Latest Updates
-
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా?
తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో ఆకుకూరలు...

ఇంటి దగ్గర పెంచుకొనేందుకు త్వరగా పంట చేతికందాలంటే ఆకు కూరలే బెస్ట్. ఆకు కూరలకు ఎక్కువ ఎరువులను ఉపయోగించనవసరం లేదు. మొదట్లో కంపోస్టు ఎరువును వేస్తే సరిపోతుంది. తర్వాత తర్వాత ఇంట్లోనే కుళ్ళడానికి అవకాశం ఉన్న వంటింటి వ్యర్థపదార్థాలు కుళ్లి కంపోటస్టుగా మారితర్వాత మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. అలాగే పప్పులు, బియ్యం కడిగిన నీళ్లు వేరే బక్కెట్‌లో పోసి ఏరోజుకారోజు మొక్కలకు పోషించుకోవచ్చు.
ముఖ్యంగా ఆకుకూరలు త్వరగా పండేవి, తోటకూర, చుక్కకూర, పాలకూర, మొంతాకు, దంటు ఆకు, బచ్చలి ఆకు, కరివేపాకు, కొత్తిమీర, పొదీనా, ఉల్లికాడలు, గుమ్మడి వంటి వాటిని పండించుకోవచ్చు. వీటితోపాటు కొన్ని రకాలు కూరగాయల మొక్కలు కూడా పెంచుకోవచ్చు వాటిలో త్వరగా పెరిగేవి. వంకాయ, బెండకాయ, టమోట, పచ్చిమిర్చి, చిక్కుడు, దోసకాయ వంటి కూరగాయలు సైతం పెరటి మొక్కల్లో త్వరగా పెంచుకోవచ్చు.
ఇలా ఇంటి పట్టున ఆకు కూరలు, కూరగాయలు సేంద్రియ పద్దతుల్లో పండిచుకోవడం వల్ల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే శరీర పెరుగుదల, దఢత్వానికి చక్కని ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. రసాయనిక ఎరువులతో పెరిగిన కూరగాయలతో పోలిస్తే సేంద్రియ కూరగాయల్లో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఇక రుచి సంగతి చెప్పక్కర్లేదు. రసాయనాల అవశేషాలు ఉండవు కనుక ఆనారోగ్యం బారీన పడే ప్రమాదం ఉండదు. కాబట్టి చాలా సులువుగా, శ్రమ లేకుండా ఇంటి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో వీలైనన్ని మొక్కుల పెంచుకోవడం ఆరోగ్యదాయకం.



Click it and Unblock the Notifications