Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
మైగ్రేన్‌కు ముఖ్య కారణాలివే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
ప్రస్తుతం చాలా మంది ఈ మైగ్రేన్ బారిన పడుతున్నారు. ఇది ఒక తీవ్రమైన తలనొప్పి. కొనుబొమ్మలు, నుదిటిపై వచ్చే ఈ నొప్పిని తట్టుకోవడం చాలా మందికి సాధ్యం కాదు. ఈ సమస్య తలెత్తగానే కొందరికి లైట్ అంటే పడదు, వాంతులు రావడం ప్రారంభమౌతాయ్, కడుపు ఉబ్బరంగా మారుతుంది. ఇది కూవలం తలనొప్పిగానే కనిపించినా దీని బారిన పడిన వారు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అసలు ఈ మైగ్రేన్‌కు కారణాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.
నిద్ర సరిగా లేకపోవడం
రోజుకు కనీసం 7 నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు తీసుకోవడం మాత్రమే కాదు, కంటినిండా నిద్రపోవాలి లేదంటే మైగ్రేన్ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. తక్కువ సమయం మాత్రమే నిద్రపోతే మెదడుపై తీవ్రమైన ప్రభావం వుంటుంది. కొందరు నిద్దరలో పళ్లను కొరుక్కుంటారు, వారిలో కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలున్నాయ్.
సిగరెట్ త్రాగడం
సిగరెట్లు మన ఆరోగ్యాన్ని చాలా రకాలుగా పడుచేస్తుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా వున్నాయ్. సిగరెట్లలో వుండే నికోటిన్ రక్తనాళాల్లోకి ఆక్సిజన్ ఎక్కువగా వెల్లనీవకుండా చేస్తుంది. ఇది కూడా మైగ్రేన్‌కు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
వాతావరణ మార్పు
వాతావరణంలో ఉన్నట్టుండి మార్పు రావడం వల్ల కూడా కొందరిలో మైగ్రేన్‌కు కారణం కావచ్చు. నిద్రలేమి ఉన్నవారికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వస్తే దాన్ని మెదడు తట్టుకోలేక మైగ్రేన్ వస్తుంది.

వాసనలు, పెద్ద శబ్దాలు
పంచేంద్రియాలు ఎక్కువ ప్రెజర్‌కు గురైనప్పుడు కూడా ఈ మైగ్రేన్ వస్తుంది. పెద్ద శబ్దాలు విన్నవారికి, లైట్ ఎక్కువగా కళ్లపై పడ్డంవల్ల, ఘాటు వాసనలు చూడ్డం వల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం వుంటుంది.
ఆహార పదార్ధాలు, పానియాలు
కొందరికి కొన్ని రకాలు ఆహార పదార్ధాలు పడవు. మద్యం తాగినా, చాక్లెట్ తిన్నా, మాంసం తిన్నా కొందరికి మైగ్రేన్ అప్పటికప్పుడు వచ్చేస్తుంది. మైగ్రేన్‌కు ఇది కూడా కారణం కావచ్చు.
పోషకాల లోపం
శరీరంలో మెగ్నీషియం, వైటమిన్ బి12, వైటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లాంటి పోషకాలు లోపం కారనంగా కూడా మైగ్రేన్ బారిన పడే అవకాశం వుంది.
జెనిటిక్
వంశపారంపర్యంగా కూడా ఈ మైగ్రేన్ వచ్చే అవకాశాలుంటాయ్. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ మైగ్రేన్ వ్యాపించే పరిస్థితి వుందని పరిశోధకులు చెబుతున్నారు.
మైగ్రేన్ రాకుండా వుండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
మీకు తలనొప్పి తెప్పించే ఆహారాన్ని తీసుకోవద్దు. భోజనం ఎప్పటికప్పుడు తీసుకుంటూనే వుండాలి. కాఫీల్లో ఉండే కెఫిన్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ప్రతీ రోజూ కొంత వ్యాయామం తప్పని సరిగా చేయాలి. ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. హైడ్రేట్ అవకుండా తగినంత నీరు ఎప్పుటికప్పుడు తీసుకుంటూ వుండండి.
మీలో మైగ్రేన్‌కు కారణమయ్యే పదార్ధాలను గురించాలి. వాతావరణంలో జరిగే మార్పులను గమనిప్తూ వుండాలి. వాతావరణం మీ శరీరానికి పడకపోతే వెంటనే అక్కడి నుంచి మీరు వెళ్లిపోవాలి. శరీరానికి కావలసిన పోషకాలను ఖచ్ఛితంగా తీసుకుంటూ వుండాలి. జంక్ ఫుడ్‌కు ఎంత ఎక్కువగా దూరంగా వుంటే అంత మంచింది. వ్యాయామం శరీరానికకి మాత్రమే కాదు మెదడుకు కూడా వుండాలి. ప్రతి రోజూ కొంత మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల మదడు పనితీరు మెరుగుపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications