H1N1 Influenza:అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్: ముక్క, గొంతు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే ఏమి, ఎలా వస్తుంది, నివారణ

అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్: ముక్క, గొంతు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అంటే ఏమి, ఎలా వస్తుంది, నివారణ

ప్రస్తుతకాంలో ప్రజల్లో వివిధ రకాలుగు వ్యాధులు పెరిగిపోతున్నాయి. కరోనా తర్వాత ఎక్కువగా బాధిస్తున్న సమస్యల్లో బాడీపెయిన్స్, ముఖ్యంగా చేతులు, భుజాలు నొప్పిని అనుభవిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే క‌రోనా త‌ర్వాత గొంతునొప్పి, గొంతు మంట, గొంతు వాపు, వంటి గొంతు ఇన్‌ఫెక్షన్లు బాగా పెరిగాయనే చెప్పాలి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అనేది మొత్తం శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ఇది శరీరంలో ఆక్సిజన్ సప్లై చేసే శ్వాసక్రియకు బాధ్యత వహిస్తుంది. శరీరం ఇన్ఫెక్షన్లుకు గురైనప్పుడు ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు ప్రభావితం అవుతాయి.

Upper Respiratory Infection: Symptoms and Treatment according to general physician in telugu

ఈ శ్వాస కోశ ఇన్ఫెక్షన్లో రెండు రకాలున్నాయి. అవి ఒకటి అప్పర్ రెస్పిరేటర్ మరియు లోయర్ రెస్పరేటర్ ఇన్ఫెక్షన్ అని రెండు వర్గాలుగా విభజించారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు, ముక్కు కారటం, గొంతు నొప్పి మరియు దగ్గు. గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ అంటే ఏమి? మరి ఇది ఎలా వస్తుంది? ఎలా దీన్ని నివారించాలో తెలుసుకుందాం..

గొంతు ఇన్ఫెక్షన్ అనగా ఏమిటి?

గొంతు ఇన్ఫెక్షన్ అనగా ఏమిటి?

దీనిని గొంతు ఇన్ఫెక్షన్ అనేకంటే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ అని పిలిస్తే మనకు బాగా అర్థం అవుతుంది. మనం పీల్చే గాలి ముక్కు నుండి గొంతు ద్వారా శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ముక్కు నుండి ఎగువ శ్వాసనాళానికి గాలిని ప్రసరింపచేస్తే అది ఎగువ శ్వాసనాళం అంటారు.దీని లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే దానిని అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటారు. వాటిని పిలిచే పేర్లు అవి ప్రభావితం చేసే ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

గొంతు ఇన్ఫెక్షన్ల రకాలు

గొంతు ఇన్ఫెక్షన్ల రకాలు

ఈ ఇన్ఫెక్షన్ ముక్కులో వస్తే రైనోవైరస్ ఇన్ఫెక్షన్ అంటారు. ముక్కు దగ్గర ఉన్న శ్వాసనాళాలకు(సైనస్)కు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దాన్ని రైనోసైనసైటిస్ అంటారు. కేవలం దిగువ భాగానికి అంటే నోటిలోపలి వెల్ల వెళ్లి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. దీనినే టాన్సిలిటిస్ అంటారు.

దీని తర్వాత గాలి మన వాయిస్ బాక్స్ స్వరపేటిక లేదా వాయిస్ బాక్స్ ప్రాంతానికి వెళుతుంది. ఇది సోకినప్పుడు గొంతు బొంగురుపోతుంది. శ్వాసనాళం గొంతు నుండి ఊపిరితిత్తుల వరకు గాలిని ప్రవేశించడానికి అనుమతిస్తుంది. గొంతులో ఉండే స్వరపేటిక, స్వర తంతువులు మనం మాట్లాడేటప్పుడు శబ్దం చేయడానికి సహాయపడతాయి. అందుకే దీన్ని వాయిస్ బాక్స్ అంటారు. ఈ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మనం దానిని లారింగైటిస్ అని పిలుస్తాము. ఫలితంగా, మాట్లాడేటప్పుడు కూడా ధ్వని బయటకు రాదు. అక్కడి నుంచి కింది భాగానికి వస్తే ట్రాకిటిస్ అంటారు. ఈ టిస్ ఒక తాపజనక పరిస్థితి. ఇది వాపు వల్ల వచ్చే పరిస్థితి.

గొంతు ఇన్ఫెక్షన్‌కు కారణాలు ఏమి?

గొంతు ఇన్ఫెక్షన్‌కు కారణాలు ఏమి?

సాధారణంగా అప్పుడప్పుడు గొంతు ఇన్ఫెక్షన్ కు గురి అవుతుంటుంది. దీనికి వివిధ రకాలు కారణాలున్నప్పటికి , దీనికి అత్యంత సాధారణ కారం వైరల్ ఇన్ఫెక్షన్ . వైరల్ ఇన్ఫెక్షన్స్ లో ఒకటి ఇన్ఫ్లుఎంజా వైరస్. ఇది ఒక అంటువ్యాధిలాంటింది.

అందుకే దీన్ని ఫ్లూ అని కూడా పిలిస్తుంటారు. ఫ్లూ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ వల్ల వస్తుంది. ఇది జ్వరంతో కూడిన ఎగువ శ్వాసకోశ వ్యాప్తి అని పిలుస్తారు. ఈ ఇన్ఫెక్షన్ ముక్కు నుండి శ్వాసనాళం వరకు ఉంటుంది. లేదా కింద వరకు ఉండవచ్చు.

