Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సౌండ్ బాత్ అంటే ఏంటి? దాంతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే
సౌండ్ బాత్ అనేది సంగీతంతో చేసే చికిత్స. ఈ చికిత్సలో వివిధ రకాల సంగీతాలను ఉపయోగించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తారు. సౌండ్ బాత్‌లు ధ్యానం చేయడానికి అద్భుతమైన మార్గం.
మనం సంగీతం ఎందుకు వింటాం. సంగీతం భావోద్వేగాలను అనుభూతి చెందేలా చేస్తుంది. ఓదారుస్తుంది, ఉత్తేజపరుస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. సంగీతంతో ఉన్న ప్రయోజనాలు శాస్త్రీయంగా కూడా నిరూపితమయ్యాయి. సంగీతం ప్రకృతి నుండే పుట్టింది. ఒక పద్ధతి ప్రకారం వచ్చే శబ్ధాలను సంగీతం అనొచ్చు.

సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో కానీ సంగీతానికి కరగని మనసు అంటూ ఉండదు. కొందరికి శ్రావ్యమైన సంగీతం అంటే ఇష్టం ఉంటుంది, మరికొందరికీ హోరెత్తించే ఫోక్ సాంగ్స్ అంటే మక్కువ, ఇంకొందరికి భావాలను తట్టిలేపే సంగీతాన్ని ఇష్టపడతారు. సంగీతంలో వివిధ రకాలు ఉన్నప్పటికీ సంగీతం యొక్క లక్ష్యం మాత్రం మనసును ఆహ్లాదపరచడమే.

సౌండ్ బాత్ అంటే ఏంటి?:
సౌండ్ బాత్ అనేది సంగీతంతో చేసే చికిత్స. ఈ చికిత్సలో వివిధ రకాల సంగీతాలను ఉపయోగించి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తారు. సౌండ్ బాత్‌లు ధ్యానం చేయడానికి అద్భుతమైన మార్గం. వివిధ పౌనఃపున్యాల వద్ద పునరావృతమయ్యే నోట్స్ ఉపయోగించి ఆలోచనల నుండి దృష్టిని దూరం చేయడంలో సౌండ్ బాత్ సహాయపడుతుంది.

(image: Healthline)
సౌండ్ బాత్ చరిత్ర:
సౌండ్ బాత్‌కు ఘనమైన చరిత్ర ఉంది. 40వేల ఏళ్ల నాటి నుండి సౌండ్ బాత్ అనే కాన్సెప్ట్ ఉంది. జీర్ణక్రియను, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి గ్రీకులు వేణువులు, లైర్‌లను వాడినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. టిబెటన్లు ధ్యాన ప్రయోజనాల కతోసం 2వేల సంవత్సరాలకు పైగానే సింగింగ్ బౌల్స్ వాడుతున్నారు. ఆస్ట్రేలియన్ ఆదిమ తెగలు డిడ్జెరిడూను జబ్బుపడిన వారిని నయం చేసేందుకు వాడుతున్నారు.
సౌండ్ బాత్ ప్రయోజనాలు:
ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది:
సౌండ్ బాత్ సమయంలో ఉపయోగించే నిర్దిష్ట సాధనాల ద్వారా సృష్టించబడిన శబ్దాలు మెదడు తరంగాలను సక్రియం చేస్తాయి. సౌలభ్యం, ఉపశమనం యొక్క భావాన్ని ప్రోత్సహిస్తాయి. కొద్దిగా భిన్నమైన పౌనఃపున్యాల వద్ద రెండు టోన్లు కలిపి ప్లే చేసినప్పుడు అది ఆందోళన స్థాయిలు, మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాల్లో తేలింది.
నాడీ వ్యవస్థతతో కలుపుతుంది:
సౌండ్ బాత్‌లలో సింగింగ్ బౌల్స్ ఉపయోగిం కొన్ని శారీరక, మానసిక ప్రభావాలను మెరుగుపరచడంలో సహాయపడతుంది. తద్వారా మానవ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు స్థాయిలు, హృదయ స్పందన రేటు, శ్వాసకోశ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో, మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది:
సౌండ్ హీలింగ్ మనస్సును, మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. సౌండ్ బాత్ శరీరానికి, మనసుకు విశ్రాంతి కల్పిస్తుంది. మంచి నిద్రను అందిస్తుంది.
దృష్టిని మెరుగుపరుస్తుంది:
సౌండ్ బాత్ యొక్క మరో ప్రయోజనం దృష్టిని కేంద్రీకరించడంలో సహాయపడటం. మనస్సును, శరీరాన్ని కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. సౌండ్ బాత్‌లో చురుకైన శ్వాసక్రియ, వినడం ఉంటుంది కాబట్టి, సామూహిక స్వస్థత ప్రకంపనలు రిలాక్స్‌గా చేస్తాయి. తద్వారా ఏకాగ్రతతో ఉంటారు.

సౌండ్ బాత్‌లో ఏ పరికరాలు ఉపయోగిస్తారు:
* సింగింగ్ బౌల్స్
* చైమ్స్
* డిడ్జెరిడూ
* హార్ప్
* గాంగ్స్
* క్రిస్టల్ బౌల్స్
* వాయిస్
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications