Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
Bathukamma Flowers: బతుకమ్మ పూలలో దాగి ఉన్న ఔషద గుణాలు & ఆరోగ్య రహస్యాలు..
Bathukamma Flowers: బతుకమ్మ తెలంగాణాలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సెల్రేషన్ అంతా పువ్వులలోనే దాగి ఉంటుంది. బతుకమ్మను అలంకరించడానికి పువ్వులు వాటి ప్రత్యేక రంగులతో అందాన్నే కాదు, వాటి ఔషద గుణాలతో ఆరోగ్యాన్నీ ఇస్తాయి. ఏ పువ్వుకు ఎలాంటి ఔషద గుణాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణాలో నవరాత్రి ఉత్సవాలు మరి కాస్త ముందుగానే ప్రారంభం అయిపోతాయి. బతుకమ్మ అంటే సంబరాలు... బతుకమ్మ పూజలు.. జానపద పాటలు.. ఆడపడుచుల ఆటలతో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. సాధారణంగా మనం ఏ శుభకార్యమైనా..పండుగలలైనా దేవుళ్లని పూజించేందుకు పూలను ఎక్కువగా వాడుతుంటాం.

అయితే ఈ బతుకమ్మ పండుగలో పూలనే గౌరమ్మగా మలిచి పూజించడం ప్రత్యేకత. అందుకు వాడే పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వాటి వల్ల మన ఆరోగ్యానికీ మంచి జరుగుతుంది. మరి బతుకమ్మను అలంకరించడంలో ఎక్కువగా ఉపయోగించే పూలేమిటో, వాటిలో దాగి ఉన్న ఔషధ గుణాలేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
బంతి, చామంతులు :
ఏ పండగలో అయినా కలర్ ఫుల్ గా కనబడేవి బంతి, చామంతి పూలు. ఈ రెండు రకాల పువ్వులను ఇంటి అలంకరణ కోసం ఎక్కువగా వాడుతుంటారు. అలాగే బతుకమ్మను అలంకరించడానికి వీటికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పువ్వుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, పెస్ట్ రెపల్లెంట్‌గా పని చేస్తాయి. అలాగే మన శరీరంలో పాదాలు, కళ్లు, నోరు, చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు బెస్ట్ మెడిసిన్ గా ఉపయోగపడతాయి.
గుమ్మడి పూలు :
ఇక గుమ్మడి పువ్వులు గురించి అయితే చెప్పక్కరలేదు. పెద్దగా ఆరెంజ్ కలర్ లో ఆకట్టుకునే గుమ్మడి పువ్వులు పల్లెల్లో ఎక్కువగా దొరుకుతాయి. బతుకమ్మను తయారు చేయడానికి ప్రత్యేకంగా తెచ్చుకునే పూలలో గుమ్మడి పూలు ఒకటి. గుమ్మడి పువ్వుల్లో విటమిన్ ఏ, సీలు ఎక్కువగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం కుకురబిటా పెపో. పొడి చర్మం ఉన్న వారు దీన్ని లేపనంగా వాడటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఇది వృద్ధాప్యంలో వచ్చే నొప్పుల నుంచి కాపాడుతుంది. ప్రోస్టేట్ గ్రంధి ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.
తంగేడు పూలు :
పురాతన కాలం నుండి ఈ పువ్వులను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతున్నారు. ఈ తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పంగా ఉంది . బతుకమ్మను అలంకరించడంలో ఈ తంగేడు పువ్వులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని శాస్త్రీయ నామం కాసియా అరిక్యులాటా. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఔషధంగా ఉపయోగించే అలవాటు ఉంది. మలబద్ధకం, మూత్ర నాళ సమస్యలు, డయాబెటీస్ లాంటి వాటికి మందుగా దీన్ని వాడతారు. అలాగే నెలసరి సరిగ్గా రాని స్త్రీలు దీన్ని మందుగా వాడటం వల్ల ఈ సమస్య నుండి బయట పడుతారు. కీళ్ల నొప్పులకూ దీన్ని మందుగా వాడతారు. దీన్ని కషాయంగా చేసుకుని తాగడం వల్ల శరీరానికి చల్లదనం వస్తుంది.
గునుగు పూలు :
గునుగు పూలు, ఆకుల్లో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా వీటి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ డయాబెటిక్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటి ఆకులను ముద్దతా చేసి గాయాలపై రాసుకోవచ్చు. చర్మ సంబంధ సమస్యలు ఉన్న వారు ఈ పేస్ట్‌ని లేపనంలా చేసుకోవచ్చు. మలబద్ధకం, రక్తహీనత, హైబీపీలాంటి ఉన్న వారు వీటిని వండుకుని తినడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది.
సీతమ్మవారి జడగంటల పూలు :
సీతమ్మవారి జడగంటల పూలను సెలోసియా పూలనీ అంటారు. దృష్టి లోపాలకు ఇవి మందులా పని చేస్తాయి. కళ్లు ఎర్రగా మారడం, గ్లూకోమా, క్యాటరాక్ట్‌లు, హై బీపీ.. తదితర జబ్బులకు ఇది ఔషధంగా పని చేస్తుంది. పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల వారు ఈ పూలు లేతగా ఉన్నప్పుడే కోసేసి సూపులు తయారు చేసుకుని తాగుతారు కూడా.
ఈ పూలతో పాటు బతుకమ్మను అలంకరించేందుకు లిల్లీలు, మల్లెలు, గడ్డిపూలు, మందారాల లాంటి వాటిని వాడుతుంటారు. అలాగే గన్నేరు, తామర, దోస, బీర పూలు.. లాంటి స్థానికంగా అందుబాటులో ఉండే అన్ని పూలనూ వాడుతుంటారు. ప్రతి పువ్వుకు ప్రత్యేక గుణాలుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications