Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Bipolar disorder : ఈ లక్షణాలు కనిపిస్తే మీరు బైపోలార్ డిసార్డర్‌తో బాధపడుతున్నట్టే..!
శరీరానికే కాదు మనసుకు కూడా మంచి ఆరోగ్యం కావాలి. ఇక్కడ మనసు అంటే మెదడుగా పరిగననలోకి తీసుకుందాం. ఆరోగ్యం విషయంలో చాలా మంది శరీరానికి ఇచ్చిన విలువ మెదడుకు ఇవ్వరు. మానసిక ఆరోగ్యం ఇప్పుడు ప్రాధాన్యతని సంతరించుకుంది. కరోనా వచ్చిన తరువాత ఈ సమస్యలు మరింత పెరిగాయి. మానసిక సమస్యల్లో బైపోలార్ డిసార్డర్ ఇప్పుడు చాలా మందిని ఆందోళనకి గురిచేస్తోంది. కొందరు కేవలం 5 నిమిషాల్లోనే ఎక్కడాలేనంత సంతోషంగా ఫీల్ అవుతారు మళ్ళీ అదే 5 నిమిషాల్లో పూర్తిగా నిరాశలోకి వెళ్లడమో కోపాన్ని తెచ్చోకోవడమోj చేస్తారు. ఇలా రెండు ప్రవర్తనలు మనిషిలో కొన్ని నిమిషాలోనే జరుగుతుంటే దాన్ని బైపోలార్ డిస్ఆర్డర్ అంటారు. ఈ బైపోలార్ డిసార్డర్ అసలు ఎలా వుంటుంది. వాటి లక్షణాలను ఇప్పుడు చూద్దాం.
బైపోలార్ డిసార్డర్‌తో బాధపడుతున్న వారిలో కనిపించే లక్షణాలు :
మూడ్ స్వింగ్స్
బైపోలార్ డిసార్డర్ తో బాధపడుతున్నవారిలో విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. తీవ్రమైన డిప్రెషన్ కి లోనవుతారు. డిప్రెషన్ మొదటి లక్షణంగా చూడాలి. ఈ సమయంలో మనసులో చాలా రకాలైన ఆందోళనలు జరుగుతుంటాయి. ఏదో తప్పు చేస్తున్నామనే భావన ఉంటుంది. ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు.
నిద్రలేమి
నిద్రలేమితో బాధపడతారు. పడుకునేందుకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాత్రి సమయంలో పూర్తిగా మెలుకవతో ఉండడం జరుగుతుంది. ఆకలి అనిపించదు. ఎంత రుచిగా ఉన్నా తినాలంటే విసుగు పుడుతుంది. అన్నింటి పట్ల నిరాశతో ఉంటారు. ఎందుకూ పనికిరామనే భావనలో ఉంటారు.

ఏకాగ్రత లేకపోవడం
ఏకాగ్రతను కోల్పోతారు. మతిమరుపు పెరుగుతుంది. రోజూ చేసే పనులను కూడా చేయాలని అనిపించదు. కారణాలు లేకుండా ఆలోచనల్లో ఉంటారు. లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. నిద్రపట్టకపోవడం వల్ల 1 లేదా 2 గంటలు నిద్రపోయి ఉదయాన్నే నిద్ర లేస్తారు.
ఎక్కడా లేని సంతోషంగా
ఉన్నట్టుండి చాలా సంతోషంగా ఉంటారు. ఎక్కడాలేని శక్తి మీలోపలికి ప్రవేశించినట్లు అనిపిస్తుంది. ముఖ్యమైన పనులను చాలా ఆసక్తితో పూర్తిచేయాలనుకుంటారు. ఇతరులతో ఆపకుండా వేగంగా మాట్లాడ్డం చేస్తారు. డబ్బును కూడా ఎక్కువగా అనవసరవాటికి ఖర్చు చేస్తుంటారు. విచ్చల విడితనం పెరుగుతుంది.
రెండు రకాల ధోరణులు హై ఇంకా లో
పైన ఉన్నవి రెండు రకాల లక్షణాలు. ఒకటి చాలా హైగా అనిపించడం, మరొకటి చాలా లోగా ఫీల్ అవడం. ఈ రెండు లక్షణాలు ఒకదాని తరువాత ఒకటి కనిపిస్తున్నప్పుడు బైపోలార్ డిసార్డర్‌తో బాధపడుతున్నట్లు అర్ధం చేసుకోవాలి.
పనిపట్ల విసుగు
బైపోలార్ డిసార్డర్‌తో బాధపుడుతున్న వారికి ఉద్యోగం చేయాలన్ని ఆసక్తి కూడా తగ్గుతుంది. బంధాలకు విలువ ఇవ్వరు. దగ్గరలేని వస్తువుల వాసనలు వస్తుంటాయి. అవి దగ్గరే ఉన్నట్లు వాటి వాసనను చూస్తున్నట్టు భ్రమలో ఉంటారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇక్కడ ఇచ్చిన లక్షణాలు కనిపిస్తే వెంటనే మానసిక వైద్యులను సంప్రదించాలి. దీనికి అవసరమైన కౌన్సిలింగ్‌ను తీసుకోవాలి. బైపోలార్‌తో బాధపడుతున్న చాలా మంది రోగులు ఆసుపత్రిలో అడ్మిట్ కానవసరం లేదు. ఇంట్లో ఉండే వారు చికిత్సను తీసుకోవచ్చు. కొన్ని టాబ్లెట్లను వాడితే ఈ సమస్య నుంచి బయటపడతారు. మూడ్ స్టెబిలైజ్ కావడానికి వైద్యులు కొన్ని మందులను సూచిస్తారు. వాటిని చెప్పిన సమయం ప్రకారం వేసుకుంటే మానసిక సమస్య తగ్గుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications