Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
మీ నిద్ర పాడు చేసే బాధ్యత గల 12 ఉద్యోగాలు.!
మీ బల్ల దగ్గర పనిలో ఉన్నప్పుడు మాంద్యానికి గురైనట్లుగా అని పిస్తుందా లేదా మీ కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నారా? మీరు ఒంటరి వారు కారు. బాగా పని ఒత్తిడి ఉండే పెద్దవారిని ఒక రాత్రికి ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవలసినదిగా సూచిస్తున్నారు. . . . కాని చాల మందికి, ఒక రాత్రి మంచి నిద్ర అంటే అర్ధం నాలుగు గంటల కంటే కొద్దిగా ఎక్కువ సమయం. నిద్రను మార్చుకోవలసివచ్చే ప్రపంచం లోని కొన్ని చెత్త ఉద్యోగాల వైపు ఒక దృష్టి పెట్టండి.
మీ నిద్రను చెడగొట్టే 12 ఉద్యోగాల:

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్
ఉద్యోగ వేళలలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నిద్రకు జారుకోవడం అనే వార్త షిఫ్టు పనిలో ఉండే కష్టాన్ని చూపిస్తుంది. జీవితాలు పణంగా పెట్టినప్పటికీ, కొంతమందికి రాత్రంతా మెలకువగా ఉండటం ఒక సవాలు వంటిది. దీనికి కారణం వారి శరీరగడియారం - కొన్నిసార్లు సిర్కాడియన్ రిథమ్స్ - వారి పనివేళలతో సమకాలీనంగా ఉండకపోవచ్చు. ఈ సైకిల్ ను షిఫ్టు తరహ పని దెబ్బతీస్తుంది, చాలామందికి అనుగుణంగా మార్చడానికి ఇబ్బంది ఉండవచ్చు.

నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్
ఇంటర్నెట్ వలన కూడా షిఫ్టు పనికి కొత్త గిరాకి ఏర్పడింది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ లు వెబ్ ఆధారిత సేవలను 24/7 అందించేవిధంగా హామీ ఇవ్వవలసి ఉంటుంది - అందువలన మీరు పుస్తకాలు కొనవచ్చు, సంగీతం డౌన్లోడ్ చేయవచ్చు, లేదా వెబ్ ఎండి ను మీరు కోరిన సమయంలో వెతకవచ్చు. ఈ షిఫ్టు పనికి ఇబ్బందులు గత దశాబ్దాల కాలం కంటే పనివారు నిద్రకు చాల దూరమైయ్యారు. దీని వల్ల అనేక సమస్యలు ఉన్నాయి.

ఫాక్టరీ పనివాడు
తయారీ పరిశ్రమ ఫాక్టరీ సమయ౦ వృధా కాకుండా కాపాడటానికి, ఉత్పత్తి మరింత పెంచడానికి షిఫ్టు పని మీద ఆధార పడుతుంది. కాని వ్యయాలు ఉన్నాయి. షిఫ్టు పనివారు కాని వారితో పోల్చినప్పుడు, షిఫ్టు పనివారు ప్రధానంగా చాలావరకు పని రోజులలో ఆరు గంటల కంటే తక్కువ నిద్ర పోతారు. మత్తులో ఉన్న లేదా అలసిపోయిన పనివారివలన పనిప్రదేశంలో దెబ్బలు తగిలే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ నిద్ర వలన అధిక రక్తపోటు, డయాబెటిస్, నిరాశతో తోడవుతాయి.

సీనియర్ మేనేజర్లు
మీకు (లేదా మీరే) చికాకుపడే స్వభావం ఉన్న బాస్ ఉన్నట్లయితే, అతి తక్కువ నిద్ర సమస్యలో భాగామౌతుంది. సీనియర్ మేనేజర్లు ఒక జట్టును చూడవలసిన ఒత్తిడితో పనిచేయవలసి ఉంటుంది, అందుకని వారు ఎక్కువ గంటల పాటు తరచుగా ఉంటుంటారు. అధ్యయనాల ననుసరించి మీరు పనిలో ఎక్కువ గంటలు పనిచేస్తే, అతి తక్కువగా నిద్రపోతారు. తక్కువ నిద్ర వలన పనిలో అసంతృప్తి ఉంటుందని ఒక సర్వే లో వెల్లడైంది.

