Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Side Effects of Cold Water : చల్లటి నీరు తాగుతున్నారా..? ఐతే చాలా డేంజర్..!
ఎండాకాలం వచ్చిందంటే చాల ఫ్రిజ్ ఉన్నవారు ఇంట్లో ఎక్కడెక్కడో పడిపోయిన బాటిల్స్‌ను ఫిల్‌చేసి డీప్ ప్రీజ్‌లో పెట్టి అదే నీటిని తాగుతారు. ఇలా తాగడం వల్ల మనకు ఎక్కడాలేని కిక్కు వస్తుంది. భోజనం తింటే ఆ చల్లటి ఐస్ నీరు తాగితే ఇక ఆ ఆనందం కేవలం ఎండాకాలంలోనే సాధ్యం. అయితే ఇలా చల్లటి ఐస్ నీళ్లను తాగడం వల్ల చాలా దుష్ఫ్రభావాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎండా కాలంలో ఐస్ వాటర్ అంటే రోగాలను కొని తెచ్చుకోవడమేనని హెచ్చరిస్తున్నారు. ఈ ఐస్ నీళ్ల వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో చూద్దాం.
చల్లటి నీరు తాగడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు
దంత సమస్యలు
పంటి నరాలు చాలా సున్నితంగా ఉంటాయ్. చల్లటి నీరు తాగడం వల్ల చిగుళ్లపై ప్రభావం పడుతుంది. పంటి సమస్యలతో బాధపడుతున్న వారు దీనికి దూరంగా ఉండటమే మంచిది. లేదంటే చిగుళ్ల నుంచి రక్తం కారడం, పళ్లు ఊడిపోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

తలనొప్పి సైనస్
చల్లటి నీరు తాగడం వల్ల వెన్నెముక నరాలు ఒక్కసారిగా చల్లబడి తలనొప్పికి దారితీస్తుంది. శరీరంలో ఒక్కసారిగా వేడి పడిపోవడం వల్ల సైనస్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మెదడుపైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి చల్లటి నీరును తాగే అలవాటును తగ్గించుకోవాలి.
గుండె సమస్యలు
చల్లటి నీరు తాగగానే గుండెకు సంబంధించిన నాడులు ఒకే సారి చల్లబడతాయ్. దీంతో అవి చేసే రక్తప్రసరణ పనుల్లో వేగం తగ్గి హార్ట్ రేట్ తగ్గుతుంది. ఇది మొత్తం గుండె సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి మితంగా మాత్రమే చల్లటి నీరును తాగాలి.
జీర్ణక్రియలో అడ్డంకులు
చల్లటి నీరు తాగడం వల్ల అది కడుపులో చేరి కడుపును ఒక్కసారిగా కాంట్రాక్ట్ చేస్తుంది, అంటే దగ్గరికి చేస్తుంది. కడుపులో వాతావరణం కూడా ఒక్కసారిగా మారడం, వేడి తగ్గిపోవడం వల్ల జీర్ణప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో జార్ణ సమస్య వచ్చే అవకాశం ఉంది.
గొంతులో మంట
జలువు లేని వారికి జలుబు తెప్పిస్తుంది. చల్లటి నీరు తరచుగా తాగే వారికి గొంతులో మంట లేదా గొంతు సమస్యలు ఉండడం చూస్తుంటాం. కొందరిలో ముక్కు మూసుకుపోతుంది. ముక్కులో అదనపు శ్లేష్మం పేరుకుపోయ్ ఇబ్బందులను సృష్టిస్తుంది. కాబట్టి చల్లటి నీరు తాగే అలవాటుకి ఇక స్వస్తి పలకండి.
ఒక మనిషి రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ఎండా కాలంలో డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఇది తప్పనిసరిగా పాటించాలి. చల్లటి నీరును ఎంత తాగినా లేని ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల సాధారణ మంచినీటినే రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు తాగాలి. తాగు నీరు విషయంలో అజాగ్రత్త అస్సలు పనికి రాదు, ఎందుకంటే మన శరీరంలో 60 శాతం నీరే ఉంటుంది కాబట్టి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
