Latest Updates
-
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు!
రాత్రుల్లో జీన్స్ వేసుకుని నిద్రపోతున్నారా..ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా!
ఆధునిక ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్యాషన్ ట్రెండ్స్ లో జీన్స్ ఒకటి. ఇది మగ, ఆడ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి చాలా మంది జీన్స్ ధరించడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఈ మద్యకాలంలో ఎక్కువగా జీన్స్ దుస్తులను వాడుతున్నారు. కానీ కొందరు మాత్రం రాత్రిపూట జీన్స్ వేసుకుని పడుకుంటారు. ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
మీకు కూడా జీన్స్ ప్యాంట్ వేసుకుని నిద్రించే అలవాటు ఉంటే ఈరోజే ఆ అలవాటును మానుకోండి. లేకపోతే, ఈ తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలు ఏమిటి మరియు రాత్రుల్లో నిద్రించే ముందు జీన్స్ ధరించడం వల్ల ఏమి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

ఫంగల్ ఇన్ఫెక్షన్లు:
జీన్స్ డెనిమ్ ఫాబ్రిక్ నుండి తయారు చేస్తారు. ఈ బట్ట మన శరీరంలోంచి వెలువడే చెమటను గ్రహించదు. కాబట్టి, మనం జీన్స్ ధరించినప్పుడు, చెమట మన జననాంగాలు, తొడలు మరియు కాళ్ళపై ఉంటుంది. రాత్రిపూట దీన్ని ధరించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
జర్నల్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రచురించబడిన 2018 అధ్యయనం ప్రకారం, టైట్ జీన్స్ ధరించడం ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. బ్రెజిల్‌లోని సావో పాలోలోని డెర్మటాలజిస్ట్ డాక్టర్. యూనివర్సిడేడ్ ఎస్టాడ్యువల్ డి కాంపానియాస్. ఈ పరిశోధనలో బియాంకా షాన్ పాల్గొన్నారు.
చర్మంపై దద్దుర్లు:
టైట్ జీన్స్ ధరించి నిద్రించడం వల్ల శరీరానికి సరైన గాలి ప్రసరణ జరగదు. దీంతో చర్మంలో దురద, దద్దుర్లు, ఎర్రబడడం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి వీలైనంత తక్కువ సమయం జీన్స్ ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెమట ఎక్కువగా పట్టే వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
నిద్రకు భంగం:
సాధారణంగా నిద్రలోకి జారుకున్న కొన్ని గంటల్లోనే శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. అయితే, మీరు జీన్స్‌లో పడుకున్నప్పుడు, గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది మరియు శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది, ఇది నిద్రకు భంగం కలిగిస్తుందని అధ్యయనం చెబుతుంది.
తీవ్రమైన నొప్పి:
జీన్స్ వంటి బిగుతైన దుస్తులు ధరించి నిద్రించడం వల్ల గర్భాశయం, పొత్తికడుపు, జననాంగాలపై ఒత్తిడి పడుతుందని, ఆ భాగాలకు రక్త ప్రసరణ జరగకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ బహిష్టు సమయంలో నొప్పిని పెంచుతాయి.
2018లో పెయిన్ అనే జర్నల్లో వెల్లడించిన అధ్యయనం ప్రకారం లూజుగా ఉండే బట్టలు ధరించిన మహిళల కంటే టైట్ గా ఉండే దుస్తులు ధరించిన మహిళలు ఎక్కువగా పీరియడ్స్ లో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.
జీర్ణక్రియ సమస్య:
టైట్ జీన్స్ వేసుకుని నిద్రపోవడం వల్ల కొందరిలో కడుపునొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం తదితర జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు జీన్స్ ధరించి నిద్రపోవడం మానేసి, వదులుగా ఉండే కాటన్ దుస్తుల్లో పడుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications