Latest Updates
-
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.!
చాలా మంది తమకు తాము తమలో ఆత్మవిశ్వాసం ఉందని అనుకుంటారు. కానీ దానిపైన ఎవరికీ స్పష్టమైన అవగాహన ఉండదు. ఆత్మవిశ్వాసం అంటే మీరు ఎవరితోనైనా అనర్గళంగా మాట్లాడటం అని అర్థం కాదు. అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి.. మీరు ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపే అంశాలు ఏంటి.. దానిని ఎలా నిర్ధారించుకోవాలి. నిపుణుల అభిప్రాయాలు చూద్దాం..

ఆత్మవిశ్వాసం అంటే మీ మానసిక బలాన్ని సమాజానికి, మీకు ప్రదర్శించేది. మీ బలాబలాలతో పాటు పరిమితులపైనా మీకు ఒక అవగాహన ఉంటుంది. అలాంటి ఆత్మవిశ్వాసంతో మీరు సవాళ్లను ఎదుర్కోగలరు. ముఖ్యంగా ఐదు విషయాలు మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా లేదా అని నిర్ధారిస్తుంది.
నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
మీ జీవితంలో కఠినమైన పరిస్థితుల్లోనూ నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం మీకు ఉన్నట్లయితే మీలో ఆత్మవిశ్వాసం మెరుగ్గా ఉన్నట్లు. ఆ నిర్ణయం ఆధారంగా జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు. అయితే కొన్ని విషయాల్లో భయపడి ఇతరుల సలహాపైన ఆధారపడతారు. ఇతురుల అభిప్రాయాలపైన కాకుండా మీ అంతరాత్మను నమ్మి నిర్ణయాలు తీసుకుంటే దాని తర్వాత పరిణామాలకు కూడా మీరు ధైర్యంగా బాధ్యత వహించగలరు.
ఇతరుల అభిప్రాయాల గురించి ఆలోచించరు..
ఆత్మవిశ్వాసానికి మరో ముఖ్య లక్షణం ఏమిటంటే, మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, వారు మిమ్మల్ని ఇష్టపడతారా లేదా అని మీరు పట్టించుకోకపోవడం ఆత్మవిశ్వాసానికి మరో లక్షణం. వారి ఆమోదం కోసం మీరు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. అయితే, అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుందని గమనించాలి. సింపుల్‌గా చెప్పాలంటే ఎదుటి వారి విమర్శలతో మీరు కుంగుబాటుకి గురికారు.

కాదని చెప్పడానికి భయపడరు..
మీరు ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి అయితే మీ లిమిట్స్‌ను మీరే నిర్ణయించుకుంటారు. మీరు బిజిగా ఉన్నా, చిన్న చిన్న పనులు చేయించుకోవడానికి మీ పైన ఆధారపడతుంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోకుండా కాదు అని చెప్పేసి మీ విలువను పెంచుకుంటారు. కొంతమంది అలా చెప్పలేరు. ఒకవేళ చెప్పినా తర్వాత అపరాధభావంతో కుంగిపోతారు.

వాస్తవాలను తెలుసుకుని మాట్లాడతారు..
ఆత్మవిశ్వాసం అంటే నలుగురిలో మీరు బహిరంగంగా ఎంత మాట్లాడతారు అనే విషయం కాదని గమనించాలి. కఠిన పరిస్థితుల్లో కూడా, మీరు మీ అభిప్రాయాలను ఎంత ప్రశాంతంగా, వాస్తవాలతో తెలియజేస్తారు అనేది ముఖ్యం. మీరు చేస్తున్న పని గురించి, మాట్లాడుతున్న విషయాల గురించి ఖచ్చితమైన జ్ఞానం, సమాచారం ఉంటేనే ఆ ఆత్మవిశ్వాసం మీకు వస్తుంది.
ఇతరులతో పోల్చుకోరు..
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్నట్లయితే మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడానికి ఇష్టపడరు. బయట, లేదా సోషల్ మీడియాలో ఎవరైనా అందంగా కనిపించినా, విలాసవంతంగా గడుపుతూ ఉన్నా.. ఆ అంశాలను చాలా లైట్ తీసుకుని వారితో మిమ్మల్ని పోల్చుకోరు. మిమ్మల్ని మీరు తక్కువగా భావించుకోరు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు మానసికంగా దృఢంగా ఉంటారు.



Click it and Unblock the Notifications
