హార్ట్ సమస్యలున్న వారు, చక్కర బాదంను నీటిలో నానబెట్టి రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చు. ఇది హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది. అలాగే కరోనరీ హార్ట్ డిసీజ్ నుండి రక్షణ కల్పిస్తుంది.

రుతుక్రమంలో నొప్పి నివారిస్తుంది.
పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నివారించడానికి స్కై ఫ్రూట్ ఉపయోగపడుతుంది. పీరియడ్స్ మొదటి రోజును స్కై ఫ్రూట్ ను కొద్దిగా తింటే నొప్పి తగ్గుతుంది.

నోటి దుర్వాసనను పోగొడుతుంది.
స్కై ఫ్రూట్ లో ఉండే చేదు నోటిలో పొలుసు వాసనను తగ్గిస్తుంది. రోజూ ఉదయం ఈ విత్తనాలను నమిలితే నోటి దుర్వాసన ఉండదు.

స్ట్రోక్ నివారిస్తుంది
స్ట్రోక్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు స్కై ఫ్రూట్ తింటే తర్వాత తర్వాత స్ట్రోక్ రాకుండా ఉంటుంది.

అంగస్తంభన లోపంను నివారిస్తుంది.
చాలా మంది పురుషులు ఎదుర్కొనే సమస్య అంగస్తంభన. దీన్ని నివారించడానికి ఇది ఒక బెస్ట్ న్యాచురల్ రెమెడీ, రెగ్యులర్ డైట్ లో దీన్ని తప్పనిసరిగా తీసుకోండి.

నిద్ర సమస్యలను అధిగమించడానికి
ఈ చక్కర బాదం మీ నిద్ర సమస్యలను అధిగమించడానికి చాలా మేలు చేస్తుంది.

శరీరంలో క్రమంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
స్కై ఫ్రూట్ లేదా చక్కెర బాదంపప్పులను రెగ్యులర్ గా తింటుంటే శరీరంలో క్రమంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

మలబద్దకం సమస్య నుండి పూర్తిగా ఉపశమనం
చక్కెర బాదం రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం వాటిని తిని, ఆ నీరు తాగితే, మలబద్దకం సమస్య నుండి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది.

వివిధ రకాల చర్మ సమస్యల
వివిధ రకాల చర్మ సమస్యలతో బాధపడే వారికి చక్కర బాదం పప్పులు చాలా ఉపయోగపడుతాయి.

చక్కెర బాదం లేదా స్కై ఫ్రూట్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు:
- చక్కెర బాదంలో ఆరోగ్యానికి ఉపయోగపడే ప్రయోజనాలే కాదు, దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం:
- మితంగా తింటే ఏదైనా అమ్ముతమే. యితే చక్కెర బాదంపప్పులను మోతాదకు మించి ఎక్కువగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది.
- లివర్ డ్యామేజ్ కు కారణం అయ్యే ఈ షుగర్ ఫ్రూట్ ను మితంగా మాత్రమే తీసుకోవాలి. లేదా దాని వినియోగానికి దూరంగా ఉండాలి.
- చక్కెర బాదంపప్పు తిన్న తర్వాత వికారంగా అనిపిస్తే వెంటనే వాటిని తినడం మానేయాలి.
- మీకు ధీర్ఘకాలిక వ్యాధులైన థైరాయిడ్, కాలేయ వ్యాధి, కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే, చక్కెర బాదంపప్పును వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి.



Click it and Unblock the Notifications