Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Benefits of Banana Peel : అరటితొక్క ప్రయోజనాలు తెలిస్తే.. ఇక తొక్కను అస్సలు పారవేయరు..
అరటి పండును తిని తొక్కను తిని పారేస్తాము. కానీ అరటి తొక్కలో కూడా శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు. కేవలం అరటి పండు మాత్రమే కాదు, ఇలా చాలా పళ్ల తొక్కలు, కూరగాయ తొక్కల్లో ఎన్నో పోషకాలు ఉంటాయ్. మనకన్నా ముందే పెద్దలు ఈ తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు మనకు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. అయితే పరిశోధకులు వీటిపై పరిశోధనలు జరిపి పూర్తిగా అవి ఎలా ప్రయోజనకరమౌతాయో కనుగ్గొన్నారు. ఈ రోజు అరటితొక్కతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
అరటితొక్కతో ప్రయోజనాలు
అరటితొక్కలో ఉండే వైటమిన్ బి6 ఇంకా ట్రిప్టోఫాన్ డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. మూడ్‌ను కూడా సరిచేసే సామర్ధ్యం ఉందంటున్నారు.
కొవ్వును తగ్గితస్తుంది..
అరటితొక్కలో మెండుగా ఉండే ఫైబర్ కొలస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గుండెకు సంబంధించిన రక్తనాలాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయ్.

కళ్లు
అరటితొక్కను కంటిపై పెట్టుకుంటే కంటి చుట్టూ ఉన్న నల్ల మచ్చలు తగ్గుతాయ్. కంటికి సంబంధించిన ఎన్నో సమస్యలు అరటితొక్కతో తగ్గుతాయ్.
జీర్ణక్రియ
జీర్ణక్రియను మెరుగుపరిచే రసాయనాలు ఈ అరటితొక్కలో ఉంటాయ్. అరటితొక్కను తీసుకుంటే మలబద్దకం సమస్య నుంచి దూరమౌతారు.
పళ్లు
ఒక వారంపాటు అరటితొక్కను నోటి పళ్లపై ఒక నిమిషంపాటు రాయాలి. ఇలా చేస్తే పళ్లు మిలమిల మెరాస్తాయ్. తొక్కలో ఉంటే పొటాషియం, మెగ్నీషియంను పంటిపైనున్న ఎనామిల్ తీసుకొని అలా మెరవడానికి కారణమౌతాయ్.
మొటిమలు
అరటితొక్కను ముఖంపై ఒకవారం పాటు గట్టిగా రాస్తే మొటిమలు కూడా మాయమౌయ్. చర్మంపై మంట, మచ్చలు ఏవైనా ఉన్నా కూడా పోతాయ్.
ముడతలు రాకుండా
అరటి తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయ్. అరటితొక్కలో చర్మాన్ని ముడతలు పడనీయకుండా చేసే పోషకాలు ఉండడంతో చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
వళ్లు నొప్పులు
అరటితొక్కలో ఉండే కారటొనాయిడ్స్, పాలిఫెనాల్స్ వళ్లు నొప్పులను తగ్గిస్తుంది. ఈ విషయాన్ని 2011 లో జరిగిన పరిశోధనల ద్వారా కనుగ్గొన్నారు.
చర్మానికి రక్షణ కవచంగా
అరటితొక్కలో ఫినొలిక్స్, ఫ్లావనాయిడ్స్, టానిన్లు, కారటెనాయిడ్స్, ఆల్కలాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల చర్మాన్ని యూవీ రేడియేషన్‌ను రక్షిస్తుంది.
ఇళ్లల్లో
అరటితొక్కను బట్టలపై మరకలు తొలగించడానికి, ఇంకా వంటపాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. పెద్దలవద్ద ఇంటి చిట్కాలు ఇలాంటివి చాలా ఉంటాయ్.
దోమలమందు
దురదమంటను తగ్గించే సామర్ధ్యం అరటి తొక్కకు ఉంటుంది. చర్మంపై దోమ కుడితే ఆ భాగంపైన అరటితొక్కతో రాయాలి. అలా చేస్తే అక్కడ ఉన్న మంట తగ్గుతుంది.
అయితే అరటితొక్కను కొన్ని సందర్భాల్లో మాత్రమే నేరుగా తినాలి. వీటిని ఫ్రై చేసుకొని, మిక్సిలో వేసుకొని బజ్జీలుగా ఇలా రకరకాలుగా తినవచ్చు. త్వరలోనే మీకు అరటితొక్కతో రెసిపీలను కూడా అందిస్తాము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications