Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
పెట్స్ పెంపకంలో అవగాహణా లోపం...

రకరకాల జాతి కుక్కపిల్లలను పెంచుకోవడానికి పట్టణ ప్రజలే కాకుండా, పల్లె ప్రజలు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇంటిల్లిపాది వారి శ్రేయస్సును కుక్క కోరుకుంటుందనేది అందరికీ తెలిసి విషయమే. అయితే కుక్కలను పెంచుకోవడంలో సరైన అవగాహాన ఉండటం లేదు. శునకాల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ, ఆహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కొందరిలో సైతం ఉండటంలేదు. దీంతో కుక్కలు పెంచుతున్నామని ఆనందమే తప్ప, వాటి పరిరక్షణలో విఫలమవుతున్నారు.
కుక్క పిల్ల పుట్టినప్పటి నుంచి మూడో నెల వరకు రోజుకు కనీసం ఆరు సార్లయినా పాలు పట్టించాలి. మూడు నెలలు దాటితే ఉదయం పాలు, మద్యాహ్నం పప్పు, నెయ్యితో అన్నం, సాయంత్రం పెరుగు అన్నం పెట్టాలి. ముఖ్యంగా వాటికి పెట్టే ఆహారంలో న్యూట్రిషియన్స్, విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, మరియు కాలరీస్ ఉండేలా చూసుకోవాలి.
డాబర్ మాన్, అల్ సేషన్ తదితర జాతులు రాత్రి వేళలో కాపలా ఉండాలి కనుక రాత్రి సమయాలలో భోజనం పెట్టకూడదు. వారానికి మూడు సార్లు మాంసాహారంతో కూడిన భోజనం పెట్టాలి. పెద్ద కుక్కలకు 200 గ్రాముల మాంసం, చిన్న కుక్కలకు 100 గ్రాములు ఇవ్వాలి. ప్రతి రోజు ఉడకపెట్టిన గుడ్డు ఇవ్వాలి.
పుట్టిన దగ్గర నుంచి కుక్క పిల్లలకు ఒక్క సారైనా ఏలిక పాములు, పరాన్న జీవుల నివారణకు మందులు వాడాలి. ఆరు నెలలకు మందు మార్పిడి చేయాలి. అలా చేస్తే కుక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. శునకాలు ఎన్నో రకాల వ్యాదులకు గురవుతూ ఉంటాయి. టీకాలు సక్రమంగా వేయించాలి. ఏదైనా సమస్య వస్తే వెంటనే పశువైధ్యాధికారిని సంప్రదించాలి.
వేసవిలో వాటికి ప్రత్యేకమైనటు వంటి చల్లగా ఉండే విధంగా కేజ్ లను ఏర్పాటు చేయాలి. వేసవిలో వాటి ఎక్కువగా బయట తిప్పకుండా చూడటమే మంచిది. వేసవిలో ఇంట్లో పెంచుకునే కుక్క జీవన విధానంలో ఏదైన మార్పు కనిపించిన వెంటనే వెటర్నరీ డాక్టర్ ను సంప్రదించాలి. వేసవిలో కుక్క ఎక్కువ మంచినీటిని తాగివిధంగా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications
