Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ వర్షాకాలంలో తడి బట్టలను త్వరగా ఆరబెట్టడం ఎలా ? సింపుల్ ట్రిక్స్
వర్షాకాలం ఆహ్లాదకరంగా అనిపించినా, ఇల్లాలి కష్టాలు తప్పవు. ముఖ్యంగా తడి బట్టలు ఆరబెట్టడం పెద్ద పని. బాల్కనీలో బట్టలు బయట ఉంచినా వర్షపు జల్లుల వల్ల తడిగా ఉంటాయి. వాతావరణంలో తడి వల్ల బట్టలు సులభంగా ఆరవు. అంతే కాకుండా తడి బట్టల నుండి దుర్వాసన వస్తుంది. ఉదయం ఆరబెట్టిన బట్టలు , అవి సాయంత్రం వరకు కూడా ఆరవు. వర్షపు రోజుల్లో మురికి బట్టలు ఉంచుకోలేము! మబ్బులు కమ్ముకున్న రోజు చూసినా బట్టలు విప్పే సాహసం చేశారనుకోండి, మళ్లీ ఆ రోజు మీకు అదే బట్టలు(స్కూల్ పిల్లల యూనఫార్మ్ లు, భర్త ఆఫీస్ డ్రెస్సలు) అవసరం అయితే, అప్పుడు పరిస్థితి ఏమిటి?
తడి బట్టలను త్వరగా ఆరబెట్టడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ట్రిక్స్ ను మీరు అనుసరించడం ద్వారా బట్టలను త్వరగా ఆరబెట్టుకోవచ్చు. వర్షపు రోజులలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ ట్రిక్స్ సహాయంతో తడి బట్టలు వాసన రాకుండా కూడా చేయొచ్చు.

1) బట్టలు ఉతికిన తర్వాత నీళ్ళు బాగా పిండివేసి, బాగా రెండు సార్లు విదిలించి వ్రేలాడదీయాలి. హ్యాండ్ వాష్ లేదా మెషిన్ వాష్, బాగా వ్రేలాడితే తప్ప తేలికగా ఆరవు. సింథటిక్ దుస్తులు కూడా ఇలాగే చేయాలి. తడి బట్టలకు క్లిప్ పెట్టకూడదు.
2) ఇంటిలోపల హ్యాంగర్లపై బట్టలు వేలాడదీయండి, ఇది బట్టలలోని సాగే భాగానికి గాలి చేరుకుంటుంది, బయట తేమ బట్టలు ఆరనివ్వదు. ఇది ఇంటి లోపలి భాగాన్ని కూడా పాడు చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కొన్ని సాధారణ పరిష్కారాలను చేయవచ్చు.
3) తడి బట్టలు ఒకదానిపై ఒకటి వేయద్దు. కొంత మంది స్థలం లేకపోవడంతో చాలా మంది ఇలా చేస్తున్నారు. ప్రతి వస్త్రాన్ని విడివిడిగా వేడల్పు చేసి ఆరబట్టండి. ఇలా చేస్తే బట్టలు త్వరగా ఆరుతాయి.
4) తడి బట్టలు త్వరగా ఆరబెట్టడానికి మరొక పద్ధతి ఉంది. మీరు హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు. అవును, మీరు విన్నది నిజమే. హెయిర్ డ్రైయర్‌ను 'వార్మ్ మోడ్'లో ఉంచండి మరియు తడి బట్టలు నుండి కనీసం 6-7 అంగుళాల దూరంలో ఉంచి ఆన్ చేయండి. నీరు త్వరగా పీల్చుకుంటుంది.
5) ఆరుబయట తడి బట్టలు ఆరబెట్టడం కష్టమైతే ఇంట్లో ఫ్యాన్ క్రింద ఆరబెట్టవచ్చు, ఫ్యాన్ క్రింద ఒక తాడు కంటి తడి బట్టలు వేయండి త్వరగా ఆరిపోతాయి.
6) అస్సలు సమయం లేకపోతే. బట్టలు చాలా త్వరగా ఆరబెట్టాలి. తర్వాత సగం తడిగా ఉన్న బట్టలను టవల్ మీద వేసి నీట్ గా చుట్టాలి. తర్వాత టవల్ మీద ఐరన్ బాక్స్ తో ఐరన్ చేయండి. నెమ్మదిగా ఐరన్ చేయండి. బట్టలలోని అదనపు నీరు గ్రహించి త్వరగా ఆరిపోతాయి.
7) ఎయిర్ కండీషనర్లలో 'డ్రై మోడ్' అనే ఆప్షన్ ఉంటుంది. మీరు దానిని కూడా ఉపయోగించవచ్చు. గదిలో బట్టలు ఆరబెట్టడానికి ఎయిర్ కండీషనర్ యొక్క 'డ్రై మోడ్'ని ఆన్ చేయండి. ఇది నీటిని త్వరగా పీల్చుకుంటుంది. బట్టలు త్వరగా ఆరిపోతాయి.



Click it and Unblock the Notifications