Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Happy Hormone: సంతోషంగా ఉండాలా..? సరైన ఆహారం, వ్యాయామంతో హ్యాపీ హార్మోన్ పెంచేసుకోండి
సరైన ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా ఈ హ్యాపీ హార్మోన్ ను పెంచుకోవచ్చు. సెరోటోనిన్ స్థాయిలను సహజ సిద్ధంగా ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సెరోటోనిన్ మెదడు రసాయనం. మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోన్ లోపం వల్ల ఒత్తిడి, నిరాశ నిస్పృహలకు కారణమవుతుంది. సెరోటోనిన్ హార్మోన్ మంచి స్థాయిల్లో ఉంటే మానసిక స్థితి మెరుగ్గా ఉండి ఉల్లాసంగా అనిపిస్తుంది. అందుకే దీనిని హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ మానసిక స్థితి, నిద్ర, ఆకలి, జ్ఞాపకశక్తికి సంబంధించిన విధులను నియంత్రిస్తుంది.

సెరోటోనిన్ స్థాయిలు సరిగ్గా ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది. సెరోటినిన్ లెవల్స్ తగ్గిపోతే ఒత్తిడి, ఆందోళన కలుగుతుంది. అయితే సరైన ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా ఈ హ్యాపీ హార్మోన్ ను పెంచుకోవచ్చు. సెరోటోనిన్ స్థాయిలను సహజ సిద్ధంగా ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆహారానిది కీలక పాత్ర
ఆహారాం శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఆహారం నుండి నేరుగా సెరోటోనిన్ పొందలేరు. కానీ అధిక ప్రోటీన్ ఆహారాల్లో కనిపించే ట్రిఫ్టోఫాన్ పొందవచ్చు. ట్రిఫ్టోఫాన్ అనేది మెదడులో సెరోటోనిన్ ను ఉత్పత్తి చేసే ఆమ్లం. గుడ్లు, చీజ్, సాల్మన్, గింజలు మరియు ఇతర ఆహార పదార్థాల ద్వారా ఈ ట్రిఫ్టోఫాన్ అందుతుంది.

2. క్రమం తప్పని వ్యాయామం
వ్యాయామం తర్వాత మనసు హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇది చాలా మంది అనుభవించే ఉంటారు. వ్యాయామం చేయడం ద్వారా సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. మంచి వ్యాయామం ట్రిఫ్టోఫాన్ ను రక్తంలోకి విడుదల చేస్తుంది. నడక నుండి యోగా వరకు అధిక - తీవ్రతతో కూడిన వ్యాయామం వరకు, ప్రతి రోజూ వీటిలో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి.

3. సూర్యరశ్మి
చాలా వాటికి సూర్యరశ్మి అవసరం. రోజూ ఎండలో కొద్ది సేపు గడపడం వల్ల సెరోటోనిన్ స్థాయిలు మెరుగుపడతాయి. ప్రతి రోజూ కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు ఆరు బయట సూర్య రశ్మి పడే చోట గడపడం వల్ల సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయని పలు పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా ఉదయపు ఎండలో ఉండటం వల్ల శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది.

4. ఒత్తిడి నిర్వహణ
ఒత్తిడి అనేది మన మానసిక స్థితిని మార్చే మరొక అంశం. సెరోటోనిన్ బ్యాలెన్స్ చేయడానికి ఒత్తిడి నిర్వహణ ప్రభావవంతంగా ఉంటుంది. శ్వాస, ధ్యానం వంటి వ్యాయామాల వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. దాంతో పాటు, మంచి నిద్ర, ఆలోచనలను రాసుకోవడం, లాంటివి చేయడం వల్ల ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది.

5. ప్రియమైన వారితో గడపడం
మనం ఇష్టపడే వారితో సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. దీని వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక అఁశాలకు ఇది అవసరం. పెంపుడు జంతువులతో గడిపినా మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది సెరోటోనిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

6. మసాజ్ థెరపీ
సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి మసాజ్ లు మరొక గొప్ప మార్గం. మసాజ్ థెరపీ కార్టిసాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడికి గురైనప్పుడు శరీరం ఉత్పత్తి చేసే హార్మోన్. అంతే కాకుండా, మసాజ్ లు కండరాలకు ఉపశమనం కలిగించి రిలాక్స్ చేయడంలో కూడా సహాయపడతాయి.
మెదడు కాండం మధ్యలో ఉన్న ప్రాంతం సెరోటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది.
సెరోటోనిన్ స్థాయిలు ఎక్కువగా ఉంటే తేలికపాటి వణుకు, అతిసారం, మజిల్ రిజిడిటీ, జ్వరం, మూర్ఛ రావొచ్చు.
సెరోటోనిన్‌ను హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు.



Click it and Unblock the Notifications