ధూమపానంతో వచ్చే దగ్గు: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

ధూమపానంతో వచ్చే దగ్గు: కారణాలు, లక్షణాలు మరియు చికిత్స

ధూమపానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్లు మరియు బీడీ ప్యాకెట్లపై వ్రాసి ఉంటే కూడా స్మోకింగ్ చేసే వారు ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ధూమపానం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఇది అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వాటిలో ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తుంది. దగ్గు, ఆస్త్మా, దీర్ఘకాలిక ఛాతీ దగ్గు ధూమపానం చేసేవారిలో కనిపించే ప్రారంభ లక్షణాలు. ఈ వ్యాసంలో ధూమపానం చేసేవారిలో కనిపించే దగ్గు గురించి మేము మీకు చెప్పబోతున్నాము.

ధూమపానం చేసేవారిలో కనిపించే దగ్గు సాధారణ దగ్గుకు భిన్నంగా ఉంటుంది. సాధారణ దగ్గు కొద్ది రోజుల్లో మాయమవుతుంది. కానీ ధూమపానం చేసేవారిలో కనిపించే దగ్గు ధూమపానం మానేసే వరకు పోదు. ధూమపానం చేసే వారిలో మూడు వారాల కన్నా ఎక్కువ దగ్గు ఉంటే, అది ధూమపానం వల్ల వచ్చే దగ్గు అని భావించాలి. మీరు నికోటిన్ లేదా పొగాకును వేరే విధంగా పీల్చినా మీకు ధూమపానం దగ్గు వస్తుంది. ధూమపానం చేసే వారిలో ఇది వ్యక్తికి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ధూమపానం దగ్గువల్ల ఛాతీ దగ్గు, ఆస్తమా మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ దగ్గు నుండి ఉపశమనం పొందడానికి ఉత్తమ మార్గం నికోటిన్ కు దూరంగా ఉండటం లేదా నికోటిన్ ను వదులుకోవడం.

ధూమపానం దగ్గు లక్షణాలు:

ధూమపానం దగ్గు లక్షణాలు:

ప్రారంభంలో ధూమపానం దగ్గు సాధారణ దగ్గుగా కనిపిస్తుంది. ఇది పొడి దగ్గు. కానీ ఇది పెరుగుతున్న కొద్దీ కఫం(గల్ల) కూడా వస్తుంది.

* గల్ల రంగులేనిది

* కఫం తెల్లగా ఉంటుంది

* పసుపు-ఆకుపచ్చ రంగులోనూ ఉండవచ్చు

* దగ్గినప్పుడు కఫంతో పాటు రక్తస్రావం

ధూమపానం దగ్గు ప్రారంభ లక్షణాలు

ధూమపానం దగ్గు ప్రారంభ లక్షణాలు

* ఛాతీ నొప్పి

* శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు

* గొంతు నొప్పి

* ఊపిరిఆడనివ్వుదు

* శ్వాస తీసుకోవడం

* ధూమపానం దగ్గు ప్రారంభ సంకేతాలను విస్మరిస్తే, అది పెద్ద సమస్యగా మారుతుంది.

ధూమపానం చేసేవారు

ధూమపానం చేసేవారు

* మీరు ధూమపానం చేసేవారు అయితే దగ్గు నుండి బయటపడలేరు. అయితే, ఈ దగ్గు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వ్యాపించకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ధూమపానం దగ్గు ఉదయం ఎక్కువగా కనిపిస్తుంది మరియు రోజు గడిచే కొద్దీ తగ్గుతుంది.

ఇతర దగ్గు మరియు ధూమపానం దగ్గు

ఇతర దగ్గు మరియు ధూమపానం దగ్గు

ఇతర దగ్గు నుండి కొన్ని అంశాలు ధూమపాన దగ్గును వేరు చేస్తాయి. ఆస్తమా, కఫం, దగ్గు, శ్వాసలోపం, ఊపిరి ఆడని సమయంలో దగ్గు వంటి లక్షణాలు కనబడుతాయి. సాధారణ దగ్గు అనేక కారణాల వల్ల వస్తుంది. ఇది ఒకటి లేదా రెండు రోజుల్లో అదృశ్యం అవుతుంది. దీని నుండి ఎలాంటి తీవ్రమైన సమస్య ఉండదు. ధూమపానం దగ్గు ముఖ్యంగా ధూమపానం చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది నికోటిన్ మరియు పొగాకు వల్ల వస్తుంది. అయితే, ధూమపానం చేసేవారు ఎప్పుడూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

ధూమపానం దగ్గు: చికిత్స మరియు కొన్ని ఇంటి నివారణలు

ధూమపానం దగ్గు: చికిత్స మరియు కొన్ని ఇంటి నివారణలు

ధూమపానం దగ్గు నుండి శాశ్వత ఉపశమనం పొందాలంటే ధూమపానం మానుకోవడమే దీనికి పరిష్కారం. కొన్ని చికిత్సలు ద్వారా దీని లక్షణాలను తగ్గించుకోవచ్చు.

దగ్గు తగ్గించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు:

దగ్గు తగ్గించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు:

* ఎప్పుడూ ఎక్కువ నీరు త్రాగాలి.

* తక్షణ పరిష్కారం కోసం వేడి నీటితో నోటిని పుక్కిలించండి

* తేనె వేసిన వేడినీరు తాగాలి.

* మాత్రలు మింగ్రాలి

దగ్గు తగ్గించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు:

దగ్గు తగ్గించడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు:

* క్రమం తప్పకుండా శ్వాస వ్యాయామాలు చేయండి

* దగ్గు తగ్గకపోతే, ఆవిరి పట్టండి.

* హ్యూమిడిఫైయర్ వాడండి.

* ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవనశైలిని అనుసరించండి.

లెమన్ జ్యూస్

లెమన్ జ్యూస్

స్మోకర్స్ కాఫ్ ను నివారించుటకు లెమన్ జ్యూస్ ఒక ఉత్తమ హోం రెమెడీ. ప్రతి రోజూ ఉడయం గోరువెచ్చని లెమన్ వాటర్ ను త్రాగడం వల్ల, ఉదయం వచ్చే దగ్గును నివారిస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

బాగా కాగిన పాలలో వెల్లుల్లితురుము వేసి బాగా మరిగించి , తర్వాత అందులో పంచదార లేదా తేనె వేసి మిక్స్ చేసి, దీన్ని రోజుకు రెండు సార్లు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

యూకలిప్టస్ మరియు పుదీనా

యూకలిప్టస్ మరియు పుదీనా

యూకలిప్టస్ ఆకులు మరియు పుదీనా రెండింటిని నీళ్ళలో వేసి ఉడికించాలి . తర్వాత ఈ నీటిని వడగట్టి తీసుకోవాలి. ఇది స్మోకర్స్ కాఫ్ ను నివారిస్తుంది.

Story first published: Tuesday, September 17, 2019, 20:00 [IST]
Desktop Bottom Promotion