విలేకరులు
24 - గంటల కేబుల్ వార్తల రాక షిఫ్టు పనివారికి ఒక కొత్త రంగాన్ని సృష్టించింది. విలేకరులు, నిర్మాతలు, కెమెరా ఆపరేటర్లు ప్రత్యక్ష వార్తలను రాత్రంతా అందిస్తూనే ఉంటారు. చాల పరిశ్రమలు 24 - గంటల పాటు విధులు నిర్వర్తిస్తునందున, షిఫ్టు పనివారి అవసరం పెరుగుతుంది.

నర్సులు, డాక్టర్లు
నర్సులు, డాక్టర్లు తరచూ 12-గంటలు తిరిగే షిఫ్టు లలో అంతం లేకుండా ప్రవాహంల వచ్చే రోగుల కోరికలను తీర్చడానికి పనిచేస్తుంటారు.

ఫైనాన్షియల్ అనలిస్ట్
నిద్ర కోల్పోయే వారు మాత్రమే షిఫ్టు పనివారు కారు. యూరప్, ఆసియా వంటి విదేశీ మార్కెట్లలో కొంత మంది ఫైనాన్సియల్ అనలిస్ట్ లు ప్రత్యేకత కల్గి ఉంటారు. టైం లో ఉన్న తేడాల వలన ఆ మార్కెట్లలో ఒక కన్ను వేసి ఉంచాలంటే సమయం కాని వేళలలో పని చేయడం అవసరం. విజయవంతమైన వృత్తి పనివారు ఎక్కువ గంటలు పనిచేయడానికి కూడా ఇష్టపడతారు.

పోలిస్ ఆఫీసర్
రాత్రి, పగలు ప్రజలను రక్షించి, సేవచేయడానికి, చాల పోలిస్ శాఖల వారు షిఫ్టు లను ఉపయోగిస్తారు. దీని వలన ఒక్క అధికారి కూడా విరామం లేదా కష్టకాలంలో సెలవు లేకుండా 24-గంటలు పనిచేయవలసి ఉంటుంది. కాని తిరుగాడే షిఫ్టు ల వలన కొన్ని సవాళ్ళు ఉన్నాయి - ఒక రకమైన షెడ్యుల్ ను అనుసరించడం అసాధ్యం. ఒక రాత్రి షిఫ్టు, ఒక పగటి షిఫ్టు మధ్య మారడం కంటే ఒక పగటి షిఫ్టు నుండి మధ్యాహ్న షిఫ్టు కు మారడం ఎంతో సమస్యగా ఉంటుంది.

విమాన పైలెట్
వాణిజ్య విమానాలను నడపడం ఒక మంచి రాత్రి నిద్రను మూడు రకాలుగా దెబ్బతీస్తుంది. రకరకాల టైం జోన్లలో ప్రయాణించడం వలన పైలెట్లు అపసవ్యమైన గంటలు, ఎక్కువసేపు షిఫ్టు లు, జెట్ లాగ్ ఎదుర్కోవలసి ఉంటుంది. పైలట్ అలసటను తగ్గించడానికి, ఎఫ్ ఏ ఏ విమాన సమయం, విరామసమయం పై ఖచ్చితమైన మార్గదర్శకాలను పాటిస్తుంది. 24 గంటలలో ఒక ప్రయాణాన్ని పూర్తి చేసే ముందు, పైలెట్ లు తప్పనిసరిగా కనీసం ఎనిమిది గంటల పాటు అంతరాయం లేకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరం.

కొత్త తలిదండ్రులు మీ నిద్రను భగ్నం చేయడానికి గొప్ప సామర్ద్యం కల్గిన ఒక మంచి ఉద్యోగం: తలిదండ్రులు. కొత్తగా పుట్టిన శిశువు ప్రతి రెండు గంటల కొకసారి నిద్రలేచినప్పుడు, తల్లికి లేదా తండ్రికి గట్టిగా గాఢ నిద్ర పోవడమనేది అసాధ్యం. ఒక అధ్యయనంలో కొత్త తల్లులు రాత్రి వేళ్ళలో ఏడు గంటల పాటు నిద్ర పోయినప్పటికీ ముక్క ముక్కలుగా ఉండి, హుషారు నిచ్చేది మాత్రం కాదని తేలింది. అదృష్టవశాత్తు, శిశువుకు 16 వారాల వయస్సు వచ్చిన తర్వాత సాధారణంగా పరిస్థితి మెరుగౌతుంది.

