Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
ఒక గంటలో గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలుసా!
మనిషి శరీరంలో మెదడు తర్వాత అత్యంత కీలకమైనది గుండె అని అంటారు. కానీ నిజానికి ప్రాణం పోసే లయబద్ధమైన చప్పుడు మన గుండె నుంచే మొదలవుతుంది. ఇది మన శరీరమనే రాజ్యానికి రారాజు, నిరంతరం పనిచేసే ఒక అలుపెరుగని సైనికుడు. మన ఉనికికి, మన జీవన లయకు అసలైన చిరునామా ఈ గుండె. కేవలం మన పిడికిలంత పరిమాణంలో 300-400 గ్రాముల బరువుతో ఉండే గుండె చేసే పని మాత్రం అమోఘం. గర్భంలో శిశువుగా ఉన్నప్పటి నాలుగో వారం నుండి మొదలై..మన చివరి శ్వాస వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా పనిచేస్తుంది.
గుండె ఆగిపోతే జీవితం ఆగిపోతుంది, జీవితం ఆగిపోతే గుండె ఆగిపోతుంది. మన శరీరంలో ఇది ఒక శక్తివంతమైన, తెలివైన పంపులా పనిచేస్తుంది. దీనికి నాలుగు గదులు ఉంటాయి. ఇవి చెడు రక్తాన్ని స్వీకరించి, ఊపిరితిత్తులకు పంపి శుద్ధి చేసి, ఆక్సిజన్‌తో నిండిన స్వచ్ఛమైన రక్తాన్ని తిరిగి శరీరంలోని ప్రతి కణానికి, ప్రతి అణువుకు అందిస్తాయి.

గుండె సగటున నిమిషానికి 72 సార్లు, గంటకు 4,320 సార్లు, రోజుకు లక్షకు పైగా సార్లు కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ సంకోచ వ్యాకోచాల (కొట్టుకోవడం) ద్వారానే మన శరీరమంతా రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. గుండె ఒకసారి కొట్టుకోవడానికి కేవలం 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..అది సంకోచించడానికి (రక్తాన్ని పంప్ చేయడానికి) తీసుకునే సమయం కంటే, వ్యాకోచించడానికి (విశ్రాంతి తీసుకోవడానికి) దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంటే పనిచేసిన దానికంటే ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటూ, తనపై భారాన్ని తగ్గించుకుంటుంది.
గుండె సంకోచించినప్పుడు రక్త నాళాలపై కలిగే ఒత్తిడిని సిస్టోలిక్ రక్తపోటు అంటారు. ఇది ఆరోగ్యవంతులలో సాధారణంగా 120 mm Hg ఉంటుంది. అలాగే గుండె విశ్రాంతి తీసుకునే సమయంలో ఉండే ఒత్తిడిని డయాస్టోలిక్ రక్తపోటు అంటారు..ఇది 80 mm Hgగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడానే పల్స్ ప్రెజర్ (40 mm Hg) అంటారు. ఈ సంఖ్యలలో తేడాలు వస్తే.. మన గుండె ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైనట్లే.
అయితే ఇంతటి అద్భుతమైన అవయవానికి మనమే కొన్నిసార్లు శత్రువులుగా మారుతాం. మన లైఫ్ స్టైయిల్ దీనికి ప్రధాన కారణం. ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారంలో అధిక ఉప్పు, ధూమపానం, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటివి గుండెకు పెను ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇవి గుండె జబ్బులకు దారితీసి, దాని పనితీరును దెబ్బతీస్తాయి. గుండె మన జీవితానికి ఆధారం. కాబట్టి ఈ జీవనాధారమైన అవయవాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం మన గుండెకు మనం ఇవ్వగల గొప్ప బహుమతులు. గుండె సమస్యలు తలెత్తినప్పుడు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్స్ సంప్రదించి, సరైన ట్రీట్మెంట్, మెడిసిన్స్ తీసుకోవడం అత్యవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
