Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సువాసనల భరితం మా పూదోట!

1. జాస్మిన్ పూల మొక్క - జాస్మన్ అంటే 'భగవంతుని బహుమతి'. ఈ మొక్క వేడి, తేమ ఉండే ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. 10 నుండి 15 అడుగులు పెరిగే తీగమొక్క. సంవత్సరానికి 2 అడుగులు పెరుగుతుంది. పూలు రాత్రి వేళ మాత్రమే వికసిస్తాయి. గార్డెన్ లో విహరించేటపుడు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది.
2. గులాబి - గులాబి పూల మొక్కలలో రాణి గా పిలుస్తారు. దీనిని పెంచటం కొచెం కష్టమైనప్పటికి వేసవి విడిది తోటలలో ఇది వుండటం కంటికి ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. గులాబిలో చాలా రకాలున్నాయి. మీ గార్డెన్ లోని స్ధలాన్నిబట్టి అనువైనది ఎంచుకోండి. ఈ మొక్కలకు ప్రతిరోజూ కనీసం 6 గంటలు సూర్యరశ్మి తగలాలి. నీటిని బాగా పోయాలి.
3. ట్యూబ్ రోజ్ - ఈ మొక్క పూలు మంచి సువాసన నిస్తాయి. ఇవి కూడా రాత్రివేళే వికసిస్తాయి. పూల సువాసన ఇంటికి వచ్చే వారికి మత్తెక్కిస్తుంది. 5 నుండి 6 గంటలు సూర్య రశ్మి కావాలి. ఈ మొక్కను ఇంటిలో లేదా బయట కూడా పెంచవచ్చు. ఇది వుంటే ఇంటిలో ఏ రకమైన ఎయిర్ ఫ్రెషనర్స్ అవసరం లేదు.
4. చంద్రకాంతులు - సాధారణంగా వీటిని మమ్స్ అని కూడా పిలుస్తారు. వసంతకాలం మధ్యలో పూచి చక్కటి సువాసన నిస్తాయి. విత్తనాలు చల్లాలి. 4 వారాలపాటు మంచి జాగ్రత్తలు తీసుకుంటే మొక్క ఆపై బాగా పెరుగుతుంది. నేలలోను, కుండీలలోను కూడా పెంచవచ్చు. ఆర్గానిక్ మెన్యూర్ వేస్తే ఫలితం బాగుంటుంది.
5. చంపక్ - మొదటిలో మొక్కగా వున్నా, పెరిగే కొద్ది పెద్ద చెట్టుగా మారి వాసనలు వెదజల్లే వందల పూలు ఇస్తుంది. పూలు తేనెటీగలను, సీతాకోక చిలుకలును బాగా ఆకర్షిస్తాయి. 10 నుండి 15 అడుగుల ఎత్తు ఎదిగి ఆకర్షణీయంగా వుంటుంది. నీరు బాగా పోయాలి. నేలలో మాత్రమే దీనిని పెంచాలి.
సువాసనలు వెదజల్లే పూల తోట స్వర్గాన్ని తలపిస్తుంది. ఇక సాయంత్రం అలసి సొలసి ఇంటికి చేరిన వారికి శారీరకంగాను, మానసికంగాను ఎంతో హాయినిస్తుంది. కనుక చక్కటి ప్రకృతి వైద్యానిని అందించే సువాసనల తోటలను ఇంటి ముంగిట వేసి ఆనందించండి.



Click it and Unblock the Notifications