ట్రక్ డ్రైవర్
ట్రాక్ డ్రైవర్లు రాత్రి కాలంలో ఎక్కువ సేపు రోడ్డు పై ప్రయాణిస్తారు, పగటి ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి, సరకు రవాణాకు ఉన్న గట్టి షెడ్యూల్ ను తట్టుకోవడానికి రెండూను. కాని ఈ ఉద్యోగంలోనే నిద్రలేమి వలన కలిగే సమస్యలు బాగా- తెలియచేయబడ్డాయి. యునైటెడ్ రాష్ట్రాలలో పని-సంబంధిత మరణాలలో రోడ్డు ప్రమాదాలు మొదటి స్థానంలో ఉన్నాయి. మత్తుగా డ్రైవింగ్ చేయడం తరచూ ఒక కారణమౌతుంది.

బార్ టెండర్
బార్లు కనీసం మధ్య రాత్రి 2 గంటల వరకు, కొన్ని నగరాలలో అయితే రోజంతా, తెరిచి ఉంచడం వలన, బార్ టెండర్ లు దాదాపు రాత్రి అంతా పని చేస్తూనే ఉంటారు. కొంత మంది ఇటువంటి షెడ్యూల్ కు అలవాటు పడతారు, కారణం వారు "గుడ్లగూబల వంటి వారు" - వారు సాధారణంగా రాత్రి పూట అప్రమత్తంగా ఉంటారు. ఈ షిఫ్ట్ ను స్వీకరించడానికి కారణం అదే షెడ్యూల్ ను పని లేని రోజులలో కూడా నిర్వహించుకోవడానికి. ఒకవేళ మీరు భరద్వాజ పక్షి లాంటి వారైతే, దీనిని ఎన్నటికి స్వీకరించలేరు.
రాత్రిపూట పనిచేయడానికి చిట్కాలు:
షిఫ్టు పనిని స్వీకరించడానికి ఉత్తమమైన పద్ధతి వారాంతంలో కూడా తప్పనిసరిగా అదే షిఫ్టు ను అనుసరించడం. అది సాధ్యం కాకపోతే, రాత్రి షిఫ్టు లలో పనిచేస్తున్నప్పుడు మీకు దాదాపుగా బాగా అలసటకు గురి కావచ్చు. కాని కొన్ని వ్యూహాలు మీరు అప్రమత్తంగా ఉండటానికి సహాయం చేస్తాయి. ఒంటరిగా కాక, ఇతరులతో కలసి పని చేయండి. మీ షిఫ్టు ప్రారంభానికి ముందు కెఫీన్ ఉన్న పానీయాన్ని తాగండి. కాసేపు నడవండి లేదా మీ విరామసమయంలో కొంత వ్యాయామం చేయండి. కునుకు తీసేందుకు అవకాశం ఉంటే, ఒక సారి ప్రయత్నించి చూడండి.
పగటి పూట నిద్రకు చిట్కాలు:
చాలామందికి పగలు నిద్రపోవడం చాల కష్టమైనప్పటికి, కొన్ని పనికి వచ్చే ఉపాయాలు ఉన్నాయి. పని నుండి ఇంటికి వెళ్ళేప్పుడు, చలువ కళ్ళద్దాలు పెట్టుకొని ఎండకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు మీ బెడ్ రూమ్ ను చీకటిగా ఉంచండి లేదా కళ్లపై తొడుగును ధరించండి. పగటి ధ్వనులకు దూరంగా ఉండటానికి చెవులలో ప్లగ్ లను పెట్టుకోండి. మీ మెదడుకు ఇప్పుడు నిద్ర సమయం అనిపించే విధంగా నిద్ర వేళల్లో అలవాటుగా, ఏదైనా చదవండి లేదా స్నానం వంటివి చేయండి



Click it and Unblock the Notifications











