Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
హార్ట్ డిసీజ్ టెస్ట్: కేవలం 5 సెకన్లలో ఇంట్లోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కనిపెట్టవచ్చు! చాలా సులభం?
World Heart Day 2024: కరోనా తర్వాత హార్ట్ అటాక్ కేసులు ఊహించని విధంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా చిన్న వయస్సు, యువత గుండెజబ్బుల బారిన పడుతున్నారు.అందుకు కారణం హైబ్లడ్ ప్రెజర్,గుండె వైఫల్యం, సక్రమంగా లేని హృదయ స్పందన (అరిథ్మియా) మొదలైనవి ప్రాణాంతకమైన గుండె జబ్బులు. ఇవి వెంటనే గుర్తించకపోవడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి.
ముందస్తు గుండెబజబ్బులను గుర్తించడానికి గుండెకు సంబంధించిన పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలి. ఈ టెస్ట్ ద్వారా మీకు గుండెకు సంబంధించిన వ్యాదులున్నాయా లేదా , భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గురించవచ్చు. ఇంట్లోనే గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడానికి వాటర్ టెస్ట్ బాగా సహాయపడుతుంది. వాటర్ టెస్ట్ ఏంటి అని ఆశ్యర్యపోతున్నారా? అవును కేవలం మీరు చేసే ఒక చిన్న టెస్ట్ వల్ల గుండెజబ్బులను ముందుగానే గుర్తించవచ్చని అంటున్నారు నిపుణులు. ఆ విషయాలేంటో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.
ఓరల్ హెల్త్ జర్నల్లో ఫ్రాంటియర్స్ వెల్లడించిన ఓ పరిశోధన ప్రకారం కేవలం 5 సెకన్లలో మీరు మీ గుండె ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవచ్చు.

సెలైన్ వాటర్
ఓరల్ హెల్త్ జర్నల్లో ఫ్రాంటియర్స్ వెల్లడించిన ఓ పరిశోధన ప్రకారం సెలైన్ వాటర్ తో నోటిని పుక్కిలించినా లేదా అదే నీటితో నోటిని కడిగిన తర్వాత నోట్లో వచ్చే లాలాజంలో తెల్లరక్త కణాలు ఎక్కువగా కనబడినట్లైతే మీ గుండె ప్రమాదంలో ఉందని, గుండె జబ్బులను సూచిస్తుందని నిపుణుల అభిప్రాయాన్ని వెల్లడించారు.
నోటి పుక్కలింపుతో గుండె ఆరోగ్యాన్ని కనుగొనవచ్చు
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ నోట్లో సెలైన్ వాటర్ పోసుకుని పుల్లించిన తర్వాత వారి లాలాజనాన్ని పరిక్షించన తర్వాత వారిలో గుండె ధమనులకు నష్టం కలిగించే తెల్లరక్తకణాల అధిక స్థాయి ఉండటం మొదటి సంకేతంగా గుర్తించారు. తర్వాత చిగుళ్లలో వాపును కనుగొన్నారు. ఇది కూడా గుండె జబ్బులకు సంకేతంగా గుర్తించారు.

చిగుళ్ల వ్యాధి
నిపుణుల అభిప్రాయం ప్రకారం గతంలో కూడా చిగుళ్ల వ్యాధులకు- గుండె జబ్బులకు సంబంధం ఉన్నట్లు పరిశోధనల్లో కనుగొన్నారు. చిగుళ్ల వాపు వల్ల రక్తప్రసరణ ద్వారా గుండె యొక్క ధమనులకు హాని కలిగిస్తుంది. తర్వాత జరిపిన పరిశోధనల్లో వాటర్ టెస్ట్ ఆధారంగా చిగుళ్లలో వాపు ఉంటే అది ధమనులకు రక్తాన్ని సరఫరా చేసే మూలకంగా ఉండే నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పతి చేసి ధమనుల సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు.
చిగుళ్ల వ్యాధికి మరియు గుండెపోటుకు సంబంధం
చిగుళ్ల వ్యాధితో బాధ పడే వారిలో గుండెకు సంబంధించిన వ్యాధలు, స్ట్రోక్ లేదా ఇతర తీవ్రమైన గుండ జబ్బుల ప్రమాదం రెండు నుండి మూడు రెట్లు పెరుగుతుందని హార్వర్డ్ హల్త్ నివేదికలో వెల్లడించారు. చిగుళ్ళలో దీర్ఘకాలిక మంట దైహిక వాపును ప్రేరేపిస్తుంది, రక్త నాళాలను దెబ్బతీస్తుంది మరియు హృదయనాళ ప్రమాదాన్ని పెంచుతుంది. పోర్ఫిరోమోనాస్ గింగివాలిస్ వంటి చిగుళ్ల వ్యాధి బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండెకు చేరుతుంది.
చిగుళ్ల వ్యాధి: ఒక సైలెంట్ కిల్లర్
చిగుళ్ల వ్యాధి, లేదా పీరియాంటైటిస్, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఇది చిగుళ్ళ వాపుతో మొదలవుతుంది (చిగురువాపు) మరియు చుట్టుపక్కల కణజాలం మరియు ఎముకల వాపుకు కారణం అవుతుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే, చిగుళ్ల వ్యాధికి దారితీయవచ్చు:

చిగుళ్ల వ్యాధి లక్షణాలు
చిగుళ్లవాపు
పళ్ళు వదులుగా మారడం
నోటి దుర్వాసన
తినడానికి కష్టంగా ఉండటం
చిగుళ్ల మధ్య రక్త స్రావం చీము రావడం
చిగుళ్లు చాలా సున్నితంగా మారడం
చిగుళ్ల చివర్లలో ఫలకం ఏర్పడటం
నివారణ మరియు చికిత్స
మీ గుండె మరియు చిగుళ్ళను రక్షించడానికి:
1. క్రమం తప్పకుండా బ్రష్ మరియు ఫ్లాస్
2. రెగ్యులర్ చెక్-అప్‌ల కోసం మీ దంతవైద్యుడిని సందర్శించండి
3. చిగుళ్ల వ్యాధికి వెంటనే చికిత్స చేయండి
4. మంచి నోటి పరిశుభ్రతను నిర్వహించండి
5. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి రెగ్యులర్ చెకప్లు చేయించకోండి
చిగుళ్ల వ్యాధి మరియు గుండె ఆరోగ్యం మధ్య సంబంధం కాదనలేనిది. నోటి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు చిగుళ్ల వ్యాధిని పరిష్కరించడం ద్వారా, మీరు గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
గమనిక: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే, ఇది ఏ విధంగానూ ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications