Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
రోజూ నవ్వుతూ పనిచేయాల్సిందే హుకుం జారిచేసిన ప్రభుత్వం..ఎక్కడో తెలుసా?
నవ్వు నాలుగు విధాలా చేటు అనేది పాత సామెత. ఇప్పుడు నవ్వు వంద రకాలుగా ఆరోగ్యం అంటున్నారు నిపుణులు. మీరు నవ్వుతూ నలుగురిని నవ్విస్తుంటే మీ ఆరోగ్యంతో పాటు ఇతరులు కూడా సంతోషంగా ఆరోగ్యంగా జీవిస్తారని అంటున్నారు. అందులో బాగంగానే లాఫింగ్ థెరఫీలు పుట్టుకొచ్చాయి. ప్రత్యేకంగా నవ్వించడం కోసమే కొన్ని సంస్థలు, యోగా సెంటర్లు, వ్యాయామ శాఖలు పనిచేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. బహుషా అందుకేనేమో దీని మీద చట్టం కూడా తీసుకొచ్చింది. మీకు వినడానికి వింతగా అనిపించినా ఇది నిజం. ఇది ఎక్కడో తెలుసా? ఎందుకు ఇలా నవ్వడం చట్టబద్దం చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఏదైనా తప్పు చేస్తేనో లేదా నేరాలను అరికట్టడానికనో ప్రభుత్వాలు కొన్ని చట్టాలు తెస్తాయి. అయితే జపాన్ లో ఓ కొత్త చట్టం అమలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విషయంలోకి వెలితే..జపాన్ లో ప్రభుత్వం అందరూ ఖచ్చితంగా నవ్వాలని ఓ చట్టం తీసుకొచ్చింది. యమగట ప్రిఫెక్చర్ (Yamagata prefecture) ప్రభుత్వం 'లాఫింగ్ లా'ని తీసుకొస్తూ హుకుం జారీ చేసింది.

యమగల విశ్వవిద్యాలయంలోని 'ఫ్యాక్టరీ ఆఫ్ మెడీసిన్ ' జరిపిన పరిశోధనలో తక్కువగా నవ్వే వారు త్వరగా వివిధ రకాల వ్యాధులతో చనిపోతారని వెల్లడించింది. బిజీగా ఉన్న ఈ రోజుల్లో జీవన శైలి చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఒత్తిడి ఆందోళనలతో జీవన విధానం తీవ్రంగా ప్రభావితం అవుతుండటం వల్ల చాలా మంది చనిపోతున్నారు.
కాబట్టి ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ రోజులో ఒక్కసారైనా తప్పనిసరిగా నవ్వాలనే రూల్ తీసుకొచ్చింది. ఇంట్లోనే కాదు ముఖ్యంగా పనిచేసే క్యార్యాలయాలలో కూడా ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలని, నవ్వుతూ పనిచేసే విధంగా ప్రోత్సహించాలని కంపెనీలకు ఆదేశించడం విశేషం. దీని కోసం ఒక డేట్ ను కూడా ఫిక్ చేసింది. అది ప్రతి నెలా ఎనిమిదో తేదీని నవ్వే ప్రోగ్రాం పెట్టాలని సూచించింది. దీనికి 'హాస్యంతో ఆరోగ్యం' అనే ఓ క్యాప్షన్ కూడా పెట్టింది.
అయితే జపాన్ లో ఒక వర్గానికి చెందిన పార్టీ మాత్రం దీన్ని విరుద్దంగా వ్యతిరేకిస్తున్నారు. నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి కానీ బలవంతంగా నవ్వించండం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో నవ్వలేకపోవచ్చు..ఇలాంటి చట్టాలతో ప్రజల హక్కులను హరించేయోద్దు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఈ విమర్షలను ఏమాత్రం సీరియస్ గా తీసుకోకుండా కొట్టిపారేసింది. కానీ నవ్వడం నవ్వకపోవడం మీ ఇష్టం అన్నట్లు తెలిపింది. అందుకు సంబంధించిన ఎటువంటి నియమాలను చట్టబద్దం చేయలేదని తెలిపింది.
నవ్వు వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి
- బిగ్గరగా నవ్వడం వల్ల బిపిని, మధుమేహం, మానసిక ఒత్తిడిలు తగ్గించుకోవచ్చు. బిగ్గరగా నవ్వినప్పుడు శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ మెరుగుపడుతాయని దీని వల్ల గుండె పోటు సమస్యలు రావు.
- అంతే కాదు శరీరంలో కండరాల నొప్పులను నివారించే ఎండర్ఫిన్లు విడుదల అవుతాయి.
- ఒక చిరునవ్వు ముఖంలో అదంతో పాటు ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. బుగ్గలకు, పెదవులకు మరియు కంటికి ఒక వ్యాయామం వంటింది.
- నవ్వడం వల్ల మెడకు మంచి వ్యాయామం. థైరాయిడ్ స్కాండిలైట్ వంటి ధీర్ఘకాలిక వ్యాధులు ధరిచేరవు.
- నరాల బలహీనత తగ్గుతుంది. సో ఫ్రెండ్ నేటి నుండి మీరు కూడా...
నవ్వడం ఒక భోగం..నవ్వించడం ఒయ యోగం నవ్వకపోవడం ఒక రోగం. మీరు నవ్వుతూ ఒకరి నవ్విస్తూ ఉండండి..!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications