Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
Sucide: ఆత్మహత్యలు ఎక్కువగా ఉండే దేశం ఏదో తెలుసా? షాకింగ్ నిజం వెలుగులోకి
ఒకప్పుడు ఆత్మహత్య అంటే ఎక్కడో ఒకటి ఉండేది. ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకునేవాళ్ల సంఖ్య భారీగానే ఉంటోంది. కొందరు ఆర్థిక కారణాలతో,ప్రేమలో ఫెయిల్ అయ్యామని, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అని మరికొందరు,ఒంటరితనాన్ని భరించలేకపోతున్నామని, రిలేషన్స్ లో మోసపోతున్నామని ఇలా రకరకాల కారణాలతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే చాలామంది మనదేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు ఉంటాయని పొరబడుతుంటారు. అయితే వాస్తవంలో ఇది ఏ మాత్రం నిజం కాదు. అభివృద్ధి చెందిన దేశాలే ఆత్మహత్యల్లో ముందువరుసలో ఉన్నాయని మీకు తెలుసా?
అత్యున్నత జీవన ప్రమాణాలు, బలమైన ఆర్థిక వ్యవస్థలు, అద్భుతమైన హెల్త్ కేర్ ఉన్న దేశాల్లో కూడా సూసైడ్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్న 10 దేశాల ఏవి, ఆ దేశాల్లో ఆత్మహత్యలకు ఏం కారణాలు ఉంటున్నాయో ఇక్కడ చూడండి.

సౌత్ కొరియా
దక్షిణ కొరియా పేరు వినగానే అక్కడి టెక్నాలజీ,సంస్కృతి,ఫుడ్ గుర్తుకువస్తాయి. ఆసియా పులిగా పేరుపొందిన సౌత్ కొరియా ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్యల రేటుతో అగ్రస్థానంలో ఉంది. ఇక్కగ సగటున లక్షకు 24 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సాంకేతికంగా, ఆర్థికంగా దూసుకుపోతున్న సౌత్ కొరియా తీవ్రమైన మానసిక వేదనతో పోరాడుతోంది. ఇక్కడి సమాజంలో పాతుకుపోయిన తీవ్రమైన పోటీతత్వం, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉండే అసాధారణమైన ఒత్తిడి యువతను కుంగదీస్తున్నాయి. దీనికి తోడు దేశంలోని 5 కోట్ల జనాభాకు కేవలం 4000 మంది మానసిక వైద్యులు మాత్రమే అందుబాటులో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మానసిక సమస్యల పట్ల ఉన్న చిన్నచూపు, సహాయం కోరడానికి వెనుకాడటం వంటి సామాజిక కారణాలు కూడా ఈ విషాదాన్ని పెంచుతున్నాయి.
తూర్పు యూరప్ దేశాలు
లిథువేనియా (లక్షకు 21), హంగేరీ (లక్షకు 16)దేశాలు ఒకప్పుడు సోవియట్ యూనియన్ నీడలో బతికాయి. అయితే సోవియట్ యూనియన్ పతనం తర్వాత ఈ దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రమైన మార్పులకు లోనయ్యాయి. ఈ మార్పులు సామాజిక అస్థిరతను, గుర్తింపు సంక్షోభాన్ని సృష్టించాయి. పేద, గ్రామీణ ప్రాంతాల్లో నిరాశ, నిస్పృహలు ఎక్కువగా కనిపిస్తాయి. గతం నుండి వర్తమానంలోకి మారే క్రమంలో చాలామంది తమను తాము కోల్పోతున్నారు.
బాల్టిక్ దేశాలు
ఎస్టోనియా (లక్షకు 14), లాట్వియా (లక్షకు 14.9) వంటి బాల్టిక్ దేశాలు కూడా అభివృద్ధి చెందినప్పటికీ మద్యపానం, సామాజిక ఒంటరితనం వంటి సమస్యల కారణంగా అధిక ఆత్మహత్యల రేటుతో సతమతమవుతున్నాయి.
జపాన్
క్రమశిక్షణకు మారుపేరైన జపాన్‌లో, సామాజిక ఒత్తిడి, పని సంస్కృతి, ఆర్థిక మాంద్యం ప్రజలను మానసికంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా 20-44 ఏళ్ల పురుషులలో మరణానికి ప్రధాన కారణంగా ఆత్మహత్య నిలుస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. COVID-19 మహమ్మారి ఈ ఒంటరితనాన్ని మరింత పెంచింది. ఇక్కడ సగటున లక్షకు 15 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
బెల్జియం
పశ్చిమ ఐరోపాలో అత్యధిక ఆత్మహత్యల రేటు ఉన్న దేశం ఇది. సంపద, సౌకర్యాలు ఉన్నప్పటికీ మానసిక ఆరోగ్యం ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి బెల్జియం ఒక ఉదాహరణ. లక్షకు 14.6 మంది సగటున బెల్జియంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
అమెరికా
అమెరికా అంటే ఆనందమానందమాయే అని మనసులో పాట పాడుకుంటూ అక్కడ అంతా ఆనందమే ఉంటుంది,అదేదో స్వర్గలోకం అన్నట్లు కలలు కంటుంటారు కొందరు. అయితే ఇక్కడ ఆత్మహత్యలను నిరాశ మరణాలు (Deaths of Despair) అని పిలుస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగం, మద్యపానం, ఆర్థిక అసమానతలు, సామాజిక సంబంధాలు బలహీనపడటం వంటివి ఇక్కడి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. లక్షకు 14.1మంది అమెరికన్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఫిన్లాండ్
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్య, ఆరోగ్య వ్యవస్థలు కలిగి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా పేరుగాంచిన ఫిన్లాండ్ కూడా ఈ జాబితాలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యం అనేది కేవలం భౌతిక సౌకర్యాలకు సంబంధించినది కాదని అంతకంటే లోతైనదని నిరూపిస్తోంది. లక్షకు 12.9మంది ఫిన్లాండ్ లో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

భారతదేశం
ప్రపంచ దేశాల పరిస్థితి ఇలా ఉంటే మన భారతదేశం కూడా ఈ విషాదానికి అతీతం కాదు. 2022లో దేశంలో 1,71,000 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఇది 2021 కంటే 4.2 శాతం ఎక్కువ. లక్ష జనాభాకు ఆత్మహత్యల రేటు 12.4కి పెరిగింది. వ్యవసాయ సంక్షోభం, కుటుంబ కలహాలు, పరీక్షల ఒత్తిడి, నిరుద్యోగం, మానసిక సమస్యలపై అవగాహన లేకపోవడం వంటివి మన దేశంలో ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ సంఖ్య రాబోయే సంవత్సరాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆత్మహత్యల నివారణ అనేది ప్రభుత్వాల బాధ్యతే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత. మన చుట్టూ ఉన్నవారి మానసిక స్థితిని గమనిస్తూ వారికి అండగా నిలబడి, సహాయం కోరడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు.



Click it and Unblock the Notifications