Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఇంట్లో గణేష విగ్రహం ఉంచాల్సిన పవిత్రమైన ప్రదేశం ఏది?
గణేష్ చతుర్థి అంటే ఏనుగు తలతో ఉన్న దేవుడు, దివ్య శక్తులు కలిగిన గణపతి దేవుని పేరిట జరుపుకునే పండుగ. అనేక కుటుంబాలు ఈ పర్వదినాన వారి ఇంట్లో గణేశ విగ్రహం ఉంచుతారు. అలంకరించబడిన గణేశుని ఉంచటం, మీరు నిత్యపూజ కోసం విగ్రహం ఉంచే స్థలంలో ఉంచరు. దీనిని పూర్తి భిన్నంగా ఉంచుతారు. అందువలన మీ ఇంట్లో గణేష్ విగ్రహం ఉంచడానికి సరిఅయిన స్థలమేదో ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. గణేశ విగ్రహం ఉంచటానికి సరిఅయిన స్థలమేదో నిర్ణయించుకున్న తర్వాతే దేవుని అలంకరణ ఆలోచనలు నిర్దారింపబడతాయి.
చాలా మంది గణేష్ చతుర్థికి, గణేశుడి విగ్రహాన్ని వారి హాల్ లో గాని లేదా పూజ గదిలోగాని ఉంచుతారు. అయితే, మీరు గణపతి విగ్రహాన్ని సరిఅయిన వాస్తు నియమాలను తెలుసుకుని ఎక్కడ ఉంచాలి అన్నది నిర్ణయించుకోవలిసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీ ఇంట్లో వినాయక విగ్రహం ఉంచడం కోసం ప్రాథమిక మార్గదర్శకాలను కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాము. చూడండి.

తొండం ఎడమ వైపుకు ఉండాలి
గణేశుని తొండం ఎల్లప్పుడూ గౌరీ (అతని తల్లి) దేవి వైపు అంటే ఎడమ వైపుకి ఉండాలి. చాలా మంది గణేష్ చతుర్థినాడు గౌరీ మరియు గణేశుడిని కలిపి ఉంచుతారు. కాబట్టి ఎప్పుడూ గణేశ విగ్రహం తొండం కొనలు ఎడమ వైపున ఉన్న గౌరీ మాతవైపు ఉండాలి.
వెనుక ముఖం
గణేశ వెనుకముఖం మీ ఇంట్లోని ఏ గదుల్లోకి ఎదుర్కొంటున్నట్లుగా ఉంచరాదు. గణేశుడు, సంపదలు,శ్రేయస్సులను అందించే దేవుడు, కాని ఆయన వెనుకముఖం పేదరికాన్ని సూచిస్తుంది. అందువలన, గణేశుడి వెనుకముఖం మీ ఇంటి బయటద్వారం ఎదుర్కొంటున్నట్లుగా ఉండాలి.
దక్షిణాన ఉంచకూడదు
మీ ఇంటి దక్షిణ దిశలో గణేశ విగ్రహం ఉంచకూడదు. మీ ఇంట్లో తూర్పుదిశలో కాని, పశ్చిమ దిశలోకాని గణేశుడి విగ్రహాన్ని ఉంచండి. మీ పూజ గది కూడా మీ ఇంట్లో దక్షిణదిశలో ఉండకూడదు.
టాయిలెట్
స్నానాలగదికి జోడించిన గోడకు ఎప్పుడూ గణేశ విగ్రహాన్ని ఉంచకూడదు. మీరు ఉండే గదికి మరియు టాయిలెట్ కి ఉండే సాధారణ గోడ వద్ద కూడా గణేశుని విగ్రహం ఉంచకూడదు.
వెండి వినాయకుడు
పలు కుటుంబాలు వారి ఇంట్లో స్వచ్ఛమైన వెండి వినాయక విగ్రహం ఉంచుతారు. మీ గణేశ విగ్రహం లోహంతో చేయబడి ఉంటే, అప్పుడు దానిని ఈశాన్యం లేదా నైరుతి దిశలో గాని ఉంచాలి.
ఈశాన్యం
మీ ఇంట్లో ఈశాన్య మూలలో గణేశవిగ్రహం ఉంచటం శ్రేష్ఠకరం. మీ ఇంటి ఈశాన్యం వైపు పై నియమాలు అనుకూలిస్తే, అప్పుడు ఇక్కడ విగ్రహం ఉంచండి.
మెట్ల కింద
మీరు ఒక డూప్లెక్స్ లేదా బంగళాలో నివసిస్తూ ఉంటే, మీరు మెట్ల కింద గణేశవిగ్రహం ఎప్పుడూ ఉంచకూడదు. ఎందుకంటే జనాలు మెట్ల మీద నడుస్తుంటారు అంటే వారు అక్షరాలా గణేశుని తల మీద నడిచినట్లుగా ఉంటుంది. ఇది మీ ఇంటికి దురదృష్టం తీసుకొస్తుంది.
ఇవి మీరు ఇంటి వద్ద గణేశునికి పూజ, అలంకరణలు చేయాలి అని అనుకున్నప్పుడు అనుసరించవలసిన కొన్ని సాధారణ నియమాలు.



Click it and Unblock the Notifications