For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sex Tips : మీ శృంగారాన్ని మరింత ఆస్వాదించాలంటే.. వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి...

|

మన దేశంలో ఇప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో శృంగారం గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపరు. అయితే వాస్తవం ఏమిటంటే.. శృంగారం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

చిన్న వయసు నుండే శృంగారంపై అవగాహన ఉండటం వల్ల.. అనేక సందేహాలకు సమాధానం కూడా లభిస్తుంది. ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నప్పుడు మగవారికి, ఆడవారికి శృంగారం అనేక అనుమానాలు వస్తుంటాయి.. అయితే వారు ఎవరిని అడగాలో తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు.

అందుకే అలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే ఇంటా, బయటా, సమాజంలోని పలుచోట్ల సందర్భానుసారంగా శృంగారం గురించి మాట్లాడుకోవడం తప్పేమీ కాదు. అంతేకాదు దీని వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఆరోగ్యకరమైన లైంగిక జీవితం అనేది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాదు.. ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది. సెక్స్ హెల్త్ కు అవసరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ సందర్భంగా మీరు లైంగిక జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడం ఎంతగానో అవసరం. అయితే ఇంకెందుకు ఆలస్యం శృంగార జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో.. లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

‘ఆ’ వ్యాయామం చేయండి..

‘ఆ’ వ్యాయామం చేయండి..

మీరు మంచి శృంగార జీవితాన్ని పొందాలనుకుంటే, మీరు మీ దినచర్యలో కీగెల్ వ్యాయామాలను చేర్చండి. దీని వల్ల కటి చుట్టుపక్కల ప్రాంతానికి రక్త ప్రవాహం పెరుగుతుంది. దీని వల్ల కండరాలు బలపడతాయి. ఇవి బలోపేతం అయినప్పుడు ఉద్వేగం, ఉద్దీపన పెరుగుతుంది. ఇది లైంగిక ప్రేరణను కూడా బాగా పెంచుతుంది. ఇలాంటి సమయంలో మహిళలు శృంగారాన్ని బాగా ఆస్వాదించగలుగుతారు.

భారంగా ఫీలవ్వొద్దు..

భారంగా ఫీలవ్వొద్దు..

శృంగారం అంటే కొంతమంది చాలా భారంగా ఫీలవుతారు. మీరు అలా భావిస్తే, మీ భాగస్వామికి మరియు మీ ఆరోగ్యానికి చాలా సమస్యలు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రీగా కలయికలో పాల్గొంటే మీపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఒకవేళ మీ భాగస్వామికి శృంగారం పట్ల ఆసక్తి తక్కువగా ఉంటే, వారితో నవ్వుతూ మాట్లాడండి. వారికి దాని ప్రయోజనాల గురించి వివరించండి. ఇందుకోసం మీరు ఇతర మార్గాలను కూడా అవలంభించవచ్చు. ముఖ్యంగా వారిని మీరు శృంగార విందు కోసం తీసుకెళ్లొచ్చు లేదా ఇద్దరూ కలిసి స్నానం చేయొచ్చు. దీని వల్ల కచ్చితంగా వారి మానసిక స్థితి మారుతుంది.

ఈ ఆహారాలు..

ఈ ఆహారాలు..

శృంగారం జీవితాన్ని రీఛార్జ్ చేయడంలో ఈ ఆహారాలు అద్భుతంగా పని చేస్తాయి. అందులో స్ట్రాబెర్రీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రెడ్ కలర్ ఫ్రూట్ ఫోర్ ప్లే యొక్క ఆనందాన్ని కూడా ఇస్తుంది. అలాగే అవొకాడో కూడా మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోకి ఫోలిక్ ఆమ్లం మీ బాడీలో ప్రోటీన్ స్థాయిని పెంచుతుంది. దీని వల్ల మీలో శక్తి స్థాయి పెరుగుతుంది. అంతేకాదు ఇది మీ గుండెకు కూడా మేలు చేస్తుంది. దీని వల్ల మీ లైంగిక జీవితం మెరుగుపడుతుంది.

స్మోకింగ్ ను మానేయండి..

స్మోకింగ్ ను మానేయండి..

మీరు హెల్దీ సెక్స్ లైఫ్ కావాలనుకుంటే, మీరు స్మోకింగ్ ను పక్కనపెట్టాల్సిందే. ఎందుకంటే సిగరెట్లలో ఉండే నికోటిన్ సిరలు మీ లంగ్స్(ఊపిరితిత్తులు) దెబ్బతినడానికి కారణమవుతాయి. ఇవి రక్తనాళాలను కూడా దెబ్బతీస్తాయి. అంతేకాదు ఇవి లైంగిక అవయవాలపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇవి మగవారి జననేంద్రియాల రక్తప్రవాహానికి కూడా ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ధూమపానం వీర్యం ఉత్పత్తిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది.

సరైన సమయంలో..

సరైన సమయంలో..

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట.. ఆ వయసులోనే జరగాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అలాగే వయసు ముగిశాక లేటు వయసులో కోరికలు తీర్చుకోవాలంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. అందుకే సరైన సమయంలో శృంగారంలో పాల్గొంటే మంచి ప్రయోజనాలుంటాయి. దీని వల్ల మీకు నిరాశ, ఒత్తిడి అనే సమస్యలే ఉండవు. దీన్ని నివారించడానికి ఏకైక మార్గమేమిటంటే.. మీ భాగస్వామికి మీరు నచ్చజెప్పడం మరియు ఇంకా మీరు శృంగారం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారని చెప్పడం. ఉదాహరణకు వారు కిచెన్లో బిజీగా ఉన్నప్పుడు వారిని ప్రేమతో సహాయం చేయడం మరియు శృంగార సందశాలను పంపడం వంటివి చేయొచ్చు.

భాగస్వామితో మాట్లాడండి..

భాగస్వామితో మాట్లాడండి..

సాధారణంగా మగవారు శృంగారం విషయంలో కొన్ని విషయాలను చాలా లైట్ తీసుకుంటారు. అదే సమయంలో సెక్స్ సమస్యల గురించి ఏదైనా భయం ఉన్నా, ఏదైనా చెడు అనుభవం ఉంటే వాటిని బయటకు చెప్పుకోలేరు. అయితే మీరు ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఇలాంటివి మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. మీ కోరికల గురించి మీ భాగస్వామితో మాట్లాడండి.

సెక్స్ థెరపీ..

సెక్స్ థెరపీ..

మీ మెరుగైన లైంగిక జీవితానికి మీరు సెక్స్ థెరపీ కూడా సమర్థవంతమైన నివారణ అని గుర్తించొచ్చు. సెక్స్ థెరపిస్టు వద్దకు వెళ్లే ముందు, శృంగారం గురించి మీ భాగస్వామి నుండి మీకు ఏమి కావాలో.. మరియు మీకు ఏమి అవసరమో.. అనే విషయాలను మీరే ఆలోచించండి. ఈ చికిత్స సమయంలో మీరు భయం, మానసిక స్థితి, ప్రవర్తన మార్పులు వంటి సమస్యలను అధిగమించొచ్చు. దీని వల్ల మీరు మీ లైంగిక జీవితాన్ని మంచి మార్గంలో ఆనందించవచ్చు.

ఫోర్ ప్లేని మరచిపోవద్దు..

ఫోర్ ప్లేని మరచిపోవద్దు..

శృంగారం విషయంలో మీరు ఫోర్ ప్లేని విస్మరించడం అనేది అతి పెద్ద తప్పు. మీరు ఆ కార్యం గురించి చాలా ఉత్సాహంగా మరియు ఆసక్తిగా ఉన్నప్పటికీ నేరుగా కలయికలో పాల్గొనకూడదు. మీరిద్దరూ ముందుగా ఫోర్ ప్లేలో పాల్గొనాలి. లైంగిక సంపర్కానికి ముందు మీరిద్దరూ పూర్తిగా ఉత్సాహంగా మారేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. లేకపోతే మీ సెక్స్ లైఫ్ ఆనందానికి బదులుగా బాధాకరంగా మారుతుంది. ఇది మీకు చెడు అనుభవాన్ని మిగులుస్తుంది.

లేటు వయసులోనూ..

లేటు వయసులోనూ..

మీరు లేటు వయసులో శృంగారం చేయాలనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే వయసు పెరిగేకొద్దీ బాడీలో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ లేకపోవడం వల్ల కలయికలో పాల్గొనేందుకు ఆసక్తి చూపరు. ఇది వయసు పెరిగిన వారిలో చాలా సాధారణ సమస్య. ఇందుకోసం మీరు ఎక్కువగా మందులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మీరు వైద్యుడిని సంప్రదిస్తే, వారే మంచి సలహాలు ఇస్తారు. లేదా హస్త ప్రయోగం, మసాజ్, ముద్దు పెట్టుకోవడం, మరియు మీ భాగస్వామితో ప్రేమపూర్వక చర్యలతో మీ లైంగిక జీవితాన్ని ఆనందంగా గడపొచ్చు.

ఒత్తిడిని అధిగమించడానికి..

ఒత్తిడిని అధిగమించడానికి..

మీరు మీ లైంగిక జీవితాన్ని మెరుగుపరచడం ద్వారా నిరాశ నుండి బయటపడొచ్చు. ఇందుకోసం మీరు ముందుగా ఒక ప్రణాళికను రూపొందించండి. దీని వల్ల మీరు ఇబ్బందులను అధిగమించొచ్చు. ముందుగా మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి. తను కలయికకు సిద్ధంగా లేకుంటే, మీరు ముందుగా మీ పార్ట్ నర్ ను కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం లేదా ప్రేమించడం ద్వారా మీ దగ్గరికి తీసుకురావచ్చు. ఇది మీ జీవితంలో తిరిగి ఉత్సాహాన్ని తెస్తుంది.

English summary

Tips To Maintain Your Sexual Health in Telugu

Take our relationship advice and read on to know about the top 11 tips to maintain your sexual health and have a healthy sex life.
Story first published: Thursday, November 26, 2020, 13:03 [IST]