Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సులభంగా పెంచగలిగిన కూరగాయలు!

1. గోంగూర: పచ్చనైన ఈ ఆకు కూర ఇంటి పెరటిలో మనకు పెద్ద శ్రమ లేకుండానే త్వరగా పెరుగుతుంది. మంచి ఐరన్, విటమిన్లు కల ఈ ఆకుకూర కొద్ది స్ధలంలో లేదా కుండీలలో కూడా పెంచవచ్చు. విత్తనాలు పై పైన చల్లితే చాలు రెండు లేదా మూడు వారాల్లో మొలకెత్తుతాయి. తక్కువపాటి ఉష్ణోగ్రత, కొద్దిపాటి తేమ వీటికి చాలు. ఉపయోగించేముందు ఈ ఆకుకూరను బాగా కడిగి ఉపయోగించాలి.
2. తోటకూర: ఈ ఆకు కూరను కూడా గోంగూర వలెనే అతి తేలికగా పెంచవచ్చు.
అయితే, అధిక సూర్యరశ్మి తగిలితే రుచి మారుతుంది. ఇంటిలో మనం తినగా మిగిలిన పదార్ధాలు లేదా ఇతర కూరల వ్యర్ధపదార్ధాలు అది పెరిగే నేలలో పడవేస్తే మంచి ఎరువుగా కూడా వుంటుంది.
3. వంకాయ మొక్కలు: వంకాయ ఇచ్చే రుచి అమోఘంగా వుంటుంది. దీనిని ఇతర కూరలతో కూడా కలిపి వండుకోవచ్చు. ఊదారంగులో గుండ్రంగా లేదా కోలగా పెరిగే ఈ కాయలు తగుమాత్రం ఉష్ణగ్రతలలో పెరుగుతాయి. మన దేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలుండే శీతాకాలంలో వీటి ఎదుగుదల తక్కువగా వుంటుంది. వీటిని తేలికగా కుండీలలో పెంచవచ్చు. మొక్కలు ఎక్కువ పొడుగు ఎదగవు.
4. చిక్కుడు కాయలు: చిక్కుడు గింజలను పాతే ముందు నానపెట్టవలసిన పనిలేదు. ఇవి అతి తేలికగా మొలకెత్తుతాయి. ఎండ బాగా తగలాలి. అధిక వర్షం నుండి కాపాడండి. లేకుంటే మొలకెత్తటం కష్టం. వీటిని మట్టి కుండీలలో పెంచటం చాలా తేలిక.
సులభంగా ఇంటి పెరటిలో పెంచగల ఈ మొక్కలు మంచి పోషకవిలువలతో కూడిన కూరలను అందించటమే కాక, అతి తక్కువ వ్యయంతో, అధిక శ్రమ లేకుండా పెరుగుతూంటాయి.



Click it and Unblock the Notifications