మహిళల ఆరోగ్యానికి ప్రమాధకరంగా పొంచి ఉన్న ఈ సమస్యల గురించి తప్పక తెలుసుకోండి..ప్రాణాలను కాపాడుకోండి..

మహిళల ఆరోగ్యానికి ప్రమాధకరంగా పొంచి ఉన్న ఈ సమస్యల గురించి తప్పక తెలుసుకోండి..ప్రాణాలను కాపాడుకోండి..

సమాజంలో స్త్రీ మరియు పురుషులు జీవితం చాలా ముఖ్యం. జీవనశైలిలో ఎన్నో మార్పులు, మానవ శరీరాలను ప్రభావితం చూపుతాయి. స్త్రీ మరియు పురుషులు జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉన్నప్పటికీ, మగవారి కంటే ఆడవాళ్ళను ఎక్కువగా ప్రభావితం చేస్తే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. స్త్రీ మరియు పురుషులతో పోల్చితే, శారీరకంగా మరియు వ్యాధినిరోధక శక్తిలోనూ వ్యత్యాసం ఉన్నా, మహిళ ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకూ మహిళలు కానీ లేదా అమ్మాయిలకు కానీ తెలియదు. ఇలా చేయడం వల్ల మహిళల్లో వారికి తెలియకుండానే కొన్ని రకాల వ్యాధులు ప్రతి వయస్సులో వారిని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. ఇలా సమయంలో మహిళలు సైరన సమయంలో వారి శరీరం మరియు వారికి పొంచి ఉన్న సంబంధిత వ్యాధుల గురించి ముందుగానే పసిగట్టినట్లేతే, వారు తమను తాము రక్షించుకోగలరు. అలా ముందుగా గుర్తించగల వ్యాధులు గురించి ఈ కథనంలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

 మహిళల్లో కనిపించే సాధారణ వ్యాధులు

మహిళల్లో కనిపించే సాధారణ వ్యాధులు

బ్రెస్ట్ క్యాన్సర్: ప్రాణాంతకమైన వివిధ రకాల క్యాన్సర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి. మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌ను సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకంటే ఇది చివర స్టేజ్ వరకూ తెలియకుండా ఉంటుంది. దీని కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మహిళలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ కారణం చేతనే, ప్రతి స్త్రీ 25 సంవత్సరాలు దాటిన తర్వాత గైనకాలజిస్ట్ ద్వారా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. బ్రెస్ట్ హెల్త్ గురించి తెలుసుకోవడానికి, ముఖ్యంగా ఎక్స్-రే మామోగ్రఫీ, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్, MRI, CT మరియు PET స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షల ద్వారా ఈ సమాచారాన్ని పొందవచ్చు.

హార్ట్ అటాక్:

హార్ట్ అటాక్:

పురుషులతో పోల్చితే గుండె జబ్బులు స్త్రీలలో ఎక్కువ. మహిళల్లో ఎక్కువగా మరణానికి కారణా గుండె జబ్బులు. గుండె జబ్బు సాదారణ లక్షణాలు తరచూ ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడవలేకపోవడం, చేతుల్లో బలహీనత. అంతే కాదు కొన్ని సమయాల్లో మహిళలు వికారం లేదా వాంతులు అనుభవించడం కూడా గుండె జుబ్బు యొక్క లక్షణం కావచ్చు. స్త్రీలు ఈ లక్షణాలను సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటారు. NM ప్రకారం, మహిళలకు రుతుక్రమం(పీరియడ్స్) ఉన్నంత కాలం, వారి గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉంటుంది. అయితే మెనోపాజ్ తర్వాత, దీని ప్రమాదం పెరుగుతుంది. దీనికి కారణం బ్లడ్ ప్రెజర్ లొ మార్పు, కొలెస్ట్రాల్ పెరుగుదల మరియు ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గడం మొదలైనవి.

 UTI (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్):

UTI (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్):

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ప్రతి స్త్రీ తన జీవితకాలంలో ఎదుర్కొనే సమస్య. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి పురుషుల శరీరంతో పోలిస్తే స్త్రీల శరీరంలో ఉండే బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ ద్వారా సులభంగా మూత్రాశయంలోకి చేరుతుంది. దీని వల్ల స్త్రీలలో అధిక మూత్రవిసర్జన, మంట, దురద, నొప్పి, జ్వరం మొదలైన లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.ఈ పరిస్థితిలో, తక్షణ వైద్యుడి చికిత్స అవసరం.

 గర్భాధారణ సమయంలో స్ట్రోక్ రావడం:

గర్భాధారణ సమయంలో స్ట్రోక్ రావడం:

మహిళల్లో మరో ప్రమాధకరమైన ఆరోగ్య సమస్య స్ట్రోక్. గర్భధారణ సమయంలో స్ట్రోక్ రావడం అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు మరియు శరీరంలో రక్తం గడ్డకట్టడం వల్ల స్టోక్ రావడం జరుగుతుంది. ఇది గర్భధారణతో పాటు, సాధారణ మహిళలను కూడా ప్రభావితం చేస్తుంది. నిజానికి మన శరీరంలో ఉండే రక్త నాళాల్లో సిరల్లో రక్తం సక్రమంగా ప్రవహించనప్పుడు లేదా మెదడుకు రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడినప్పుడు స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భధారణ సమయంలో అధిక రక్తం గడ్డకట్టే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.

బోలు ఎముకల వ్యాధి(బోన్ డెన్సిటి):

బోలు ఎముకల వ్యాధి(బోన్ డెన్సిటి):

మహిళల్లో మోనోపాజ్ దశలో ఇబ్బంది పెట్టే మరో ప్రమాధకరమైన వ్యాధి బోన్ డెన్సిటి. దీన్నేబోలు ఎముకల వ్యాధి అంటారు. బోలు ఎముకల వ్యాధి అనేది మీ ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది ఎముకలు పెళుసుగా మారి, పగుళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలకు బోలు ఎముకల వ్యాధికి సంబంధించిన పగుళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీని కోసం, స్త్రీలు రెగ్యులర్ ఆహారంలో కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా చేర్చుకోవాలి మరియు బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. ధూమపానం మరియు అధిక మద్యపానం మానుకోవాలి.

Story first published: Monday, February 6, 2023, 16:25 [IST]
Desktop Bottom Promotion