 గొంతు ఇన్‌ఫెక్షన్లకు ఇన్‌ఫ్లుఎంజా ఎ వైరస్‌లు కారణమవుతాయి

గొంతు ఇన్‌ఫెక్షన్లకు ఇన్‌ఫ్లుఎంజా ఎ వైరస్‌లు కారణమవుతాయి

గొంతు ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే ఇన్‌ఫ్లుఎంజా ఎ వైరస్‌లలో వివిధ రకాలు ఉన్నాయి.

ఈ ఇన్‌ఫ్లుఎంజా A వైరస్‌లలో H1N1 ఫ్లూ అనే వైరస్ ఉంది. ఇది అత్యంత వేరియంట్ వైరస్‌ని కలిగి ఉంది. అది H3 N2 వలే ఉంటుంది. H1N1 సర్వసాధారణమైనది. దీనినే స్వైన్ ఫ్లూ అంటాం.

ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా, ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది.

గొంతు ఇన్ఫెక్షన్ అంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్

గొంతు ఇన్ఫెక్షన్ అంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్

బ్యాక్టీరియాల వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ రావచ్చు. అయితే ఇది తక్కువగానే ఉంటుంది, దీని నివారించుకోవడానికి యాంటీబయోటిక్స్ తీసుకుంటే సరిపోతుంది.

అంటే, స్ట్రెప్టోకోకస్ వైరస్ సోకితే, గొంతు తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇది న్యుమోనియాకు కూడా దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.

గొంతు ఇన్ఫెక్షన్ అంటు వ్యాధా?

గొంతు ఇన్ఫెక్షన్ అంటు వ్యాధా?

గొంతు ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా అంటువ్యాదే అంటున్నారు వైద్య నిపుణులు. ఎలా అంటే ప్రజలు ఎక్కువగా తిరిగే లేదా రద్దీగా ఉండే ప్రదేశాలలో తమ్ములు, దగ్గు మరియు నోటి ద్వారా విడుదల అయ్యే లాలాజల తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఇంట్లో ఏ ఒక్కరి ఉన్నా ఇంట్లో మిగతా వారు కూడా ప్రభావితం అవుతారు.

గొంతు ఇన్ఫెక్షన్ ఎగువ శ్వాసనాళాని మాత్రమే సోకితే , అది ఒక వారంలో క్లియర్ అయిపోతుంది. కొందరికి రెండు వారాల వరకు పొడి దగ్గు ఉంటుంది.

గొంతు ఇన్ఫెక్షన్ అనేది సాధారణ ఇన్ఫెక్షన్ అయినా లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ అయినా స్వీయ-నిర్ధారణ చేసుకోకూడదు. కానీ గొంతు ఇన్ఫెక్షన్ మొదటి రోజు నుంచి మొదలై తర్వాతి రోజుల్లో మరింతగా వ్యాపించి తర్వాతి రోజుల్లో క్రమంగా తగ్గుతుంది. కానీ ఇప్పుడు వస్తున్న గొంతు ఇన్ఫెక్షన్లు చాలా భయంకరంగా ఉన్నాయి. త్వరగా తగ్గకపోగా ఇతరులకు వ్యాపిస్తున్నాయి..

 గొంతు ఇన్ఫెక్షన్ కోసం వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

గొంతు ఇన్ఫెక్షన్ కోసం వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

గొంతును మింగడంలో ఇబ్బంది మరియు మాట్లాడేటప్పుడు, మీ మాటలు అస్పష్టంగా ఉంటే, ఈ లక్షణాలున్నప్పుడు వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి. ఇది స్ట్రెప్టోకోకస్ లేదా తీవ్రమైన H1N1 యొక్క లక్షణం కావచ్చు.

గొంతు నొప్పి మరియు ఇన్ఫెక్షన్ వల్ల మాట్లాడలేకపోతుంటే ఖచ్ఛితంగా యాంటీబయాటిక్స్ అవసరం. యాంటాబయోటిక్స్ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. అంటే, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు, వారికి ఖచ్చితంగా H1N1 పరీక్ష అవసరం.

సకాలంలో చికిత్స తీసుకోకపోతే ఇవి కరోనా వంటి శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. H1N1 ఊపిరితిత్తులను ప్రభావితం చేయదు. న్యుమోనియాకు కారణం కాదు. కానీ దాని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణ ఉందా?

గొంతు ఇన్ఫెక్షన్ కు నివారణ ఉందా?

  1. ఎలాంటి గొంతు నొప్పి, వాపు, గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, సొంత వైద్యం చేయవద్దు. అలా చేస్తే ఇన్ఫెక్షన్ మరింత తీవ్రం అవుతుంది. నొప్పి ఎక్కువగా ఉంటే తక్షణ ఉపశమనం కోసం పారాసెటమాల్ తీసుకోవచ్చు.
  2. ఉప్పు నీటితో పుక్కిలించండి.
  3. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవచ్చు. ఎలర్జీ వస్తే పండ్లకు దూరంగా ఉండాలి కానీ ఇతరులు పండ్లను తీసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
  4. గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నవారు హెచ్1ఎన్1 పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అయితే సీరియస్‌గా ఉన్నప్పుడు.. ఇంట్లోని ప్రతి ఒక్కరికీ ఈ వ్యాధి సోకినప్పుడు, డాక్టర్ తో సంప్రదించి ఈ హెచ్1ఎన్1 పరీక్ష చేయించుకోవాలి.
  5. ఇది స్ట్రెప్టోకోకస్ లేదా H1N1 ఇన్ఫెక్షన్ అయితే, యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా అవసరం. ఇతర సాధారణ అంటువ్యాధులు త్వరగా క్లియర్ కావచ్చు.

Desktop Bottom Promotion