Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
గణేష్ చతుర్థి 2019: గణపతి అలంకరణ కొరకు సృజనాత్మక చిట్కాలు
వినాయక చతుర్థి సందర్భంగా మీరు వినాయకుణ్ణి ఇంటికి తేవటానికి ముందు మీ ఇంటిని సిద్దం చేసుకోవాలి.
వినాయక చతుర్థి అనేది వినాయకుడికి అంకితం చేసిన ఒక ఆకర్షణీయమైన మరియు అభిమానం కలిగిన పండుగ. ఈ వేడుక వలన మన ఇంటికి అదృష్టం,మంచి భావం వస్తాయని నమ్మకం. అన్ని భారతీయ పండుగల మాదిరిగానే దేవుని చుట్టూ అపరిమితమైన ఉల్లాసం మరియు ఆహ్లాదకరము ఉంటాయి. వినాయక చతుర్థి సందర్భంగా మీరు వినాయకుణ్ణి ఇంటికి తేవటానికి ముందు మీ ఇంటిని సిద్దం చేసుకోవాలి. దాని కోసం కింద ఉన్న గణపతి అలంకరణ చిట్కాలు మీకు ఉపయోగపడవచ్చు.

గణేష్ చతుర్థి సమయంలో మీరు ఏదైనా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉంటే,అప్పుడు మీకు గణపతి అలంకరణ కోసం ఈ చిట్కాలు సహాయపడతాయి. ఈ ఆలోచనలు ఈ సంవత్సరం మీ ఇంటికి తీసుకువచ్చే వినాయకుని విగ్రహం మరియు మీ ఇంటిని అలంకరించేందుకు సహాయం చేస్తాయి. గణపతి అలంకరణ కోసం ఈ చిట్కాలను మరియు మీ స్వంత సృజనాత్మకతను ఉపయోగించండి.

ముగ్గులు
ముగ్గులు అనేవి పూజ అలంకరణలో ఒక ముఖ్యమైన భాగం. సాదారణంగా వినాయకుడి ముందు ముగ్గులు వేయటానికి తెలుపు కొల్లాం పొడిని ఉపయోగిస్తారు. ఇక్కడ మీరు వినాయకుని చిత్రాన్ని గీయటానికి ప్రయత్నించండి.

పీఠము
వినాయకుడిని ఎల్లప్పుడూ ఒక ఎత్తైన పీఠము మీద ఉంచాలి. కాంస్య సింహాసనం మీద వినాయకుడి విగ్రహం పెడితే అనుకూలమైన స్థలంగా ఉంటుంది.

సిల్వర్ జ్యువెలరీ
వినాయకుడు అలంకరణను ఇష్టపడతారు. అందుకు వినాయకుణ్ణి బాగా అలంకరించటానికి మీరు వెండి ఆభరణాలు మరియు ఆయుధాలను ఉపయోగించండి.

బంగారు ఆభరణాలు
బంగారం అనేది హిందూమతంలో అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణించబడుతుంది. మీ దగ్గర బంగారు ఆభరణాలు ఉంటే,మీ వినాయకుడి విగ్రహంనకు బంగారు ఆభరణాలు వేస్తె చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

గంధం
గంధం అనేది పూజలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీరు మీ వినాయకుడి విగ్రహంను అలంకరించేందుకు గంధం గుర్తులను ఉపయోగించవచ్చు.

బంతి పువ్వు దండలు
వినాయకునికి ఆరెంజ్ బంతి పూలు అంటే ఇష్టం. కాబట్టి మీరు ఆరెంజ్ బంతి పూల దండలతో ఆయన మొత్తం ఉదరం ఒడి కవర్ చేయవచ్చు.

తలపాగా
అనేక కుటుంబాలు వినాయకుని విగ్రహానికి కిరీటంనకు బదులుగా ఒక అందమైన వస్త్రంతో తలపాగా చుట్టటం సంప్రదాయంగా ఉన్నది.

కర్టెన్లు
మీ వినాయకుడి విగ్రహం ఉంచడానికి ముందు ఎల్లప్పుడూ రంగుల కర్టెన్లు ఉండాలి. అప్పుడు బ్యాక్ గ్రౌండ్ ప్రకాశవంతముగా మరియు శక్తివంతముగా కనిపిస్తోంది.

లైట్స్
ఫెయిరీ లైట్లు లేదా తాడు లైట్లు భారతీయ ఉత్సవంలో భాగంగా ఉంటాయి. మీ వినాయకుడి విగ్రహం చుట్టూ తాడు లైట్ల నమూనాలతో అలంకరించవచ్చు. మెరిసే లైట్లను మీ ఇంటి బయట అలంకరించేందుకు ఉపయోగించవచ్చు.

పచ్చదనం
ఈ వినాయకచవితి నాడు మీ థీమ్ 'గో గ్రీన్' అయితే అప్పుడు మీరు మీ గణపతి విగ్రహం చుట్టూ మొక్కలను ఉంచుకోవచ్చు.

దీపం స్టాండ్ లు
పొడవైన లోహపు దీపం స్టాండ్ లు మీ పూజ గదిలో చాలా అందముగా మరియు సాంప్రదాయికంగా ఉంటాయి. ఒక సాంప్రదాయ లుక్ కోసం మీ పూజ గదిలో రెండు పొడవైన దీపం స్టాండ్ లను ఉంచండి.

పల్లకీ
మీరు మీ వినాయకుడి విగ్రహం కోసం ఇంటిలో ఉండే ఒక కార్డుబోర్డుతో పల్లకీ చేయవచ్చు.మీరు మీ పిల్లల సహాయం తీసుకోండి. అంతేకాక మీ స్వంత క్రాఫ్ట్ నైపుణ్యాలను ఉపయోగించి ఒక అందమైన పల్లకీ రూపకల్పన చేయండి.

మరాఠా శైలి
మీరు మహారాష్ట్ర లో ఉన్నట్లైతే, మీరు ఒక మరాఠీ వేషం మీ వినాయకుడికి వేయవచ్చు. మీ గణపతి విగ్రహంనకు తెల్లని కుర్తా,పంచె మరియు ఆయన తల చుట్టూ ఒక కాషాయ తలపాగా కట్టాలి.

ప్రకాశవంతమైన రంగులు
కొన్నిసార్లు ప్రకాశవంతమైన రంగులు పండుగ మూడ్ ను తీసుకురావటానికి సహాయం చేస్తాయి. ఇంకా అది ఆకర్షణీయంగా కనపడటానికి ప్రకాశవంతమైన నియాన్ షేడ్స్ తో వినాయకుడి విగ్రహంను చిత్రీకరించండి.

కాలిన మట్టి కుండలు
ఇది మీరు ఈ సంవత్సరంలో ప్రయత్నించటానికి ఒక కొత్త థీమ్. మీ వినాయకుడి విగ్రహం వెనుక భాగాన్ని సిద్ధం చేయడానికి కాలిన మట్టి శిల్పాలు మరియు కుండలను ఉపయోగించండి.

కరెన్సీ దండలు
వినాయకుడు మీ ఇంటిలో సంపద మరియు శ్రేయస్సు యొక్క దూత. కనుక కరెన్సీ నోట్ల దండలు వినాయకుడి విగ్రహాలకు అలంకారం చేయటం సంప్రదాయం.



Click it and Unblock the Notifications