Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
చలికాలంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు, లక్షణాలు ఏంటో తెలుసా?
చలికాలంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు, లక్షణాలు ఏంటో తెలుసా?
చలికాలంలో ఫ్లూ, జలుబు, దగ్గు మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు ఎలా ఇబ్బంది పెడతాయో, అదే విధంగా శరీరంలోపల కూడా కొన్ని సమస్యల మొదలవుతాయి. ముఖ్యంగా చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గినట్లు, మన శరీరంలో కూడా ఉష్ణోగ్రత తగ్గుతుంది. దాంతో శరీరంలో రక్తం చిక్కబడి గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరం లోపల రక్తం గడ్డకట్టడాన్ని హైపర్ కోగ్యులబిలిటీ అంటారు. మరి చలికాలంలో ఇలా రక్త గడ్డకట్టడానికి కారణాలు ఏమిటి, లక్షణాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

చలికాలంలో జలుబు, దగ్గు, వివిధ రకాల చర్మ సమస్యలతో పాటు శరీరక సమస్యలు ఎదుర్కొంటారు. శరీరకంగా ఉబ్బసం, మోకాలు నొప్పులు, ఆర్థ్రైటిస్ రుమాటిజం వంటి సమస్యలు ప్రభావితం చేస్తుంది. అంతే కాదు పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ. వీటితో పాటు చలికాలంలో రక్తం చిక్కబడే సమస్య. బ్లడ్ థికెన్ ప్రాబ్లెమ్ కూడా ఎక్కువగా బాధిస్తుంది. కాబట్టి చలికాలంలో శరీరంను ఎంత వెచ్చగా ఉంచుకుంటే అంత మంచిది.

శీతాకాంలో రక్తం ఎందుకు చిక్కబడుతుంది:
చలికాలంలో దగ్గు, జలుబు ఎంతగా ఇబ్బంది పెడుతుందో , శరీరంలోపల రక్తం కూడా చిక్కబడి గడ్డ కట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రక్తం గట్టిపడే ఈ సమస్యను హైపర్‌కోగ్యులబిలిటీ అంటారు.
చలికాలంలో ఈ సమస్య వచ్చినప్పుడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం మొదలవుతుంది. అలాగే రక్త హీనత వల్ల కణజాలం దెబ్బతింటుంది. కాబట్టి, శీతాకాలంలో ఆరోగ్య సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ చూపాలి.

రక్తం చిక్కగా మారడానికి ఏ కారకాలు కారణమవుతాయి?
రక్తం చిక్కబడటానికి లేదా గడ్డకట్టడానికి వివిధ కారణాలు ఉన్నాయి. హెల్త్‌లైన్ ప్రకారం, క్యాన్సర్, ప్రోటీన్, విటమిన్ సితో సహా కొన్ని పోషకాలు లోపం మరియు ముఖ్యంగా మద్యపానం, ధూమపానం రక్తం చిక్కబడి, గడ్డకట్టడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
ఇలాంటి పరిస్థితిలో, చలికాంలో మన శరీరాన్ని చల్లిని వాతావరణం, చల్లిని గాలి నుండి రక్షించుకోవడం చాలా అవసరం. శరీరాన్ని వెచ్చగా ఉంచడం వల్ల రక్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఈ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.

చలికాలంలో రక్తం ఎందుకు చిక్కగా ఉంటుంది?
చలికాలంలో రక్తం చిక్కబడటానికి విభిన్న కారణాలున్నాయి. అందులో తక్కువ ఉష్ణోగ్రత మరియు చల్లని వాతావరణం కారణంగా రక్త నాళాలు కుంచించుకుపోతాయి.
అందుకే వింటర్ సీజన్లో ఎక్కువ మంది గుండెపోటుకు గురి అవుతుంటారు. రక్తం చిక్కబడటం వల్ల అధిక రక్తపోటు సమస్యకు దారితీస్తుంది. అలాగే విపరీతమైన చలి కారణంగా రక్తం చిక్కగా మారుతుంది. మరియు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.

శరరంలో రక్తం గట్టిపడటం లేదా చిక్కగా మారడం యొక్క లక్షణాలు ఏమిటి?
చలికాలం శరీరంలో రక్తం గడ్డకట్టడం సహజం. అయితే లక్షణాలు మాత్రం ముందుస్తుగా కనిపించవు. రక్తం గడ్డకట్టిన తర్వాత లక్షణాలు కనబడుతాయి.. ఈ సందర్బంలో ఈ క్రింది లక్షణాలు బహిర్గతం అవుతాయి.
కంటి చూపు మందగించడం, తలనొప్పి, తల తిరగడం, విపరీతమైన చమటలు, అలసట, శ్వాస తీసుకోవంలో ఇబ్బందులు , అధిక రక్తపోటు, చర్మంపై గాయాలు, బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం, చర్మం దురద, గౌట్ సమస్యలు, వంటి లక్షణాలు కనిపిస్తాయి.

రక్తాన్ని చిక్కగా చేసే విటమిన్ ఏది?
సాధారణ రక్తం గడ్డకట్టడానికి విటమిన్ K బాధ్యత వహిస్తుంది. మీకు అధిక రక్తపోటు లేదా రక్తం గడ్డకట్టే సమస్యలు ఉంటే విటమిన్-కె అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. సాధ్యమైనంత వరకూ విటమిన్ కె ఆహారాలకు తగ్గించుకోవాలి. .
ఏయే ఆహారాల్లో విటమిన్ కె ఉంటుందో తెలుసా.. విటమిన్ K సమృద్ధిగా ఉండే ఆహారాలలో కాలే, బచ్చలికూర, బ్రోకలీ, సోయాబీన్స్ మరియు గుమ్మడికాయ ఉన్నాయి.

ఏ ఆహారాలు రక్తం పల్చబడటానికి సహాయపడతాయి?
రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి మీ ఆహారంలో పసుపు, అల్లం, వెల్లుల్లి, కలబంద మరియు విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఇవి రక్తాన్ని పలుచన చేస్తాయి.



Click it and Unblock the Notifications