Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలలు సంమృద్ధిగా ఉండే ఆహారాలు తినడమే కాదు కంటి నిండా నిద్రకూడా పోగలగాలి, అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటూ కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు. ఆరోగ్య నిఫుణులు, పరిశోధకుల ప్రకారం 18 ఏళ్ల వయసు దాటిన ప్రతీ ఒక్కరూ రోజుకు 7 గంటలు నిద్రపోవాలి. కానీ అలా జరగడం లేదు. ప్రతీ 10 మందిలో ఒకరు రోజుకు 1 లేదా 2 గంటలు తక్కువగా నిద్రపోతున్నారు. 30 శాతం మంది ఈ సమస్యలో ఇరుక్కున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయ్. సరిగ్గా నిద్రపోకపోతే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.
నిద్ర డ్రైవింగ్
నిద్రలేకపోవడం వల్ల రోడ్డ ప్రమాదాలు కూడా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2017 రోడ్డు ప్రమాదాల్లో 91వేల కేసులు నిద్రలో డ్రైవింగ్ చేనినందువల్ల జరిగినట్లు పోలీసులు అధికారిక లెక్కల ద్వారా కనుగ్గొన్నారు. ఈ కేసుల్లో 800 మంది మృతి చెందగా 50 వేలమంది వరకు తీవ్రగాయాలతో బాధపడ్డారు.
బరువు పెరగడం
రోజుకు 6 గంటలకంటే తక్కువ నిద్రపోయేవారు తప్పుకండా అధిక బరువు సమస్యను ఎదుర్కొంటారు. వీరి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) కూడా 7 రెట్లు అధికంగా ఉంటుంది. రోజుకు ఏడు గంటలు నిద్రపోయేవారి బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు.

హాలుసినేషన్స్, ఊహలు
రోజుకు 24 గంటల్లో ఎప్పుడూ సరిగ్గా నిద్రపోకపోతే, హాలుసినేషన్స్ వస్తాయ్. హాలుసినేషన్స్ అంటే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా కనిపించడం. రోజులో నిద్రకు ప్రత్యకమైన సమయం కేటాయించకపోతే హులుసినేషన్స్‌లో ఆరోగ్యం తీవ్రగం దెబ్బతింటుంది.
నిద్రలేక ప్రేమలో గొడవ
నిద్రకు సరిగ్గా వెళ్లని వారి వైవాహిక జీవితం, ప్రేమ జీవితం దెబ్బతింటుందని పరిశోధకులు అంటున్నారు. రాత్రి బెడ్‌పై ఒకరు పడుకుంటే మరొకరు నిద్రకోసం కుస్తీ పడ్డం చేసినప్పుడు, ఇద్దరికీ వేరు వేరు టైమింగ్‌లో నిద్రపోవలసి వస్తుంది. అలా జరిగినప్పుడు ఇద్దరూ పూర్తిగా నిద్రపోయే పరిస్థితి ఉండదు. ఇద్దరూ ఒకేసారి పడుకొని నిద్రలోకి జారుకుంటే వారి దాంపత్య జీవితం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
నిద్రలేమి సమస్య మీ రోగనిరోధక శక్తిని కూడా దెబ్బ తీస్తుంది. ఓ పరిశోధన ప్రకారం.. సరిగ్గా నిద్రపోని వారు ఏదైనా అనారోగ్యానికి గురైనా వైరస్ బారిన పడ్డా వెంటనే తీవ్ర అనారోగ్యానికి లోనవుతారని పరిశోధకులంటున్నారు.
నిద్రలేమి ఓ అనారోగ్య సమస్య అయినప్పటికీ దానిని నయం చేసుకునే సామర్ద్యం వారి చేతుల్లోనే ఉందని దీనికి వైద్యులు కూడా అవసరం లేదంటున్నారు. బెడ్‌రూంను నీటిగా వుంచుకొని, పనిఒత్తిడిని ఎక్కువగా పెంచుకోకుండా, సహనంతో పనులు చేసుకుంటూ వెళ్తే నిద్రసమస్యలు రావని చెబుతున్నాారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications