Latest Updates
-
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
World Obesity Day 2023: అతి ఊబకాయం అంటే ఏంటి? బెరియాట్రిక్ సర్జరీ ఎవరికైనా చేస్తారా?
ఉస్మానియా ఆస్పత్రిలో ఒక వ్యక్తికి 2 నెలల్లో 70 కిలోలు తగ్గించారు వైద్యులు. అసలు అతి ఊబకాయం అంటే ఏంటి? ఎప్పుడు బెరియాట్రిక్ సర్జరీ చేసి వెయిట్ తగ్గిస్తారు? లైపోసక్షన్‌కు, బెరియాట్రిక్ సర్జరీకి తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుం
ఓ వ్యక్తి కేవలం 2 నెలల్లోనే 70 కిలోల బరువు తగ్గాడు. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు చేసిన చికిత్సలో ఆ వ్యక్తి 240 కిలోల నుండి 170 కిలోలకు వచ్చాడు. అయితే ఈ వెయిట్ లాస్.. డైట్ పాటించడం వల్లో, వ్యాయామం వల్లో తగ్గింది కాదు. అతి ఊబకాయం ఉన్న వ్యక్తులకు బెరియాట్రిక్ సర్జరీ చేసి వెయిట్ తగ్గిస్తారు.

అసలు అతి ఊబకాయం అంటే ఏంటి? ఎప్పుడు బెరియాట్రిక్ సర్జరీ చేసి వెయిట్ తగ్గిస్తారు? లైపోసక్షన్‌కు, బెరియాట్రిక్ సర్జరీకి తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అతి ఊబకాయం అంటే ఏంటి?
బాడీ మాస్ ఇండెక్స్(BMI) 40 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని అతి ఊబకాయంగా పరిగణిస్తారు వైద్యులు బీఎంఐ అనేది ఎత్తు, శరీర బరువు ఆధారం కొలుస్తారు. BMI 30 లేదా అంతకంటే ఎక్కువ ఉండే ఊబకాయం అంటారు. BMI 25 - 29.9 వరకు ఉంటే అధిక బరువుగా పరిగణిస్తారు. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కండర ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా గర్భం ధరించినప్పుడు, కొన్ని వైద్య పరిస్థితుల వేళ BMIకి పరిమితులు ఉంటాయి.
విపరీతమైన స్థూలకాయం ఉన్న వ్యక్తుల ఒంట్లో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, స్లీప్ అప్నియా, గుండె జబ్బులు, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అతి ఊబకాయంతో బాధపడే వ్యక్తులకు వైద్యులు బెరియాట్రిక్ సర్జరీ సిఫార్సు చేస్తుంటారు.

బెరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి?
బెరియాట్రిక్ సర్జరీని వెయిట్ లాస్ సర్జరీ అని కూడా పిలుస్తుంటారు. ఇందులో కడుపు పరిమాణాన్ని తగ్గించడం, జీర్ణవ్యవస్థను తిరిగి మార్చడం ద్వారా పెద్ద మొత్తంలో ఆహారాన్ని తీసుకోకుండా నిరోధిస్తారు. దీని వల్ల కొంత తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాని ద్వారా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
బెరియాట్రిక్ సర్జరీలో రకాలు:
* గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ
ఈ సర్జరీలో పొట్టను రెండు భాగాలుగా చేసి చిన్న పేగును రెండింటికీ అనుసంధానిస్తారు.
* స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ
ఈ సర్జరీలో పొట్టలో కొంత భాగాన్ని తీసివేసి అరటిపండు ఆకారంలో ఉండేలా పొట్టను తయారు చేస్తారు.
* అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండింగ్
కడుపు పరిమాణాన్ని తగ్గించడానికి కడుపు ఎగువ భాగం చుట్టూ బ్యాండ్‌ను ఉంచుతారు.
* డ్యూడెనల్ స్విచ్‌తో బిలియోప్యాంక్రియాటిక్ డైవర్షన్
ఈ సర్జరీలో కడుపులో కొంత భాగాన్ని తొలగిస్తారు. శరీరం శోషించబడే కేలరీల పరిమాణాన్ని తగ్గించడానికి చిన్న ప్రేగులను మారుస్తారు.
బెరియాట్రిక్ సర్జరీ అనుకున్నంత సులభమైనది కాదు. సంభావ్య ప్రమాదాలు, సంక్లిష్టతలో ఎన్నో ఉంటాయి. ఇది విజయవంతం కావడానికి ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మీకు సరైనదో కాదో డాక్టర్లే చెబుతారు.

బెరియాట్రిక్ సర్జరీ ఎప్పుడు పరిగణించాలి?
బెరియాట్రిక్ సర్జరీ సాధారణంగా BMI 40 కంటే ఎక్కువ ఉన్నవారికి, డయాబెటిస్, స్లీప్ అప్నియా సహా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా వారికి, వ్యాయామం చేసినా, డైట్ పాటించినా బరువు తగ్గనివారికి మాత్రమే బెరియాట్రిక్ సర్జరీ సూచిస్తారు.

బెరియాట్రిక్ సర్జరీ, లైపోసక్షన్ రెండింట్లో ఏది బెటర్?
బెరియాట్రిక్ సర్జరీలో కడుపు పరిమాణాన్ని తగ్గించడం లేదా జీర్ణవ్యవస్థను మార్చి కేలరీలు తగ్గేలా చేస్తారు. ఇది క్లిష్టమైన సర్జరీ. సంభావ్య ప్రమాదాలు ఎక్కువే. బెరియాట్రిక్ సర్జరీ ద్వారా గణనీయంగా బరువు తగ్గుతారు. ఊబకాయం పోయి ఆరోగ్యకరమైన బరువులోకి చాలా తక్కువ కాలంలో వచ్చేస్తారు. అయితే ఈ సర్జరీ తర్వాత కూడా డైట్ పాటించడం, వ్యాయామాలు చేయడం, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి.
లైపోసక్షన్ లో ఉదయం, తుంటి, తొడలు, చేతులు వంటి శరీరంలోని నిర్దిష్ట ప్రాంతాల నుండి కొవ్వును తీసేసే కాస్మెటిక్ ప్రక్రియ. లైపోసక్షన్ అనేది బరువు తగ్గించే ప్రక్రియ కాదు. ఊబకాయంతో బాధపడే వారికి వైద్యులు లైపోసక్షన్ ను సిఫార్సు చేయరు. ఉండాల్సిన బరువు కంటే కొద్దిగా ఎక్కువగా ఉండే వారికి మాత్రమే లైపోసక్షన్ సూచిస్తారు. డైట్ పాటించినా, వ్యాయామం చేసినా కొన్ని భాగాల్లో కొవ్వు ఏమాత్రం కరగకపోతే అప్పుడే లైపోసక్షన్ చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications











